1
00:00:28,445 --> 00:00:31,406
వెస్ట్ లండన్ యొక్క అత్యుత్తమం

2
00:00:31,490 --> 00:00:32,658
అబ్బా.

3
00:00:34,243 --> 00:00:36,411
అందరికీ గుడ్ మార్నింగ్.
ఆలస్యానికి క్షమించండి.

4
00:00:37,162 --> 00:00:40,541
మనసు స్వాంతన పరుచుకోవాల్సి వచ్చింది
అందుకని ఆఫీసుకు నడిచి వద్దామనుకున్నాను.

5
00:00:40,624 --> 00:00:43,669
మనకు అంత బాగా తెలియని నగరంలో
స్వాంతన ఇచ్చుకుంటూ నడవడం

6
00:00:43,752 --> 00:00:45,629
కొంచెం చిక్కుతో కూడుకున్న పని.

7
00:00:45,712 --> 00:00:48,048
అప్పుడు నేను తప్పిపోయాను,
కానీ మళ్ళీ దారి దొరికింది,

8
00:00:48,131 --> 00:00:49,550
తరువాత మళ్ళీ తప్పిపోయాను కానీ...

9
00:00:49,633 --> 00:00:53,262
ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ బియర్డ్
ఉన్నాడు, నేట్ ఉన్నాడు, అది బాగుంది

10
00:00:53,345 --> 00:00:55,305
ఎందుకంటే ఈ ప్రపంచం
ఒక విషాదకరమైన, ఒంటరి చోటు, కానీ...

11
00:00:55,389 --> 00:00:57,599
సరేలెండి, మనం పని మొదలు పెడదామా?

12
00:00:57,683 --> 00:00:58,767
మిచెల్.

13
00:00:59,434 --> 00:01:00,269
అది బాగానే ఉంది.

14
00:01:00,352 --> 00:01:03,063
ఏంటో తెలుసా, అది పరవాలేదు ఎందుకంటే
ఇది నాకు కూడా చాలా మంచి సమయం,

15
00:01:03,146 --> 00:01:05,858
నన్ను నేను నా పనిలో
మునిగిపోయేలా చేసుకుంటాను.

16
00:01:05,941 --> 00:01:07,317
ఇంకా... నాకు పిచ్చి లేకపోయినా...

17
00:01:07,401 --> 00:01:09,570
నాకు "మునిగిపోవడం" అన్న పదం నచ్చదు,
నేనన్నది అర్థం అయింది కదా?

18
00:01:09,653 --> 00:01:11,780
దానిలో ఒక ప్రతికూల అర్థం దాగి ఉంది, కాదా?

19
00:01:11,864 --> 00:01:13,407
అందుకు బదులుగా నేను ఏ పదాన్ని వాడవచ్చు?

20
00:01:13,490 --> 00:01:17,703
అందరికీ ఒక మంచి స్నానం
నచ్చుతుంది కదా? అవునా?

21
00:01:17,786 --> 00:01:20,706
అందుకని నేను అదే అంటాను. నేను అంటాను,
"నన్ను నేను నా పనిలో స్నానం చేసుకుంటాను."

22
00:01:20,789 --> 00:01:22,332
అది ఎలా ఉంది? అది బాగుంది. అది బాగుంది.

23
00:01:22,416 --> 00:01:24,168
నేట్, నీకు ఇష్టమైన బాత్ బాంబ్
ఏదైనా ఉందా, మిత్రమా?

24
00:01:24,251 --> 00:01:27,296
లేదు, నాకు స్నానాలు నిజంగా నచ్చావు,
ఎందుకంటే నా చర్మం ముడతలు పడుతుంది,

25
00:01:27,379 --> 00:01:29,089
ఇంకా నాకు ముసలితనం గురించి
చాలా ఆందోళనగా ఉంటుంది.

26
00:01:29,173 --> 00:01:32,092
సరే, నాకు అర్థమైంది. మీ సంగతి ఏంటి, కోచ్?
మీకేదైనా ఇష్టమైన బాంబ్ ఉందా?

27
00:01:32,176 --> 00:01:33,260
క్రీమ్ బ్రులే హనీ.

28
00:01:33,343 --> 00:01:35,554
హానీ? అది ఒక పదార్ధమా లేక
అది నువ్వు నన్ను పిలిచే పేరా?

