1
00:00:06,507 --> 00:00:10,177
ఏ ఎఫ్ సి రిచ్మండ్ సొంత అభిమానుల చేతిలో
గేలి చేయబడడాన్ని మీరు వింటున్నారు.

2
00:00:10,260 --> 00:00:13,472
<i>దానికి కారణం లేకపోలేదు.</i>

3
00:00:13,972 --> 00:00:15,807
2-0. మనం ఇంతకంటే బాగా ఆడగలం!

4
00:00:16,683 --> 00:00:20,187
జేమీ. జేమీ. సారీ. నీకు కావల్సినపుడు
నేను బాల్ పాస్ చేయలేదు.

5
00:00:21,104 --> 00:00:22,105
దాని గురించి వదిలేయ్, మిత్రమా.

6
00:00:22,189 --> 00:00:24,691
హేయ్, నీ ఆట కొంచెం మెరుగుపరుచుకోవడానికి

7
00:00:24,775 --> 00:00:26,735
నేనొక సలహా ఇస్తే వేరేగా తీసుకోవుగా?

8
00:00:26,818 --> 00:00:27,819
అదేం లేదు, ఏంటో చెప్పు.

9
00:00:27,903 --> 00:00:31,281
ఏం చేయాలంటే, ఒక టైం మెషీన్ సంపాదించి,
కాలంలో వెనక్కి వెళ్లి,

10
00:00:31,365 --> 00:00:34,493
నువ్వు మీ అమ్మ కడుపులో పడే సమయానికి
ఆమెని ఆపి,

11
00:00:34,576 --> 00:00:39,248
అర్జెంటినా తీసుకువెళ్లి మారడోనా
దగ్గరికి పంపించు.

12
00:00:41,124 --> 00:00:42,334
అది పనిచేయొచ్చు.

13
00:00:43,252 --> 00:00:44,503
అంతే, అయిపోయింది.

14
00:00:45,212 --> 00:00:47,005
అందర్నీ ఇలా అవమానిస్తే ఇకపై ఊరుకోను.

15
00:00:48,423 --> 00:00:53,512
అంటే, నేనొక ముసలివాడ్ని చితక్కొట్టాలి,
లేదంటే ముసలివాడితో కొట్టించుకోవాలి.

16
00:00:56,557 --> 00:00:57,558
వదిలేయ్. కొట్టుకుందాం.

17
00:00:58,016 --> 00:00:59,268
నిన్నసలు

18
00:01:00,185 --> 00:01:01,770
హేయ్, హేయ్, హేయ్!

19
00:01:03,647 --> 00:01:05,274
ఆగండి, ఆగండి, రిలాక్స్!

20
00:01:05,357 --> 00:01:07,359
కోచ్, నా ఫైట్ క్లబ్ మొదటి రూల్
ఏంటో వీళ్ళకి చెప్పు.

21
00:01:07,442 --> 00:01:10,320
-ఇది ఫైట్ క్లబ్ కాదు!
-ఫైట్ క్లబ్ కాదు. ఓకే? అర్థమయిందా?

22
00:01:11,029 --> 00:01:14,199
పిస్టల్ పీట్ కోసమన్నా నా మాట వినండి.
మనం మ్యాచ్ రెండో సగం ఆడాలి.

23
00:01:14,283 --> 00:01:16,118
అందరూ కూర్చోండి, ప్లీజ్. అందరూ.

24
00:01:18,579 --> 00:01:20,080
బాస్ నిన్ను రక్షించాడు, ముసలోడా!

25
00:01:24,209 --> 00:01:25,586
ఇంకోసారి నన్ను ముసలోడా...

26
00:01:26,879 --> 00:01:27,880
అని అన్నావనుకో.

27
00:01:32,050 --> 00:01:33,051
సారీ...

28
00:01:34,678 --> 00:01:35,888
ముసలి తాతా.

29
00:01:35,971 --> 00:01:37,681
నిన్నసలు ఏం చేస్తానో చూడు.

30
00:02:00,871 --> 00:02:06,335
టేబుల్ ఫోర్ పూర్తయింది,
ఇకపై దీన్ని బోరింగ్ టేబుల్ అని పిలవాలి.

31
00:02:06,960 --> 00:02:08,419
నేను కూర్చునేది అక్కడే.

32
00:02:10,672 --> 00:02:13,759
ఇంకా ఎలైన్ కెన్నర్ కి కేటాయించలేదు.
ఆవిడ మంచిది కాదు.

33
00:02:13,842 --> 00:02:17,262
ఆమె ఈరోజు రాదు. తన గుర్రం
ఆమె మొహంపై తన్నింది.

34
00:02:17,346 --> 00:02:19,431
పాపం. గుర్రం బాగానే ఉందా?

35
00:02:23,352 --> 00:02:25,854
చూడబోతే మన టీం రెండుగా చీలినట్లుంది.

36
00:02:26,522 --> 00:02:28,273
కోచ్, నేనిప్పుడు ఏమాలోచిస్తున్నానో
తెలుసా?

37
00:02:28,357 --> 00:02:30,734
-<i>వెస్ట్ సైడ్ స్టొరీ సినిమా</i>?
-అవును. వీళ్ళే షార్క్స్, జెట్స్.

38
00:02:30,817 --> 00:02:31,818
జిమ్ లో డాన్స్ చేసి...

39
00:02:31,902 --> 00:02:34,696
...సమస్యల్ని పరిష్కరించుకునే వాళ్ళలాగా
కనిపిస్తున్నారా?

40
00:02:34,780 --> 00:02:36,406
నాకు గుర్తున్నంత వరకూ, ఆ సినిమాలో

41
00:02:36,490 --> 00:02:40,035
రిఫ్, బెర్నర్దో ఆ సంఘటనలో
పొడుచుకుని చంపుకునే వరకూ వెళ్తారు.

42
00:02:40,118 --> 00:02:42,329
లేదు, ఆ తర్వాత ఫైటింగ్ జరిగేవరకూ
వాళ్ళు చనిపోరు.

43
00:02:42,412 --> 00:02:43,497
అవును, అవును.

44
00:02:43,580 --> 00:02:45,582
నాకు 15 ఏళ్ళప్పుడు, అనిత రోల్ నేను
వేసేవాడిని.

45
00:02:46,667 --> 00:02:47,876
బాయ్స్ స్కూల్ కదా.

46
00:02:49,002 --> 00:02:51,713
నేథన్ గురించి ఇంకో ముఖ్యమైన విషయం
తెలిసిందే.

47
00:02:52,130 --> 00:02:53,674
కోచ్ బియర్డ్!

48
00:02:54,466 --> 00:02:58,804
రాత్రి డిన్నర్ కి చికెన్ గానీ,
స్టేక్ గానీ!

49
00:02:58,887 --> 00:03:00,347
రెండిటినీ ఎంచుకోకూడదు!

50
00:03:00,848 --> 00:03:01,974
ఓకే!

51
00:03:02,057 --> 00:03:03,475
దొరికిపోయాను.

52
00:03:03,559 --> 00:03:04,685
ఇంకా టెడ్!

53
00:03:06,019 --> 00:03:09,314
-చెప్పండి!
-మీతో పాటు వచ్చే పార్ట్నర్ ఎవరు?

54
00:03:09,398 --> 00:03:12,192
ఇంకెవరు, మిస్టర్. టూ ఎంట్రీస్ యే.

55
00:03:12,276 --> 00:03:14,945
కుదరదు, అతను తన డేట్ తో వస్తున్నారు.

56
00:03:18,073 --> 00:03:19,324
హేయ్, రాత్రికి నువ్వు ఖాళీనే కదా?

57
00:03:19,700 --> 00:03:21,910
-నేను ఏ రాత్రయినా ఖాళీనే. అవును.
-ఓకే.

58
00:03:21,994 --> 00:03:24,121
-నేను నేథన్ ని తీసుకొస్తాను!
-ఎవరిని?

59
00:03:24,496 --> 00:03:26,623
నేట్ ది గ్రేట్! ఈరోజు అతనే నా డేట్!

60
00:03:26,707 --> 00:03:29,585
కొన్ని కారణాల వల్ల మేము టేబుల్ ఎయిట్
కోరుకుంటున్నాం!

61
00:03:30,294 --> 00:03:31,295
కుదరదు!

62
00:03:31,879 --> 00:03:33,463
బియర్డ్, మీరు చికెన్ తింటున్నారు!

63
00:03:37,509 --> 00:03:38,510
హేయ్, బాస్.

64
00:03:38,594 --> 00:03:40,637
పైజమా ఫ్రైడే? ముందే తెలిసుంటే బాగుండేది.

65
00:03:40,721 --> 00:03:42,639
మీకీ కథ కచ్చితంగా నచ్చుతుంది.

66
00:03:42,723 --> 00:03:44,933
-నాకు 17 ఏళ్ళప్పుడు...
-టెడ్, అక్కడే ఆపు,

67
00:03:45,017 --> 00:03:47,394
నువ్వు చెప్పబోయే వెకిలి పైజమా కథ
నేను వినాలని అనుకోవట్లేదు.

68
00:03:47,477 --> 00:03:49,313
ఓకే. నీ మనసు మారితే నాకు చెప్పు,

69
00:03:49,396 --> 00:03:51,190
ఎందుకంటే ఇది అద్భుతమైన కథ.

70
00:03:51,773 --> 00:03:53,859
సారీ, నీకు అర్జెంటుగా ఏదైనా కావాలా?
ఎందుకంటే నేను వెంటనే...

71
00:03:53,942 --> 00:03:56,987
రాత్రికి నేను, రాయ్, జేమీ అందరం
ఒకే టేబుల్ దగ్గర కూర్చోవాలని నా కోరిక.

72
00:03:57,070 --> 00:03:58,071
-అది సాధ్యమవుతుందా?
-అవుతుంది.

73
00:03:58,155 --> 00:04:00,949
మంచిది! ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యా
సయోధ్య కుదర్చడానికి ఇదో మంచి అవకాశం.

74
00:04:01,033 --> 00:04:02,951
-టెడ్, సరే అని చెప్పానుగా.
-అవును.

75
00:04:03,785 --> 00:04:06,121
ఓరి దేవుడా, అది అద్భుతంగా ఉంది, కానీ...

76
00:04:07,456 --> 00:04:09,374
ఇకపై నాకు బాగుంటుందో లేదో.

77
00:04:09,458 --> 00:04:11,376
తప్పకుండా బాగుంటుంది.
ఫ్యాషన్ అంటేనే ఆత్మవిశ్వాసం.

78
00:04:11,460 --> 00:04:14,421
నాకు అది లేకపోయి ఉంటే, నా హైస్కూల్
ఫేర్ వెల్ రోజు పైజమా వేసుకుని,

79
00:04:14,505 --> 00:04:15,881
చివరికి రాత్రంతా జైల్లో గడిపేవాడిని కాదు.

80
00:04:15,964 --> 00:04:17,841
కానీ మీకు వినాలని లేదు కాబట్టి,
దాని గురించి చెప్పను.

81
00:04:17,925 --> 00:04:19,176
మిమ్మల్ని విసిగించడం ఆపేస్తాను. సరేనా?

82
00:04:19,259 --> 00:04:21,803
ఈ డాన్సింగ్ పార్టీ గురించి చాలా
టెన్షన్ గా ఉన్నట్లున్నారు. అవునా?

83
00:04:21,887 --> 00:04:23,305
లేదు, అదేం లేదు. నేను బాగున్నాను.

84
00:04:23,388 --> 00:04:26,141
రూపర్ట్, నేను కలిసి గాలా నిర్వహించేటపుడు,

85
00:04:26,225 --> 00:04:28,060
మొత్తం పనంతా నేనే చేసేదాన్ని.

86
00:04:28,143 --> 00:04:29,603
కాబట్టి నాకు ఏ మాత్రం టెన్షన్ లేదు.

87
00:04:29,686 --> 00:04:32,564
నిజానికి నేను చాలా ఉత్సాహంగా,
కూల్ గా ఉన్నాను.

88
00:04:32,648 --> 00:04:34,858
గుడ్ ఆఫ్టర్ నూన్. మనకో పెద్ద సమస్య
వచ్చింది.

89
00:04:34,942 --> 00:04:37,819
మన మ్యూజికల్ గెస్ట్, రాబీ విలియమ్స్,
కాన్సిల్ చేశారు.

90
00:04:37,903 --> 00:04:38,904
దేవుడా!

91
00:04:38,987 --> 00:04:40,113
అయ్యో. ఎవరతను?

92
00:04:40,197 --> 00:04:44,952
లేదు, లేదు. అదేమీ సమస్య కాదు.
నన్ను ఆలోచించనివ్వండి.

93
00:04:45,035 --> 00:04:47,204
సరే, హిగ్గిన్స్. మనం ఏం చేయాలంటే,

94
00:04:47,287 --> 00:04:50,374
రాబీ కాన్సిల్ చేశాడని నేను రాత్రికి
అందరికీ చెప్పే సమయానికి,

95
00:04:50,457 --> 00:04:54,086
నువ్వు ఎవరో ఒకరిని సిద్ధం చేస్తావు కాబట్టి
అదసలు సమస్యే కాదు.

96
00:04:54,461 --> 00:04:56,171
-అదిరింది.
-అవును.

97
00:04:56,255 --> 00:05:00,092
నాలాగా సమస్యల్ని ఎవరూ పరిష్కరించలేరు.

98
00:05:00,175 --> 00:05:03,554
అదిగో, దొరికింది. పట్టుకో! చూడు!

99
00:05:04,555 --> 00:05:06,139
నువ్వు చెయ్యగలవు, హిగ్గిన్స్!

100
00:05:06,223 --> 00:05:08,183
నువ్వు పడే కష్టానికి రెబెక్కా
రుణపడి ఉంటుంది.

101
00:05:08,267 --> 00:05:09,268
థాంక్యూ, టెడ్!

102
00:05:16,984 --> 00:05:18,485
నాకు నచ్చలేదు, బేబీ.

103
00:05:18,569 --> 00:05:21,780
నేను నాలా లేను. హుడ్ లేదు, జిప్స్ లేవు.

104
00:05:25,409 --> 00:05:26,493
గ్రాఫిటీ లేదు.

105
00:05:27,077 --> 00:05:29,037
ఛ, నేను బ్యాంకర్ లాగా ఉన్నాను.

106
00:05:29,121 --> 00:05:31,582
ఒంటికి అంటుకు పోయిన ప్యాంట్ తో అస్సలు
అలా లేవు.

107
00:05:31,665 --> 00:05:34,293
బాగుంది. హ్యాండ్ సమ్ గా ఉన్న బ్యాంకర్.

108
00:05:34,376 --> 00:05:36,461
నువ్వలా లేకపోయి ఉంటే, మనం కలిసుండే
వాళ్ళం కాదు.

109
00:05:38,422 --> 00:05:39,423
ఏదో ఒకటిలే.

110
00:05:39,840 --> 00:05:40,841
ఓకే.

111
00:05:40,924 --> 00:05:44,720
నువ్వు ఫ్యాషన్ ని ఎంత ఎక్కువగా ఫాలో అయితే,
నీకు అంత ఫాలోయింగ్ ఉంటుంది.

112
00:05:44,803 --> 00:05:46,555
నీ బ్రాండ్ విలువ పెంచడంలో సాయం చేస్తున్నా.

113
00:05:47,681 --> 00:05:49,391
జేమీ, వద్దు. ఏం చేస్తున్నావ్?

114
00:05:49,474 --> 00:05:50,684
నేను చేసేదే...

115
00:05:51,852 --> 00:05:52,895
స్టైల్.

116
00:05:53,770 --> 00:05:57,149
జనాలకి తెలీదు, కానీ ఫ్యాషన్ గురించి
నాకు బాగా తెలుసు.

117
00:05:57,232 --> 00:05:59,610
-నిజంగా?
-అవును, నాకు తిరుగు లేదు.

118
00:05:59,985 --> 00:06:01,028
ఓ, అవునా?

119
00:06:01,820 --> 00:06:03,322
హే, కిందకి వెళ్ళు, బాబు.

120
00:06:05,490 --> 00:06:07,242
మంచి పిల్లాడివి. కావలిసింది కనిపెట్టు.

121
00:06:09,828 --> 00:06:11,163
హేయ్, హనీ.

122
00:06:11,246 --> 00:06:14,374
అయ్యో, నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నా.
నీ మెసేజ్ అందింది.

123
00:06:14,458 --> 00:06:17,461
నేను చేస్తే నువ్వు దొరకవు, నువ్వు చేస్తే
నేను దొరకను.

124
00:06:18,337 --> 00:06:19,713
హేయ్. ఒక విషయం చెప్పనా.

125
00:06:19,796 --> 00:06:21,965
నేను తెచ్చుకోవాలని నువ్వు చెప్పిన
సూట్ వేసుకున్నాను.

126
00:06:22,049 --> 00:06:23,926
నువ్వు చెప్పిందే నిజం, ఎప్పటిలాగే.

127
00:06:25,177 --> 00:06:29,515
అవును. ఓకే, అంతే.
ఐ లవ్... ఐ మిస్ యు.

128
00:06:29,598 --> 00:06:32,142
నా బదులు బాబుకి ఒక ముద్దివ్వు.

129
00:06:32,226 --> 00:06:33,644
మళ్ళీ మాట్లాడతా. బై.

130
00:06:35,771 --> 00:06:37,397
హే. బాగున్నావా.

131
00:06:37,481 --> 00:06:39,149
నీ మ్యూజిక్ బాగుంది.

132
00:06:39,233 --> 00:06:40,317
ఇదిగో తీసుకో.

133
00:06:41,985 --> 00:06:43,946
ఏయ్, ఎలా ఉన్నావో చూడు.

134
00:06:44,029 --> 00:06:45,489
-మరీ ముందే వచ్చేశానా.
-లేదు.

135
00:06:45,572 --> 00:06:47,366
లేదా లేట్ అయ్యానా. మధ్యలో వేరే పని పడింది.

136
00:06:47,449 --> 00:06:49,284
అదేం లేదు. సరైన సమయానికే వచ్చావ్, నేట్.

137
00:06:49,368 --> 00:06:50,536
-మంచిది.
-అవును, సాధించావ్.

138
00:06:51,119 --> 00:06:52,788
హేయ్, నిన్నొకటి అడగనా.

139
00:06:52,871 --> 00:06:55,207
ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ఫ్రెండ్స్ అంటే,

140
00:06:55,290 --> 00:06:58,210
-నీకు ఇష్టమేనా?
-ఖచ్చితంగా.

141
00:06:58,293 --> 00:07:01,046
ఓకే, గుడ్.
నీకు నీ సూట్ అస్సలు ఫిట్ అవ్వలేదు.

142
00:07:01,129 --> 00:07:02,965
-నిజమా?
-అవును.

143
00:07:03,048 --> 00:07:05,759
నేను కొనాలనే అనుకున్నాను గానీ,
అవి చాలా ఖరీదు.

144
00:07:05,843 --> 00:07:07,678
-అందుకే మా నాన్నని అడిగి తీసుకున్నా.
-అవునా.

145
00:07:08,262 --> 00:07:10,430
హే. దారిలో ఒక చోట ఆగుదాం. కమాన్, నాతో రా.

146
00:07:10,514 --> 00:07:11,348
అవును.