29
00:01:35,637 --> 00:01:36,805
-పదార్ధం.
-అబ్బా.

30
00:01:36,889 --> 00:01:39,600
నేను వేరేది అయి ఉంటే బాగుండేదని
అనుకున్నాను. కానీ అది ఒక సరదా అయిన ఆలోచన.

31
00:01:39,683 --> 00:01:41,935
మనం ఒకరినొకరం ముద్దు పేర్లు
పెట్టి పిలుచుకుంటే బాగుంటుందేమో.

32
00:01:42,019 --> 00:01:44,104
తెలుసా? అది "హనీ" లేదా "ప్రియా" లా, సరేనా?

33
00:01:44,188 --> 00:01:46,064
అది బాగుంటుంది, సరేనా?
నువ్వేమనుకుంటావు, కోచ్?

34
00:01:47,024 --> 00:01:48,317
నేట్, నువ్వు నాకొక సహాయం చేస్తావా?

35
00:01:48,400 --> 00:01:50,569
ఇవాళ ప్రాక్టిస్ ప్లాన్ చేయడానికి
కోచ్ కి సహాయం చేస్తావా?

36
00:01:50,652 --> 00:01:52,696
-అలాగే, తప్పకుండా.
-సరే. ధన్యవాదాలు, స్వీటీ.

37
00:01:52,779 --> 00:01:54,781
సరే, నేను కాసేపట్లో వస్తాను.

38
00:01:56,700 --> 00:01:58,952
-అతను బాగానే ఉన్నాడా?
-లేడు.

39
00:02:21,517 --> 00:02:22,518
♪ మనం రిచ్మండ్

40
00:02:22,601 --> 00:02:24,603
సరే. మనం చేద్దామా?
సారా, నువ్వు ఎందుకు మొదలుపెట్టవు?

41
00:02:24,686 --> 00:02:28,190
అయితే, కోచ్ లాసో.
మొత్తానికి మీరు మీ మొదటి మ్యాచ్ గెలిచారు.

42
00:02:28,273 --> 00:02:29,358
అది ఎలా అనిపిస్తోంది?

43
00:02:29,441 --> 00:02:32,152
అంటే, సారా, మీరు మీ ప్రత్యర్దికన్నా
ఎక్కువ కొట్టి కూడా ఓడిపోవచ్చు.

44
00:02:32,236 --> 00:02:34,238
మీరు వారి కన్నా తక్కువ
స్కోర్ చేసి గెలిచినట్లు.

45
00:02:34,321 --> 00:02:37,032
కానీ పోయిన వారం మేము ఖచ్చితంగా
గెలిచాము, అది చాలా బాగుంది.

46
00:02:37,699 --> 00:02:39,535
సరే, తదుపరి ప్రశ్న.

47
00:02:42,287 --> 00:02:44,164
ట్రెంట్ క్రిం, ది ఇండిపెండెంట్.

48
00:02:45,040 --> 00:02:48,210
తదుపరి మ్యాచ్ లో జేమీ టార్ట్ గేమ్ ఆడడానికి
తిరిగి వస్తాడని మేము అనుకోవచ్చా?

49
00:02:48,293 --> 00:02:50,879
అనవసరంగా ఊహించుకుంటే ఏమంటారో
తెలుసుగా, ట్రెంట్?

50
00:02:50,963 --> 00:02:53,841
మీరు పిచ్చివారు అని. అవునా?

51
00:02:55,217 --> 00:02:56,885
నా ఇంగ్లీష్ మీ అందరి ఇంగ్లీష్

52
00:02:56,969 --> 00:03:00,430
ఎలా కలవదు అన్నదానికి అది మరొక ఉదాహరణ.

53
00:03:02,349 --> 00:03:05,185
కానీ నిజంగా, మీరు మీ అత్యుత్తమ ఆటగాడిని
ఆడించకుండా ఎలా కూర్చోపెట్టగలరు?

54
00:03:05,269 --> 00:03:08,814
అది జేమీ మీద ఆధారపడి ఉంటుంది.
మాకు అతని నుంచి ఏం కావాలో అతనికి తెలుసు.

55
00:03:08,897 --> 00:03:11,024
మనం ఇది కొనసాగిద్దామా, సరేనా?
కిప్, అడగండి.