147
00:07:15,769 --> 00:07:16,728
రిచ్మండ్ థియేటర్

148
00:07:16,812 --> 00:07:18,063
ఏం చూస్తున్నారు?

149
00:07:18,939 --> 00:07:22,442
అందరూ బాగున్నారా? నా సూట్ ఎలా ఉంది?
బాగుందా? నిజంగా?

150
00:07:22,526 --> 00:07:23,735
ఇది బాగుంది.

151
00:07:23,819 --> 00:07:26,488
హేయ్, నా ఫోటో తీసుకున్నందుకు థాంక్యూ గైస్.

152
00:07:26,572 --> 00:07:27,573
మీ పేర్లేంటి?

153
00:07:28,907 --> 00:07:31,243
నువ్వు జెర్రీ, నువ్వు డేవ్.

154
00:07:31,326 --> 00:07:33,203
మీరు వచ్చింది నాకోసమేగా.

155
00:07:33,287 --> 00:07:35,706
ఎడమ కనుబొమ్మ. కుడి కనుబొమ్మ.

156
00:07:36,331 --> 00:07:37,541
కన్ఫ్యూస్ లుక్.

157
00:07:39,126 --> 00:07:41,128
ఇప్పుడు మీరు నిజంగా వాడేందుకు తీసుకోండి.

158
00:07:41,211 --> 00:07:42,588
బాగుంది డార్లింగ్. ఒక ముద్దివ్వొచ్చు కదా?

159
00:07:44,047 --> 00:07:45,591
ఆదరణ దక్కని పిల్లల కోసం
పదవ వార్షికోత్సవ బెనిఫిట్

160
00:07:47,843 --> 00:07:50,053
-రోమాన్స్ ఇంకా చనిపోలేదు.
-గైస్, సారీ. నేను...

161
00:07:50,137 --> 00:07:51,763
-ఫోటో తీసుకోనివ్వండి.
-అవునవును.

162
00:07:51,847 --> 00:07:53,265
మీరు లోపలికి వెళ్ళండి. ఓకే.

163
00:07:53,891 --> 00:07:55,726
రెబెక్కా, ఇటు చూడండి!

164
00:07:55,809 --> 00:07:57,853
-బాగున్నారు, లేడీస్.
-రెబెక్కా, ఇటు చూడండి!

165
00:07:57,936 --> 00:07:59,771
-ఇప్పుడు బాగున్నారు.
-ఎడమవైపుకి చూడండి.

166
00:07:59,855 --> 00:08:00,939
నాకిది నచ్చదు.

167
00:08:01,023 --> 00:08:02,816
-మిస్ వెల్టన్.
-లవ్లీ. బాగుంది.

168
00:08:03,317 --> 00:08:04,318
హేయ్.

169
00:08:04,776 --> 00:08:06,737
ఒక కాలు ముందుకి పెట్టి నిల్చోండి, సరేనా?

170
00:08:06,820 --> 00:08:09,781
చేతిని నడుం మీద పెట్టి,
కొంచెం వంగి నిల్చోండి.

171
00:08:10,324 --> 00:08:11,533
అది చాలా బాగుంటుంది.

172
00:08:12,701 --> 00:08:14,453
-రెబెక్కా, కొంచెం నవ్వండి.
-రెబెక్కా!

173
00:08:17,664 --> 00:08:20,292
ఆమెని చూడండి. ఎంత ఫిట్ గా ఉందో!

174
00:08:34,222 --> 00:08:36,183
నువ్వేమీ చేయకు. అంతా నీ సూట్ చూసుకుంటుంది.

175
00:08:41,813 --> 00:08:44,024
టెడ్ లాసో. మై గాడ్.

176
00:08:44,107 --> 00:08:45,234
మీరు అద్భుతంగా ఉన్నారు, బాస్.

177
00:08:45,317 --> 00:08:47,319
మీరు ఇదే డ్రెస్ వేసుకుంటారని నాకు తెలుసు.

178
00:08:47,402 --> 00:08:49,321
చెప్పాలంటే, ఇందులో అద్భుతంగా ఉన్నారు.

179
00:08:49,821 --> 00:08:50,822
థాంక్యూ.

180
00:08:50,906 --> 00:08:53,283
నేట్ ని చూడండి. బుద్ధిమంతుడిలా
ఎలా తయారయ్యాడో?

181
00:08:53,367 --> 00:08:54,493
మిమ్మల్ని మళ్ళీ కలిసినందుకు సంతోషం.

182
00:08:54,576 --> 00:08:56,370
-కలిసినందుకు సంతోషం.
-కలిసినందుకు సంతోషం.

183
00:08:57,579 --> 00:08:59,998
-మీరిద్దరూ నన్ను మన్నిస్తే...
-ఖచ్చితంగా. వెళ్లి రండి.

184
00:09:02,167 --> 00:09:03,502
అదిగో బియర్డ్ వచ్చారు చూడండి.

185
00:09:03,919 --> 00:09:05,420
అతని కొత్త గర్ల్ ఫ్రెండ్ జేన్.

186
00:09:05,921 --> 00:09:08,340
అవును, అతని ఫ్రైడే నైట్ చెస్ క్లబ్ లో
కలిశారిద్దరూ.

187
00:09:08,423 --> 00:09:10,425
ఒకరి ఆట మరొకరికి నచ్చిందేమో.

188
00:09:12,970 --> 00:09:13,971
అది జోక్ కాదు.

189
00:09:14,054 --> 00:09:15,055
జోక్ కాదా?

190
00:09:15,556 --> 00:09:16,557
నాకు అలాగే అనిపించిందే.

191
00:09:17,432 --> 00:09:21,562
వద్దు. తీయొద్దు. పోండి.

192
00:09:22,521 --> 00:09:23,522
నాకు తెలుసు.

193
00:09:27,109 --> 00:09:29,444
ఇది ఖచ్చితంగా సౌకర్యంగా ఉండదు.

194
00:09:29,528 --> 00:09:32,656
-నేను టేబుల్ మారతాను.
-వద్దు, వద్దు. హేయ్. ఇక్కడికి రా.

195
00:09:32,739 --> 00:09:33,782
ఇలా చేసింది నేనే.

196
00:09:33,866 --> 00:09:36,076
కావాలనే ఇలా చేశాను, అందరూ కూర్చోండి.

197
00:09:38,662 --> 00:09:41,832
వినండి. మీరిద్దరూ కలిసి మన లాకర్ రూమ్ ని
రెండుగా విడగొట్టారు.

198
00:09:41,915 --> 00:09:43,458
లాకర్ రూమ్స్ విషయానికి వస్తే,

199
00:09:43,542 --> 00:09:45,544
రైలు పట్టాల్లాగా ఉండకూడదు,
అందరూ కలిసికట్టుగా

200
00:09:45,627 --> 00:09:47,421
ఉంటేనే నాకిష్టం, అర్థమయిందా?

201
00:09:47,504 --> 00:09:48,714
కాబట్టి ఇది ఇక్కడే తేలాలి.

202
00:09:48,797 --> 00:09:50,799
అసలు మీ ఇద్దరి సమస్య ఏంటో చెప్పండి.
నువ్వు చెప్పు.

203
00:09:50,883 --> 00:09:52,050
వాడొక పెద్ద వెధవ.

204
00:09:52,134 --> 00:09:54,803
వాడు చస్తే కనీసం చూడ్డానికి కూడా వెళ్ళను.

205
00:09:54,887 --> 00:09:57,222
గొప్ప టీం మేట్స్ అవ్వాలంటే
బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాల్సిన పనిలేదు.

206
00:09:57,306 --> 00:10:00,392
లియాండర్ పేస్, మహేష్ భూపతిని
గుర్తు చేసుకోండి.

207
00:10:00,475 --> 00:10:02,686
టాయ్ స్టొరీలో ఊడీ, బజ్ కూడా ఇలాగే
చేయలేదా?

208
00:10:02,769 --> 00:10:03,937
వుడీ గుడ్డతో తయారైన బొమ్మ కదా?

209
00:10:04,021 --> 00:10:06,106
నువ్వు తెలివైన వాడివే, నేట్,
కానీ ఇది టైం కాదు.

210
00:10:06,773 --> 00:10:08,984
అలాంటి గొప్ప జోడీలందరిలో కామన్ గా
ఉన్నదేంటో తెలుసా?

211
00:10:09,067 --> 00:10:10,152
ఒకరిపై ఒకరికి గౌరవం.

212
00:10:10,777 --> 00:10:13,864
కాబట్టి రాజీ చేసుకోవడం అందరికీ మంచిది.
మరైతే ఎవరు ముందడుగు వేస్తారు?

213
00:10:13,947 --> 00:10:15,199
నేను.

214
00:10:16,074 --> 00:10:20,204
నేట్, నీ సూట్ చాలా బాగుంది.
అందంగా ఉన్నావు.

215
00:10:20,287 --> 00:10:24,458
థాంక్యూ. నా సొంతగా తీసుకున్న
రెండవ సూట్ ఇది.

216
00:10:24,541 --> 00:10:27,586
మొదటిది నేను బట్టలు లేకుండా
పుట్టినప్పటిది.

217
00:10:31,215 --> 00:10:33,133
సారీ, టెడ్ చెబితే నవ్వొస్తుంది.
నేను...

218
00:10:33,217 --> 00:10:34,551
అలాంటప్పుడు "బర్త్ డే సూట్"

219
00:10:34,635 --> 00:10:36,678
-అని ఉంటే బాగుండేది, అవును.
-ఓరి దేవుడా.

220
00:10:36,762 --> 00:10:39,348
కమాన్, మళ్ళీ ప్రయత్నిద్దాం. సరేనా?
హేయ్, జేమీ. నువ్వేమంటావ్?

221
00:10:39,431 --> 00:10:40,682
పాస్.

222
00:10:41,850 --> 00:10:43,393
-రాయ్.
-వాడొక పెద్ద వెధవ.

223
00:10:43,477 --> 00:10:45,521
అదే పట్టుకు వేలాడతావా? ఓకే.

224
00:10:45,604 --> 00:10:47,981
నేనొక ఐడియా చెబుతా.
అది హెల్ప్ చేయొచ్చు, లేదా బాధ పెట్టొచ్చు.

225
00:10:48,065 --> 00:10:49,191
డ్రింక్ ఎవరికి కావాలి?

226
00:10:54,655 --> 00:10:56,156
మ్యూజికల్ గెస్ట్ విషయంలో
ప్రోగ్రెస్ సాధించావా?

227
00:10:56,240 --> 00:10:57,783
నేను చాలా మంది ఏజెంట్లతో మాట్లాడాను.

228
00:10:57,866 --> 00:11:01,828
ఎవరెవరు రాలేరో వాళ్ళ లిస్టు
తయారు చేశాను.

229
00:11:01,912 --> 00:11:03,747
కాబట్టి ప్రోగ్రెస్ ఉన్నట్లే.
మనం సాధిస్తాం.

230
00:11:07,000 --> 00:11:08,168
హేయ్, ఇక్కడున్నారా.

231
00:11:09,586 --> 00:11:11,046
స్పీచ్ సిద్ధం చేస్తున్నారా?

232
00:11:11,755 --> 00:11:15,384
అందరి ముందూ రూపర్ట్ చాలా అలవోకగా
మాట్లాడేవారు.

233
00:11:15,467 --> 00:11:16,885
హేయ్, ఒక మంచి సలహా ఇవ్వనా.

234
00:11:16,969 --> 00:11:20,430
సరిగ్గా స్పీచ్ మొదలుపేట్టబోయే ముందు,
మీ మీద మీరే జోక్ వేసుకోండి.

235
00:11:20,514 --> 00:11:21,515
అందరికీ నచ్చుతుంది.

236
00:11:21,598 --> 00:11:24,393
మరైతే నా మీద నేను ఏ విషయంలో
జోక్ వేసుకోవాలి?

237
00:11:26,061 --> 00:11:27,521
అవునవును.

238
00:11:30,732 --> 00:11:35,153
అదీ... అది ఏమైతే బాగుంటుందంటే...
వద్దులే.

239
00:11:35,237 --> 00:11:37,239
ఆ విషయమైతే చెప్పాలనుకోవట్లేదుగా, టెడ్?

240
00:11:37,322 --> 00:11:39,491
లేదు మేడమ్, అస్సలు కాదు. ఓకే.

241
00:11:40,951 --> 00:11:42,160
ఏదేమైనా గుడ్ లక్.

242
00:11:44,037 --> 00:11:46,665
మీకొకటి చెప్పనా?
నాకో ఆలోచన వచ్చింది. వద్దు, వద్దులే.

243
00:11:47,457 --> 00:11:49,209
మంత్రి నాలుగు గళ్ళు ఏనుగువైపు.

244
00:11:50,085 --> 00:11:52,337
ఏంటి, బోర్డు లేకుండా గేమ్ ఆడుతున్నారా?

245
00:11:53,547 --> 00:11:56,008
మధ్యలో ఆపినందుకు సారీ. నా తప్పే.
మీరు కానివ్వండి.

246
00:11:57,634 --> 00:11:59,052
బంటు ఐదు గళ్ళు రాజువైపు.

247
00:12:04,600 --> 00:12:05,767
గుడ్ ఈవెనింగ్,

248
00:12:05,851 --> 00:12:10,647
ఆదరణ దక్కని పిల్లల కోసం ఏర్పాటు చేసిన పదవ
వార్షికోత్సవ బెనిఫిట్ కి స్వాగతం.

249
00:12:11,064 --> 00:12:15,611
మీరు అందించిన విరాళాలకు కృతజ్ఞతగా
ఒక్కొక్కరికీ,

250
00:12:16,528 --> 00:12:19,573
ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు
చెబుతున్నాను.

251
00:12:21,658 --> 00:12:25,829
తరువాత జరగబోయే ఆక్షన్ కోసం మీరందరూ
చెక్ బుక్స్ తెచ్చే ఉంటారని అనుకుంటున్నాను.

252
00:12:25,913 --> 00:12:31,835
ఎందుకంటే మీరందరూ మన సొంత రిచ్మండ్
ప్లేయర్స్ పై బిడ్ వేయొచ్చు.

253
00:12:34,296 --> 00:12:39,801
రూల్ ఎప్పటిలాగే, హక్కు వదులుకునే వరకూ
ప్లేయర్ తో సరసాలకు దిగకూడదు.

254
00:12:41,470 --> 00:12:42,471
రూపర్ట్?

255
00:12:43,847 --> 00:12:44,890
హలో, డార్లింగ్.

256
00:12:44,973 --> 00:12:47,809
ఎంత... గొప్ప సర్ప్రైజ్.

257
00:12:48,727 --> 00:12:49,895
నేను వస్తానని అనుకోలేదా?

258
00:12:51,396 --> 00:12:53,148
ఆహ్వానానికి రానని బదులిచ్చావుగా!

259
00:12:53,232 --> 00:12:56,485
ఎందుకూ పనికిరాని ధనవంతుడిగా ఉండడంలో
ఇదొక లాభం.

260
00:12:56,568 --> 00:12:59,780
ఒక్కోసారి అనుకోకుండా వాళ్ళ సాయంత్రాలలో
ఖాళీ దొరుకుతుంది.

261
00:13:01,240 --> 00:13:02,824
తీసుకోవచ్చా? థాంక్యూ.

262
00:13:03,575 --> 00:13:09,373
లేడీస్ అండ్ జెంటిల్ మెన్, మీ సహాయంతో
గత ఏడాది మనం 8,00,000ల పౌండ్లు సేకరించాం.

263
00:13:11,542 --> 00:13:14,294
ఈ ఏడాది, ఇంకా ఎక్కువ సేకరిస్తామని
అనుకుంటున్నాను.

264
00:13:14,378 --> 00:13:18,507
ఆహ్వానం లేకుండా వచ్చాను క్షమించు,
కానీ సాయం చేయకుండా ఉండలేకపోయాను.

265
00:13:18,590 --> 00:13:21,301
నన్ను రానిస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు.

266
00:13:21,385 --> 00:13:22,386
దానిదేముంది.

267
00:13:23,136 --> 00:13:24,888
అతనికి బోరింగ్ టేబుల్ దగ్గర సీట్ ఇవ్వండి.

268
00:13:25,556 --> 00:13:26,807
సరదాగా అంటున్నా.

269
00:13:27,349 --> 00:13:29,601
టేబుల్ ఫోర్. రూపర్ట్ మానియన్ కు స్వాగతం.

270
00:13:37,067 --> 00:13:38,151
థాంక్యూ, బంగారం.

271
00:13:44,199 --> 00:13:45,534
ఓరి దేవుడా.

272
00:13:46,535 --> 00:13:47,870
-థాంక్యూ.
-అదీ...

273
00:13:49,538 --> 00:13:51,415
నేట్, నేట్, నేట్. కమాన్.

274
00:13:51,498 --> 00:13:53,458
చూడండి గైస్, ఇది నా కొత్త సూట్.

275
00:13:53,542 --> 00:13:56,211
ఈ రాత్రికి నన్ను ఇబ్బంది పెట్టకుండా,
రేపు మీరు చేయాలనుకున్నది రెండింతలు చేయండి.

276
00:13:56,295 --> 00:13:57,838
ఇకపై అలా కుదరదని రాయ్ చెప్పాడు.

277
00:13:57,921 --> 00:14:00,757
నా తలమీద కొట్టిన దెబ్బకి నాకు ఇప్పటికీ
కళ్ళు బైర్లు కమ్మాయి.

278
00:14:00,841 --> 00:14:02,467
డాక్టర్లు నన్ను తాగొద్దని చెప్పారు.

279
00:14:07,014 --> 00:14:08,682
ఛ.

280
00:14:08,765 --> 00:14:10,475
షర్టు వేసుకోవాలనడానికి ఇంకో కారణం.

281
00:14:10,559 --> 00:14:13,478
నోరు ముయ్యి, ఇది సరదా కాదు. నాకు కాలింది.

282
00:14:14,146 --> 00:14:16,273
ఆ ఐస్ క్యూబ్ ని నేనైతే బాగుండేది.

283
00:14:17,816 --> 00:14:20,152
ఒక రాత్రి కోసం నీ మీద బిడ్ వేస్తాను.

284
00:14:21,361 --> 00:14:22,362
థాంక్స్, లవ్.

285
00:14:22,446 --> 00:14:25,991
అది కేవలం డేట్ మాత్రమే.
రాత్రి మొత్తానికి కాదు. కాబట్టి...

286
00:14:26,074 --> 00:14:27,326
అదీ చూద్దాం.

287
00:14:28,577 --> 00:14:29,745
నేను గతంలో ఇలాంటివి చేశాను.

288
00:14:29,828 --> 00:14:32,623
ఆమె 3,000లకి పైగా బిడ్ వేస్తే,
నువ్వు ఆమెతో గడపాలి.

289
00:14:34,249 --> 00:14:36,543
-అది నిజమా?
-నువ్వు లోపలి వెళ్లనక్కరలేదు.

290
00:14:37,336 --> 00:14:38,879
కొంచెం దూరం వెళ్తే చాలు.

291
00:14:39,630 --> 00:14:40,797
అంటే ఇలా.

292
00:14:45,052 --> 00:14:46,720
మిమ్మల్ని...నేను వెళ్తున్నాను.