56
00:03:11,108 --> 00:03:14,361
-టెడ్. సరిగ్గా నేను కలవాలనుకున్న వారు.
-హే, బాస్.

57
00:03:14,444 --> 00:03:17,364
జేమీ టార్ట్ ని ఆడించకూడదన్న
నీ నిర్ణయం చాలా ధైర్యంతో కూడుకున్నది.

58
00:03:17,447 --> 00:03:19,491
-ధన్యవాదాలు.
-అంటే, అది ఒక మాస్టర్ స్ట్రోక్.

59
00:03:19,575 --> 00:03:21,577
మనం పని సమయంలో అలా
మాట్లాడకూడదని అనుకుంటాను.

60
00:03:21,660 --> 00:03:22,953
ఇపుడు ఒక చిన్న సమస్య వచ్చింది.

61
00:03:23,036 --> 00:03:24,413
మాంచెస్టర్ సిటీ ఫోన్ చేసారు,

62
00:03:24,496 --> 00:03:27,082
వారు జేమీ లోన్ ఆపివేయడం
గురించి అడుగుతున్నారు.

63
00:03:27,457 --> 00:03:29,585
-వారు అతని ఇల్లు తీసుకుంటున్నారా?
-కాదు.

64
00:03:29,668 --> 00:03:32,963
టెడ్, జేమీ కాంట్రాక్ట్ మంచెస్టర్ సిటీది,

65
00:03:33,046 --> 00:03:35,299
వారు ఈ సీజన్ కోసం
అతన్ని రిచ్మండ్ కు అప్పుగా ఇచ్చారు.

66
00:03:35,382 --> 00:03:37,134
సరే. నాకు అర్థమైంది.

67
00:03:37,217 --> 00:03:39,469
నువ్వు అతన్ని ఆడించకూడదని నిర్ణయించుకుంటే,
వారికి జేమీ తిరిగి కావాలట.

68
00:03:39,553 --> 00:03:42,139
నేనలా చేయాలని అనుకోవడం లేదు.
లేదు, నా ప్లాన్ నా ప్లాన్ పని చేయడం కోసం.

69
00:03:42,222 --> 00:03:45,475
కానీ బాగా ఆలోచించబడిన ప్లాన్ల
గురించి ఏమంటారో తెలుసు కదా?

70
00:03:45,559 --> 00:03:48,395
ప్లాన్ ని చాలా సార్లు అన్నాను, ఆ పదం
దాని అర్థాన్ని పూర్తిగా కోల్పోయింది.

71
00:03:48,478 --> 00:03:51,607
ప్లాన్. ప్లాన్. ప్లాన్. అది అనవసరం.

72
00:03:51,690 --> 00:03:54,443
హే, మీరు మాన్ సిటీకి ఈ వ్యక్తికి
ఒక ప్లాన్ ఉందని చెప్పండి.

73
00:03:54,526 --> 00:03:57,487
-ప్లాన్. ప్లాన్. ప్లాన్?
-ప్లాన్.

74
00:03:57,571 --> 00:03:58,989
-ప్లాన్?
-ప్లాన్ కాదు.

75
00:04:00,032 --> 00:04:02,034
-ప్లాన్.
-"ఫ్లాన్" లా. ప్లాన్.

76
00:04:02,117 --> 00:04:03,702
ఫ్లాన్? ఆ స్వీటా?

77
00:04:03,785 --> 00:04:04,995
అవును, "ఫ్లాన్" లా.

78
00:04:05,078 --> 00:04:07,039
లేదు, నాకు ఫ్లాన్ నచ్చదు.

79
00:04:07,122 --> 00:04:09,791
ప్లాన్. ప్లాన్.

80
00:04:10,209 --> 00:04:12,127
ప్లాన్. ప్లాన్?

81
00:04:12,544 --> 00:04:14,463
-పదం ఒక ధ్వని అవుతుందా?
-దాన్ని ఏమంటారు?

82
00:04:14,546 --> 00:04:16,130
-సెమాంటిక్ సాటియేషన్.
-అవును.

83
00:04:16,214 --> 00:04:18,216
సరే. అలాగే.

84
00:04:18,841 --> 00:04:20,719
మెక్సికో నుంచి వచ్చిన
ఆ అబ్బాయి ఇక్కడున్నాడా?