293
00:14:47,346 --> 00:14:49,056
జేమీ, జోక్ చేశానంతే.

294
00:14:49,431 --> 00:14:51,767
జోక్ చేశాను. జేమీ.

295
00:14:53,477 --> 00:14:54,603
ఇప్పడు ఏమయింది?

296
00:14:55,771 --> 00:14:59,107
ఎప్పటిలాగే. జేమీ పిచ్చివేషాలు
మొదలుపెట్టాడు.

297
00:15:00,901 --> 00:15:02,444
రాయ్, ఒక విషయం అడగనా.

298
00:15:02,528 --> 00:15:04,154
నీకు 23 ఏళ్ళప్పుడు ఎలా ఉండేవాడివి?

299
00:15:04,696 --> 00:15:06,657
ఈ లీగ్ లో ఆడడం, డబ్బు సంపాదించడం.

300
00:15:08,033 --> 00:15:10,285
-ఏవో పిచ్చి పనులు చేసేవాడిని.
-అవును.

301
00:15:10,911 --> 00:15:13,830
"యువత యవ్వనాన్ని వృధా చేస్తారని
అంటారు కదా!"

302
00:15:15,582 --> 00:15:18,669
నేనైతే వయసుతో వచ్చే జ్ఞానం నీ వయసుని
వృధా చేయనీయొద్దు అంటాను.

303
00:15:20,087 --> 00:15:21,129
టెడ్?

304
00:15:23,465 --> 00:15:26,218
నేను ఇప్పుడే దాన్ని కనిపెట్టాను.
నాకు బాగా నచ్చింది.

305
00:15:32,599 --> 00:15:35,060
కాలిన్, ఐసాక్ లతో మాట్లాడినందుకు
థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.

306
00:15:35,143 --> 00:15:36,770
అది చెప్పడానికి అంత దగ్గరగా రావాలా?

307
00:15:36,854 --> 00:15:39,940
చెప్పాలంటే, నిన్ను కౌగిలించుకోవాలన్నది
నా ఆలోచన. కానీ భయంతో ఆగిపోయాను.

308
00:15:40,774 --> 00:15:41,775
సరే.

309
00:15:46,280 --> 00:15:47,531
-ఓకే, ఇక చాలు.
-సరే.

310
00:15:50,367 --> 00:15:52,911
టెడ్, నిన్ను రూపర్ట్ మానియన్ కి పరిచయం
చేయాలని అనుకుంటున్నాను.

311
00:15:52,995 --> 00:15:55,539
-మిస్టర్ మానియన్, ఎలా ఉన్నారు?
-రూపర్ట్ అనండి, టెడ్.

312
00:15:55,622 --> 00:15:58,250
ముఖ్యంగా నా క్లబ్ ని మేనేజ్ చేసేవారు
అలాగే పిలవాలి.

313
00:15:59,293 --> 00:16:00,502
మీ మాజీ క్లబ్.

314
00:16:00,586 --> 00:16:04,089
అవును, ఖచ్చితంగా,
కానీ ఇంకా ఇక్కడే ఉంది, లవ్.

315
00:16:04,882 --> 00:16:06,800
స్పోర్ట్స్ టీం మీద ప్రేమ అనేది
జీవితకాలపు వ్యసనం.

316
00:16:06,884 --> 00:16:07,718
-అవును.
-అవును.

317
00:16:07,801 --> 00:16:09,553
మీ బెస్ట్ ఫ్రెండ్ పెద్ద అక్క లాగా, అవునా?

318
00:16:09,928 --> 00:16:10,929
హేయ్, నాకో సాయం చేయండి.

319
00:16:11,013 --> 00:16:13,724
మీరెప్పుడైనా కాన్సాస్ సిటీకి వచ్చి,
టామ్ డినీన్ అనే వ్యక్తిని కలిస్తే,

320
00:16:13,807 --> 00:16:15,017
నేనిలా అన్నానని చెప్పకండి.

321
00:16:17,019 --> 00:16:18,770
నాకు నచ్చింది.

322
00:16:19,646 --> 00:16:22,065
కానీ మనం రెండు సార్లు ఓడిపోవడం మాత్రం
నచ్చలేదు.

323
00:16:22,149 --> 00:16:23,400
-చెత్తగా ఆడారు.
-అవును.

324
00:16:23,483 --> 00:16:24,776
చెప్పాలనుకోలేదు, కానీ తప్పలేదు.

325
00:16:24,860 --> 00:16:27,696
పరవాలేదు. బాగా ఆడి అదరగొడతారేమో.
ఎవరికి తెలుసు?

326
00:16:28,405 --> 00:16:31,116
ఓ మై గాడ్. మిమ్మల్ని నమ్ముతాను.

327
00:16:31,200 --> 00:16:32,284
నువ్వతన్ని నమ్ముతావా?

328
00:16:35,662 --> 00:16:37,998
మీరు కాదంటే ఈ రాత్రి ఘోరంగా ఉంటుంది.

329
00:16:38,999 --> 00:16:40,250
నేను టెడ్ ని ఖచ్చితంగా నమ్ముతాను.

330
00:16:41,210 --> 00:16:42,961
మనకు కావాల్సింది ఇతనే.

331
00:16:44,671 --> 00:16:46,381
మరీ ఎక్కువగా తాగకు, డియర్.

332
00:16:46,465 --> 00:16:48,509
ఆక్షన్ సమయంలో షార్ప్ గా ఉండాలి.

333
00:16:49,635 --> 00:16:50,802
ఆక్షన్ నువ్వే చేయొచ్చు కదా?

334
00:16:51,512 --> 00:16:53,305
లేదు, నేను చేయను. ఈరోజు నీదే.

335
00:16:53,388 --> 00:16:55,557
మీరు చేస్తేనే బాగుంటుందని మనిద్దరికీ
తెలుసు.

336
00:16:56,350 --> 00:16:59,144
అంతేకాక...ఇది పిల్లల కోసం.

337
00:16:59,853 --> 00:17:01,063
పిల్లల కోసం.

338
00:17:04,107 --> 00:17:06,609
సరే, నన్ను మన్నిస్తే, నేను వెళ్లి మిగిలిన
అతిథులతో మాట్లాడతాను.

339
00:17:07,027 --> 00:17:08,694
నీ డ్రెస్ చాలా బాగుందని చెప్పి తీరాలి.

340
00:17:10,196 --> 00:17:11,323
చాలా అందంగా ఉన్నావు.

341
00:17:12,156 --> 00:17:14,660
నిన్నిలా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది.

342
00:17:15,743 --> 00:17:16,744
థాంక్యూ.

343
00:17:19,122 --> 00:17:20,123
ఎక్స్క్యూజ్ మీ.

344
00:17:20,874 --> 00:17:21,916
టెడ్.

345
00:17:22,334 --> 00:17:24,545
ఈ ఏడాది ఆమెకు కష్టంగా గడిచింది.
తను బాగానే ఉందా?

346
00:17:24,627 --> 00:17:25,587
చాలా బాగుంది.

347
00:17:26,255 --> 00:17:29,591
దీనికోసం ఆమె చాలా చాలా కష్టపడింది.

348
00:17:30,342 --> 00:17:34,012
ఉన్నట్లుండి రాబీ విలియమ్స్ అనే వ్యక్తి
ప్రోగ్రాం కాన్సిల్ చేశాడు. ఇంకా...

349
00:17:34,096 --> 00:17:35,097
-రాబీ?
-అవును.

350
00:17:35,180 --> 00:17:36,932
అతను నా ఫ్రెండే.

351
00:17:37,015 --> 00:17:39,852
నేను అతనికి మెసేజ్ ఇస్తాను.
అతన్ని ఇక్కడికి రప్పిస్తానని పందెం.

352
00:17:40,227 --> 00:17:41,854
ఆమె చాలా సంతోషిస్తుంది.

353
00:17:42,437 --> 00:17:45,232
నేను ఆమె ఎక్కడుందో కనిపెట్టి,
తన అనుమతి తీసుకుంటాను, సరేనా?

354
00:17:45,983 --> 00:17:47,818
క్షమించండి. మా ఊళ్ళో అలాగే అంటారు.

355
00:17:47,901 --> 00:17:50,863
-అంటే ఆమెని అడుగుతాను, అంతే.
-మంచిది, కానివ్వండి.

356
00:17:50,946 --> 00:17:52,155
మంచిది, మీరూ కానివ్వండి.

357
00:17:52,781 --> 00:17:55,534
నాకు ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండేది
ఏదైనా ఇస్తారా?

358
00:17:55,617 --> 00:17:58,370
ఒక డబుల్, ఒక సింగిల్. అంటే ట్రిపుల్.

359
00:17:59,872 --> 00:18:03,000
లేడీస్ అండ్ జెంటిల్ మెన్,
ప్లాన్ లో చిన్న మార్పులు.

360
00:18:03,083 --> 00:18:07,171
ఈరోజు సాయంత్రం ఆక్షన్ నిర్వహించే అవకాశం
నాకు దొరికింది.

361
00:18:09,464 --> 00:18:13,427
మన మొదటి బాధితుడు జేమీ టార్ట్.

362
00:18:17,055 --> 00:18:18,390
బేబీ, నన్ను నువ్వే గెల్చుకోవాలి.

363
00:18:18,473 --> 00:18:20,517
నా బోయ్ ఫ్రెండ్ మీద బిడ్ వేయడం ఏంటి,
అసహ్యంగా.

364
00:18:20,601 --> 00:18:22,519
బేబీ, ఇది 2020. ఆడవారు ఏమైనా చేయగలరు.

365
00:18:22,603 --> 00:18:25,105
లేదు, కుదరదు. కమాన్, నువ్వు బాగున్నావు.
అక్కడికి వెళ్ళు!

366
00:18:25,189 --> 00:18:29,693
చూడండి ఫ్రెండ్స్. యంగ్, చార్మింగ్,
బాస్టర్డ్.

367
00:18:29,776 --> 00:18:32,654
5,000ల పౌండ్లతో మొదలుపెడదాం.

368
00:18:32,738 --> 00:18:34,323
అతను నాకు కావాలి రూపర్ట్.

369
00:18:35,115 --> 00:18:37,618
చెరిల్ బార్నబి నుండి 5000.

370
00:18:37,701 --> 00:18:40,329
రిచ్మండ్ లో షెట్ ల్యాండ్ గుర్రాల్ని పెంచే
ప్రీమియర్ బ్రీడర్.

371
00:18:40,412 --> 00:18:42,164
ఆరుకి ఎవరైనా పాడతారా?

372
00:18:44,082 --> 00:18:45,209
ఆరు వేలు.

373
00:18:45,292 --> 00:18:46,752
ఆరు. థాంక్యూ.

374
00:18:46,835 --> 00:18:49,838
-ఏడు వేలు.
-ఏడు వేలు.

375
00:18:49,922 --> 00:18:51,256
పది వేలు.

376
00:18:53,133 --> 00:18:54,551
అద్భుతం.

377
00:18:54,635 --> 00:18:57,679
అంటే బిడ్ అద్భుతం,
బిడ్ వేసిన వారూ అద్భుతం.

378
00:18:57,763 --> 00:19:00,015
నేనలా అనుకోవట్లేదు.

379
00:19:01,099 --> 00:19:03,018
-పన్నెండు వేల పౌండ్లు.
-పధ్నాలుగు వేలు.

380
00:19:03,101 --> 00:19:04,603
పధ్నాలుగు వేలు!

381
00:19:04,686 --> 00:19:05,812
పదహారు వేలు.

382
00:19:05,896 --> 00:19:07,022
పద్దెనిమిది.

383
00:19:07,481 --> 00:19:10,317
పద్దెనిమిది వేలు. ఇంకా ఎవరైనా పాడతారా?

384
00:19:10,400 --> 00:19:12,277
అవును. ఇరవై ఐదు వేలు.

385
00:19:12,361 --> 00:19:17,366
ఇరవై ఐదు వేలు! ఒకటవ సారి. రెండవ సారి.

386
00:19:17,449 --> 00:19:19,201
కీలీ జోన్స్ కే సొంతం.

387
00:19:19,284 --> 00:19:24,206
25 వేలకి సొంతం చేసుకోగలిగినప్పుడు, మీ బోయ్
ఫ్రెండ్ తో ఫ్రీగా సమయం గడపడం ఎందుకు?

388
00:19:24,706 --> 00:19:25,707
నువ్వు నాకు బాకీ.

389
00:19:29,711 --> 00:19:33,173
హేయ్. ఇక్కడున్నారా. చల్లగాలి కోసమా?

390
00:19:33,257 --> 00:19:37,511
అవును. ఆ రిక్షా బైకులు చూడ్డానికి సిల్లీగా
ఉన్నాయిగానీ, సరదాగా ఉంటాయి.

391
00:19:37,594 --> 00:19:38,428
అవును.

392
00:19:38,512 --> 00:19:40,222
-ఎప్పుడైనా ఎక్కారా?
-లేదు మేడమ్.

393
00:19:40,305 --> 00:19:44,810
సెలవుల్లో నా భార్య, నేను ఒకసారి అలాంటి
బైక్ అద్దెకి తీసుకున్నాం.

394
00:19:44,893 --> 00:19:48,188
చెడ్డ అనుభవం. మా ఆవిడ చెయ్యి విరిగింది.
నాకేమో...

395
00:19:48,272 --> 00:19:51,775
పన్ను విరిగింది,
ఇంకా తగలరాని చోట తగిలింది.

396
00:19:54,194 --> 00:19:56,446
-హేయ్, మీరు బాగానే ఉన్నారా?
-అదేం లేదు...

397
00:19:57,906 --> 00:19:59,116
ఆ మనిషికి, నా గురించి తెలుసు.

398
00:20:00,367 --> 00:20:04,204
అతని అసలు మనస్తత్వం కంటే అతని నిజాయితీనే
గొప్పదని అనుకుంటూ ఉండేదాన్ని.

399
00:20:04,288 --> 00:20:05,289
కానీ అదంతా...

400
00:20:07,583 --> 00:20:10,294
తన అభద్రతా భావాల్ని దాచిపెట్టే
క్రూరమైన పద్ధతి.

401
00:20:11,461 --> 00:20:13,922
ఇదే వేసుకో, ఇదే తిను అని చెప్పేవాడు.

402
00:20:16,758 --> 00:20:18,302
నేను వినేదాన్ని.

403
00:20:19,511 --> 00:20:20,888
కానీ ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను.

404
00:20:22,556 --> 00:20:25,934
నేను ఒంటరిని, టెడ్. నేను వెళ్ళిపోతే ఎలా
ఉంటానని అతను చెప్పాడో, సరిగ్గా అలాగే.

405
00:20:30,272 --> 00:20:31,690
నేను ఒంటరిగా ఉండాలని అనుకోవట్లేదు.

406
00:20:36,528 --> 00:20:39,323
హేయ్. బాధపడకండి.

407
00:20:52,836 --> 00:20:56,715
ఇదంతా వదిలేసి ఎక్కడికైనా
వెళ్ళిపోవాలని ఉందా? కమాన్.

408
00:20:56,798 --> 00:20:57,925
అలా చేయగలిగితే బాగుండు.

409
00:20:59,218 --> 00:21:00,844
ఇప్పుడే కాదు. థాంక్యూ.

410
00:21:04,973 --> 00:21:07,184
ఆక్షన్ మొదలుపెట్టాడా?

411
00:21:07,643 --> 00:21:08,644
అవును, పెట్టాడు.

412
00:21:08,727 --> 00:21:11,647
మంచిది. అతను చేస్తున్నందుకు సంతోషం.
మనకి బాగా డబ్బు వస్తుంది.

413
00:21:12,940 --> 00:21:15,067
అతను ఏం చేసినా అందరూ అతన్ని ప్రేమిస్తారు.

414
00:21:18,278 --> 00:21:21,031
-లోపలికి రావాలని లేదా?
-లేదు, మీరు వెళ్ళండి.

415
00:21:21,698 --> 00:21:22,699
నేను కొంచెం ఫ్రెష్ అవ్వాలి.

416
00:21:22,783 --> 00:21:26,745
ఇప్పుడే నిద్ర లేచి వచ్చిన దానిలాగా
ఉండుంటాను.

417
00:21:27,412 --> 00:21:30,123
కొంచెం ఎమోషనల్ అయ్యారు.

418
00:21:30,207 --> 00:21:31,375
ఓకే, లోపల కలుస్తాను.

419
00:21:43,303 --> 00:21:44,304
నేను లీగ్ లోకి వచ్చిన కొత్తలో,

420
00:21:44,388 --> 00:21:46,807
డోగ్ స్టాష్ విక్ అనే ఒక మొండి ముసలి
వ్యక్తి ఉండేవాడు.

421
00:21:46,890 --> 00:21:48,976
నన్ను ఎప్పుడూ తిట్టేవాడు.
ఒకరంటే ఒకరికి పడేది కాదు.

422
00:21:49,601 --> 00:21:51,728
-లీగ్ ఎలా గెలిచామో తెలుసుకోవాలని ఉందా?
-లేదు.

423
00:21:52,396 --> 00:21:54,731
ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామో అచ్చం అలాగే.

424
00:21:54,815 --> 00:21:57,109
అతను నాతో ఏమన్నాడంటే,
"మనసులో ఉన్నది మొత్తం బయటపెట్టు.

425
00:21:57,192 --> 00:22:00,070
నేనెందుకు వెధవనో నువ్వు చెప్పు,
నువ్వెందుకు వెధవ్వో నేను చెబుతాను."

426
00:22:02,406 --> 00:22:04,324
-నువ్వొక పనికిమాలిన వాడివి...
-ఆగు, ముందు నేను చెబుతాను.

427
00:22:05,742 --> 00:22:08,871
నేను బాల్ నీకు పాజ్ చేయాలని
నాకు తెలిసినా కూడా...

428
00:22:10,038 --> 00:22:11,874
నువ్వు స్వార్ధపరుడివి, పొగరుబోతువి
కాబట్టి,

429
00:22:11,957 --> 00:22:14,084
నేనలా చేసిన ప్రతి సారీ,
నాకు వాంతి చేసుకున్నట్లు అనిపిస్తుంది.

430
00:22:16,587 --> 00:22:20,257
నేను చిన్నగా ఉన్నప్పుడు నీ పోస్టర్
నా గది గోడమీద ఉండేది.

431
00:22:21,758 --> 00:22:23,594
నీ ఆట చూడ్డమంటే నాకు చాలా ఇష్టం.

432
00:22:25,721 --> 00:22:28,348
కానీ నువ్వు ఇదివరకటిలా ఆడట్లేదు,

433
00:22:28,432 --> 00:22:30,684
నువ్వు కొన్ని ట్రోఫీలు గెల్చినంత మాత్రాన,

434
00:22:30,767 --> 00:22:33,854
ప్రతి ఒక్కరూ వచ్చి నీ ఉంగరాన్ని
ముద్దు పెట్టుకోవాలని కోరుకుంటున్నావు.

435
00:22:36,815 --> 00:22:39,193
అవును, నేనలా ఉండగలను.

436
00:22:45,699 --> 00:22:47,618
నేను చెప్పే దానికి నువ్వు ఒప్పుకోవాల్సిన
టైం వచ్చింది.

437
00:22:48,368 --> 00:22:49,369
నేను ఒప్పుకోను.