85
00:04:20,802 --> 00:04:22,846
-తన మోకాలికి చికిత్స చేయించుకుంటున్నాడు.
-సరే, మంచిది.

86
00:04:23,180 --> 00:04:25,140
-అతని పేరేంటి?
-డానీ రోహాస్.

87
00:04:25,224 --> 00:04:27,434
అవును. ఆ పేరు బాగుంది. సరే.

88
00:04:27,518 --> 00:04:28,644
జేమీ ఎలా ఉన్నాడు?

89
00:04:30,395 --> 00:04:31,396
ఏంటి?

90
00:04:31,480 --> 00:04:34,775
అతనివాళ ప్రాక్టిస్ చేయలేడట.
గాయపడ్డానని అన్నాడు.

91
00:04:38,445 --> 00:04:39,446
అబ్బా.

92
00:04:41,990 --> 00:04:43,200
హే, జేమీ.

93
00:04:43,617 --> 00:04:46,078
నువ్వివాళ మాతో కలిసి పరిగెత్తలేవని
విన్నాను. అది నిజమా?

94
00:04:46,161 --> 00:04:47,538
అవును.

95
00:04:47,621 --> 00:04:48,622
ఎందుకని?

96
00:04:49,164 --> 00:04:50,457
ఎందుకంటే నేను గాయపడ్డాను.

97
00:04:52,167 --> 00:04:53,669
అది వినడానికి నిజంగా బాధగా ఉంది.

98
00:04:55,170 --> 00:04:57,756
శాంతించు, టెడ్. ఇది కేవలం ప్రాక్టిస్.

99
00:05:07,307 --> 00:05:08,559
హే.

100
00:05:08,642 --> 00:05:10,310
నువ్వు ప్రాక్టిస్ చేయలేకపోతే,
నువ్వు ప్రాక్టిస్ చేయలేవు.

101
00:05:10,394 --> 00:05:13,188
నువ్వు గాయపడితే, నువ్వు గాయపడ్డావు.
అది అంతే.

102
00:05:15,065 --> 00:05:17,776
కానీ ఇది దాని గురించి కాదు... కానే కాదు.

103
00:05:20,737 --> 00:05:23,574
నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావు.
నువ్వొక ఫ్రాంచైస్ ఆటగాడివి.

104
00:05:23,657 --> 00:05:26,535
అయినా కూడా మనం ఇక్కడ నువ్వు ప్రాక్టిస్
మిస్ అవడం గురించి మాట్లాడుకుంటున్నాము.

105
00:05:28,787 --> 00:05:30,706
మనం మాట్లాడుతోంది ప్రాక్టిస్ గురించి.

106
00:05:30,789 --> 00:05:32,833
నీకు అర్థం అవుతోందా? ప్రాక్టిస్.

107
00:05:33,500 --> 00:05:35,377
ఒక గేమ్ కాదు.

108
00:05:35,460 --> 00:05:39,047
ఒక గేమ్ కాదు. నువ్వు అక్కడికి వెళ్లి
ఆడడానికి పడి చచ్చిపోయే ఆ గేమ్ కాదు, కదా?

109
00:05:39,131 --> 00:05:40,674
నీ ప్రతి వారంతం అది నీ
చివరిదానిలా ఆడాలి కదా?

110
00:05:40,757 --> 00:05:43,051
కాదు మనం ఇక్కడ ప్రాక్టిస్ గురించి
మాట్లాడుతున్నాము, బాబు.

111
00:05:43,135 --> 00:05:45,804
ప్రాక్టిస్! నువ్వు అక్కడ ఉండాలి.

112
00:05:45,888 --> 00:05:47,347
నువ్వు ఉదాహరణ ద్వారా నాయకత్వం చూపించాలి.

113
00:05:47,431 --> 00:05:49,391
నువ్వదంతా పక్కకి తోసేస్తున్నావు.

114
00:05:49,474 --> 00:05:52,895
అయితే, అదే చెప్తున్నా, జేమీ. మనం
ప్రాక్టిస్ గురించి మాట్లాడుకుంటున్నాము.

115
00:05:52,978 --> 00:05:54,563
ఒక గేమ్ గురించి కాదు.