438
00:22:51,997 --> 00:22:53,207
అందులో కొంచెం...

439
00:22:54,666 --> 00:22:55,751
నిజం ఉన్నప్పటికీ.

440
00:23:01,215 --> 00:23:03,300
నువ్వు, ఆ డోగ్ బ్లోక్,
మీరు ఫ్రెండ్స్ అయ్యారా?

441
00:23:03,383 --> 00:23:05,427
లేదు. అతను చనిపోయే ఉంటాడు.

442
00:23:07,638 --> 00:23:08,764
నువ్వు చనిపోవాలని చీర్స్.

443
00:23:11,225 --> 00:23:12,434
నిన్నసలు.

444
00:23:15,646 --> 00:23:16,897
హలో పార్టనర్.

445
00:23:18,607 --> 00:23:21,777
రాబీకి మెసేజ్ చేయడం గురించి రెబెక్కా
ఏమనుకుందో అడిగారా?

446
00:23:22,361 --> 00:23:25,781
మీకో విషయం తెలుసా? ఆమె నాకు కనిపించలేదు.
దాని గురించి కంగారుపడకండి.

447
00:23:25,864 --> 00:23:28,450
ఒకవేళ మనసు మార్చుకుంటే, మెసేజ్ పంపగానే,

448
00:23:28,534 --> 00:23:30,869
అతను ఇక్కడికొచ్చి వాలతాడు.
ఇంకో డ్రింక్ కావాలి.

449
00:23:31,578 --> 00:23:33,705
హేయ్, రూపర్ట్, ఇప్పుడే ఒకటి అనిపించింది.

450
00:23:33,789 --> 00:23:37,251
ఒక్క మెసేజ్ తో రాబీ విలియమ్స్ ని ఇక్కడికి
మీరు రప్పించగలిగితే...

451
00:23:38,794 --> 00:23:42,172
అదే మెసేజ్ తో అతన్ని రాకుండా కూడా
చేయగలరు కదా.

452
00:23:44,508 --> 00:23:47,427
అలా చేసుంటే నా అంత చెత్త వెధవ
ఎవరూ ఉండరు కదా?

453
00:23:53,767 --> 00:23:57,688
హేయ్, టెడ్. అడేల్ నిజంగా ఎలా ఉంటారో
రెబెక్కాకి తెలుసా?

454
00:23:58,897 --> 00:24:01,149
నేనొక చిన్న సాహస యాత్రకి వెళ్తున్నాను,
నాకు కో-పైలెట్ కావాలి.

455
00:24:01,233 --> 00:24:03,861
-నన్ను రమ్మంటున్నావా?
-మిగతావన్నీ మర్చిపో, నాకు బెస్ట్ కావాలి.

456
00:24:03,944 --> 00:24:05,153
కమాన్, నాతో రా.

457
00:24:10,826 --> 00:24:13,120
-నీకు థాంక్యూ చెప్పి తీరాలి.
-ఏంటి?

458
00:24:13,537 --> 00:24:17,624
రెడ్ కార్పెట్ ఫోటోలు ఇప్పటికే
ఆన్లైన్ లో ఉన్నాయి.

459
00:24:17,708 --> 00:24:21,336
ఒక్కసారైనా నేను చక్కగా వచ్చాను.

460
00:24:21,420 --> 00:24:22,921
సాయం చేసినందుకు థాంక్స్.

461
00:24:26,592 --> 00:24:27,634
కీలీ?

462
00:24:27,718 --> 00:24:28,719
నీకు తెలియాల్సిన విషయం ఒకటుంది.

463
00:24:28,802 --> 00:24:32,639
జేమీ మీద బిడ్డింగ్ వేసిన లేడీ నిజానికి
అతని గెస్ట్ లిస్టులో ఉన్నామె.

464
00:24:34,850 --> 00:24:36,435
ఇదా అతను చేసింది.

465
00:24:39,897 --> 00:24:42,399
-నీ డ్రింక్ లో కొంచెం తాగొచ్చా?
-తాగు.

466
00:24:42,482 --> 00:24:43,609
థాంక్స్.

467
00:24:44,693 --> 00:24:46,528
ఈ ఆలివ్స్ అంటేనే నాకు ఇష్టం లేదు.

468
00:24:46,612 --> 00:24:50,824
నాకు దాని వాసనే గిట్టదు, చూస్తేనే అసహ్యం.

469
00:24:53,911 --> 00:24:55,287
మీరెప్పుడైనా ఫుట్ బాలర్ ని డేటింగ్ చేశారా?

470
00:24:56,371 --> 00:24:58,373
-ఏంటి?
-సారీ.

471
00:24:58,957 --> 00:25:02,252
నేను నవ్వకూడదు. అది జడ్జిమెంట్ లా ఉంది.

472
00:25:02,336 --> 00:25:04,463
లేదు, పరవాలేదు. మీరు జడ్జిమెంటల్ గానే
ఉన్నారు.

473
00:25:04,546 --> 00:25:07,549
నాకు 18 ఏళ్ళప్పుడు,
23 ఏళ్ళ ఫుట్ బాలర్ తో డేటింగ్ చేశాను.

474
00:25:09,301 --> 00:25:13,013
ఇప్పుడు 30కి దగ్గర్లో ఉన్నాను, ఇప్పటికీ
23 ఏళ్ళ ఫుట్ బాలర్ తోనే డేట్ చేస్తున్నా.

475
00:25:14,306 --> 00:25:15,974
లియోనార్డో డికాప్రియో లాగా.

476
00:25:17,851 --> 00:25:19,019
చెప్పాలంటే అలాంటి వారే బాగుంటారు.

477
00:25:20,103 --> 00:25:22,523
సింపుల్, రిచ్, ఫిట్.

478
00:25:22,606 --> 00:25:24,316
జవాబుదారీ సంగతేంటి?

479
00:25:25,025 --> 00:25:26,026
ఏంటి మీరనేది?

480
00:25:26,610 --> 00:25:29,780
నా ఉద్దేశ్యం, ప్రతి ఒక్కరూ తప్పులు
చేస్తారు, కానీ...

481
00:25:31,657 --> 00:25:34,284
నేను పెళ్లి చేసుకుని 12 ఏళ్ళు
ఒక వ్యక్తితో ఉన్నాను.

482
00:25:34,993 --> 00:25:38,539
కానీ అతను ఏ విషయానికీ ఒక్కసారి కూడా
బాధ్యత తీసుకోలేదు.

483
00:25:48,006 --> 00:25:49,174
హాయ్.

484
00:25:49,258 --> 00:25:50,259
-హాయ్.
-నేను కీలీ.

485
00:25:50,342 --> 00:25:51,343
హాయ్, నేను బెక్స్.

486
00:25:51,426 --> 00:25:53,220
-మిమ్మల్ని కలిసినందుకు సంతోషం, బెక్స్.
-మిమ్మల్ని కలిసినందుకు సంతోషం.

487
00:25:53,303 --> 00:25:55,389
మీకు అభ్యంతరం లేకపోతే,
నేను తనతో కొంచెం మాట్లాడొచ్చా?

488
00:25:55,472 --> 00:25:58,225
తప్పకుండా. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం.

489
00:25:59,768 --> 00:26:01,061
ఆమె నీ గర్ల్ ఫ్రెండా?

490
00:26:01,144 --> 00:26:04,773
రిలాక్స్ బేబీ, ఇదంతా బ్రాండింగ్
ప్లాన్ లో భాగం, కాదంటావా?

491
00:26:04,857 --> 00:26:07,776
నా మీద ఇద్దరు ఆడవాళ్ళు బిడ్ వేస్తే,
మరి నా విలువ పెరుగుతుంది కదా.

492
00:26:07,860 --> 00:26:08,944
నా ఉద్దేశ్యం అర్థమయిందా?

493
00:26:09,778 --> 00:26:10,988
నేను చాలా స్మార్ట్ కదూ!

494
00:26:11,697 --> 00:26:17,452
ఇప్పుడు మెనూలో ఉన్న ఒకే ఒక మాజీ చాంపియన్స్
లీగ్ విజేత రాయ్ కెంట్ కి హలో చెప్పండి.

495
00:26:17,536 --> 00:26:18,579
తాతయ్య.

496
00:26:21,081 --> 00:26:26,336
ఎక్కువగా బిడ్ వేసిన వారు మంచి హోటల్ లో
పూల్ పక్కన,

497
00:26:26,420 --> 00:26:29,965
చల్లని డ్రింక్స్ తాగుతూ,
ఎండని ఆస్వాదించొచ్చు.

498
00:26:30,048 --> 00:26:32,259
లేదు. చల్లని డ్రింక్స్ లేవు, ఎండా లేదు.

499
00:26:34,094 --> 00:26:37,306
అక్కడ ఎటువంటి స్విమ్మింగ్ పూల్ కూడా ఉండదు.
మనం ఇక్కడినుండి ఎక్కడికీ వెళ్ళడం లేదు.

500
00:26:37,389 --> 00:26:40,058
నువ్వు చాలా ఈర్ష్య పడ్డావ్.
చూడ్డానికి బాగుంది.

501
00:26:40,142 --> 00:26:42,019
ఈర్ష్య పడితే బాగుందా?

502
00:26:42,102 --> 00:26:43,604
నాకు తెలీదు బేబీ. నాకు ఈర్ష్య లేదు.

503
00:26:43,687 --> 00:26:47,065
బోరింగ్ డేట్ గా ఉండబోతున్న దీనికి
ఎవరైనా 100 క్విడ్స్ ఇస్తారా?

504
00:26:47,524 --> 00:26:48,859
సరే అయితే. పది వేల పౌండ్లు.

505
00:26:50,319 --> 00:26:53,739
-ఇంకా ఎవరైనా పాడతారా?
-రెండు వేల పౌండ్లు!

506
00:26:54,865 --> 00:26:57,075
చెరిల్ అందరికంటే ముందున్నారు.

507
00:26:57,159 --> 00:27:00,078
-మూడు వేల పౌండ్లు.
-బేబీ, నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావ్.

508
00:27:00,704 --> 00:27:02,623
నాలుగు వేల పౌండ్లు!

509
00:27:02,706 --> 00:27:03,790
ఐదు వేలు!

510
00:27:04,541 --> 00:27:06,835
ఆరు వేల పౌండ్లు.

511
00:27:06,919 --> 00:27:08,879
-ఆరు పైన ఎవరైనా పాడతారా?
-నన్ను క్షమించు. సారీ.

512
00:27:10,088 --> 00:27:12,049
ఓకే, చెరిల్ కే దక్కుతుంది.

513
00:27:19,723 --> 00:27:24,728
ఆక్షన్ ముగిసినట్లే,
అయితే ఒక చిన్న సర్ప్రైజ్.

514
00:27:25,604 --> 00:27:31,527
నేను వ్యక్తిగతంగా ఈ కారణం కోసం
ఒక మిలియన్ పౌండ్లు విరాళం ఇస్తున్నాను.

515
00:27:34,154 --> 00:27:35,155
థాంక్యూ.

516
00:27:35,656 --> 00:27:37,449
థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ.

517
00:27:37,533 --> 00:27:43,705
దీంతో రెబెక్కా తన గోల్ కంటే 8,00,000
ముందుంది. థాంక్యూ.

518
00:27:47,459 --> 00:27:48,794
పిల్లల కోసమేగా?

519
00:28:00,556 --> 00:28:01,640
రెబెక్కా.

520
00:28:01,723 --> 00:28:05,644
ఇతని పేరు కేమ్ కోల్.
గుర్తింపు దక్కని మెగా టాలెంట్.

521
00:28:05,727 --> 00:28:07,187
కానివ్వు, కేమ్. నీ టాలెంట్ చూపించు.

522
00:28:11,441 --> 00:28:12,442
నీకేమైనా పిచ్చా?

523
00:28:12,526 --> 00:28:16,488
హేయ్, రెబెక్కా. కవర్ ని చూసి పుస్తకాన్ని
అంచనా వేయరు కదా, ఓకే?

524
00:28:17,865 --> 00:28:18,866
మీ ఇష్టమొచ్చినట్లు చేయండి.

525
00:28:20,617 --> 00:28:21,618
ఒప్పుకుంది.

526
00:28:22,911 --> 00:28:27,916
లేడీస్ అండ్ జెంటిల్ మెన్, అందరికీ మళ్ళీ
హలో. మీకో విషయం చెప్పాలి.

527
00:28:29,209 --> 00:28:33,297
అత్యవసర కారణం వల్ల రాబీ విలియమ్స్
ఇక్కడికి రావడం లేదు.

528
00:28:33,380 --> 00:28:38,218
కానీ మీకోసం ఒక వ్యక్తి మిమ్మల్ని
అలరించడానికి ఇక్కడికి వచ్చారు.

529
00:28:38,302 --> 00:28:41,180
లేదంటే, ఇంటికి వెళ్ళే దారిలో
మాట్లాడుకునేలా చేస్తారు.

530
00:28:41,972 --> 00:28:47,603
కాబట్టి ఎక్కడినుండి వచ్చారో తెలియని,
కేమ్ తర్వాత తెలీదు, వారిని స్వాగతించండి.

531
00:28:54,818 --> 00:28:56,111
అబ్బా.

532
00:28:57,696 --> 00:28:58,697
ఏం చేస్తున్నాడు?

533
00:29:12,961 --> 00:29:18,592
<i>అమ్మా, ప్రకృతి తల్లీ
మేము చేసిన పనులకు మమ్మల్ని క్షమించు</i>

534
00:29:21,553 --> 00:29:23,889
మనం ఆటని వదిలేసి, వెళ్లి డాన్స్ చేద్దామా?

535
00:29:24,598 --> 00:29:26,683
మంత్రి ఐదడుగులు రాజు దగ్గరికి. చెక్ మేట్.

536
00:29:33,815 --> 00:29:36,777
<i>మనం మన ప్రకృతి తల్లిని బాధించాం</i>

537
00:29:36,860 --> 00:29:40,072
<i>ఆమె విలయం మొదలైంది</i>

538
00:30:02,970 --> 00:30:06,014
<i>ఎందుకంటే నేను నా తల్లికి ముద్దుల కొడుకుని</i>

539
00:30:09,101 --> 00:30:13,814
<i>కానీ</i>

540
00:30:13,897 --> 00:30:19,027
<i>నా సోదరులు మంచివారు కాదు</i>

541
00:30:19,903 --> 00:30:20,904
కేమ్
కోల్

542
00:30:27,536 --> 00:30:29,121
-థాంక్యూ వెరీ మచ్.
-మీకు వెల్కమ్.

543
00:30:29,204 --> 00:30:31,248
-మనం చాలా సరదాగా గడిపాం.
-థాంక్యూ వెరీ మచ్.

544
00:30:32,291 --> 00:30:33,417
గుడ్ నైట్.

545
00:30:33,959 --> 00:30:36,670
ఊహించలేనంత విరాళం ఇచ్చినందుకు
మళ్ళీ థాంక్యూ.

546
00:30:36,753 --> 00:30:38,505
-వచ్చే ఏడాది కలుద్దాం.
-అప్పటిదాకా ఆగలేను.

547
00:30:45,470 --> 00:30:46,680
బతకనేర్చినవాడు, అవునా?

548
00:30:47,347 --> 00:30:48,390
తప్పకుండా.

549
00:30:51,268 --> 00:30:55,189
అతను ఎలాంటి వాడో చూడగలిగేది మీరొక్కరే
అనుకోవచ్చు.

550
00:30:56,690 --> 00:30:57,691
కానీ కాదు.

551
00:31:04,823 --> 00:31:06,325
ఓహ్, బోయ్. నువ్వు బానే ఉన్నావా?

552
00:31:08,410 --> 00:31:10,245
-త్వరగా.
-సరే అయితే.

553
00:31:10,329 --> 00:31:11,330
ఫన్ నైట్.

554
00:31:12,915 --> 00:31:15,125
హేయ్, ఆగు, ఒక్క నిమిషం. ఆగు, కోచ్.

555
00:31:19,171 --> 00:31:20,964
నా మీద కోపం ఇంకా తగ్గలేదా?

556
00:31:24,009 --> 00:31:25,219
నన్ను క్షమించు బేబీ.

557
00:31:27,638 --> 00:31:29,598
నువ్వసలు దేనికి సారీ చెబుతున్నావో
తెలుసా, జేమీ?

558
00:31:30,474 --> 00:31:31,600
నువ్వు ఎప్పుడూ అదే అడుగుతావు.

559
00:31:32,392 --> 00:31:34,520
హేయ్, నాకో సాయం చేస్తావా.

560
00:31:34,603 --> 00:31:36,605
మీ ఇద్దరి గొడవ మధ్యలో నన్ను వాడుకోవద్దు.

561
00:31:37,564 --> 00:31:38,732
నేనొక ఇడియట్ లాగా అనిపించాను.

562
00:31:41,068 --> 00:31:42,903
నన్ను క్షమించు. నేను...

563
00:31:43,445 --> 00:31:44,655
నేనలా చేసుండాల్సింది కాదు.

564
00:31:45,906 --> 00:31:46,907
థాంక్స్.

565
00:31:47,533 --> 00:31:49,868
నీ మీద ఎవరూ బిడ్డింగ్ వేయట్లేదు ఫ్రెండ్,
ఇక్కడి నుండి పో.

566
00:31:51,411 --> 00:31:52,412
వెళ్ళిపో.

567
00:31:56,667 --> 00:31:58,210
నువ్వు అతనికి సారీ ఎందుకు చెబుతున్నావ్?

568
00:31:58,710 --> 00:32:00,712
జవాబుదారీగా ఉండడం అవసరం, జేమీ.

569
00:32:03,674 --> 00:32:04,675
మన మధ్య అయిపోయినట్లే.

570
00:32:06,093 --> 00:32:07,094
అప్పుడప్పుడూ కలుస్తాను.

571
00:32:10,931 --> 00:32:11,932
ఏదో ఒకటి.

572
00:32:18,438 --> 00:32:20,566
ఎక్స్క్యూజ్ మీ, నేనివి తీసుకోవచ్చా?

573
00:32:20,649 --> 00:32:21,650
రెండు?

574
00:32:31,451 --> 00:32:33,120
పీకల దాకా తాగాలని ఉందా?

575
00:32:33,537 --> 00:32:36,248
-ఓ, తప్పకుండా.
-అప్పుడు బ్యాంక్ దొంగతనమో, ఇంకేదో చేద్దాం.

576
00:32:43,005 --> 00:32:45,048
మిచెల్, హెన్రీ వచ్చే వీకెండ్
ఇక్కడికి వస్తున్నారు.

577
00:32:45,132 --> 00:32:46,508
-హేయ్, మంచి విషయం, కోచ్.
-అవును.

578
00:32:47,217 --> 00:32:49,511
కమాన్, నీ గురించీ, జేన్ గురించీ చెప్పు.
ఏం జరిగింది?

579
00:32:50,095 --> 00:32:51,221
మళ్ళీ అదే తప్పు చేశాను.

580
00:32:51,305 --> 00:32:54,016
-అమ్మాయి కంటే ఆటే ఎక్కువయిందా?
-అవును.

581
00:32:54,099 --> 00:32:55,809
దీని నుంచి ఏం నేర్చుకోబోతున్నావ్, కోచ్?

582
00:33:29,134 --> 00:33:31,136
[సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ]