116
00:05:54,646 --> 00:05:55,606
ఆ గేమ్ గురించి కాదు.

117
00:05:55,689 --> 00:05:58,901
నీ టీమ్ తో ప్రాక్టిస్ గురించి
మాట్లాడుకుంటున్నాము. నీ టీమ్ మేట్స్ తో.

118
00:06:00,152 --> 00:06:02,613
మనం కలిసి ఆడే ఒకే ఒక్క చోటు,
మనకు నియంత్రణ ఉన్న చోటు.

119
00:06:02,696 --> 00:06:04,907
మిగతా సమయంలో అది
వారి 11కి వ్యతిరేకంగా మన 11.

120
00:06:04,990 --> 00:06:07,618
మనం ప్రాక్టిస్ గురించి
మాట్లాడుతున్నాము, బాబు!

121
00:06:07,993 --> 00:06:12,247
నేను ప్రాక్టిస్ గురించి మాట్లాడుతున్నాను!
నువ్వుది చేయలేవు ఎందుకంటే గాయపడ్డావు.

122
00:06:13,332 --> 00:06:14,708
అవునా?

123
00:06:15,918 --> 00:06:17,169
అది నాకు పరవాలేదు.

124
00:06:18,378 --> 00:06:19,838
ఏంటో చెప్పనా. ఒక సహాయం చెయ్యి.

125
00:06:19,922 --> 00:06:21,215
నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు,

126
00:06:21,298 --> 00:06:24,760
వేరే రిజర్వులు పాసింగ్ డ్రిల్
ప్రాక్టిస్ చేయడానికి కోన్లు పెట్టు.

127
00:06:25,260 --> 00:06:28,180
-మీరు నన్ను కోన్లు పెట్టమంటున్నారా?
-అందుకు ధన్యవాదాలు.

128
00:06:30,015 --> 00:06:32,392
-కాలిన్, వెళ్లి కోన్లు పెట్టు.
-ఆయన నిన్ను అడిగారనుకుంటాను, మిత్రమా.

129
00:06:32,476 --> 00:06:33,852
నేను నీతో మాట్లాడానా, పెద్ద మనిషి?

130
00:06:33,936 --> 00:06:35,896
కాలిన్, కోన్లు పెట్టు.

131
00:06:35,979 --> 00:06:38,732
ఐసాక్ చెప్పింది నిజం. ఆయన నిన్ను అడిగారు.
నువ్వు సెకండ్-టీమర్ వి.

132
00:06:46,448 --> 00:06:47,991
అది బాధ పెట్టాలి.

133
00:06:50,827 --> 00:06:52,120
చీర్స్.

134
00:06:56,375 --> 00:06:59,336
జేమీకి అతని స్థానం చూపించడం బాగుంది.

135
00:06:59,419 --> 00:07:01,255
-అది ఉత్సాహంగా కూడా ఉంది?
-కాదు, కాదు, కాదు.

136
00:07:01,338 --> 00:07:02,840
ఇదొక ష్రాడెన్ ఫ్రాయిడ్ జోన్ కాదు, సరేనా?

137
00:07:02,923 --> 00:07:04,967
-నాయిన్ ష్రాడెన్ ఫ్రాయిడ్.
-సరే.

138
00:07:05,050 --> 00:07:07,094
కొత్త అబ్బాయి, అతని... డానీ ఏంటి?

139
00:07:07,177 --> 00:07:09,346
-రోహాస్.
-రోహాస్, ఆ. అతను బాగా ఆడతాడా?

140
00:07:09,429 --> 00:07:11,849
ఇక్కడికి వేసవి బదిలీ సమయంలో
వచ్చాడు, రాగానే గాయపడ్డాడు,

141
00:07:11,932 --> 00:07:14,017
-అందుకని అతను ఆడడం ఎవరూ చూడలేదు.
-అది పరవాలేదు.

142
00:07:14,101 --> 00:07:16,645
ఎందుకంటే, జేమీ తన స్థానంలో
వేరే ఎవరో ఆడుతున్నారని చూస్తే,

143
00:07:16,728 --> 00:07:18,939
అది...
అంటే, అది అతని మనసుని గాయపరుస్తుంది.

144
00:07:21,275 --> 00:07:23,694
నన్ను క్షమించండి.
నేను అందుకు సంతోషపడకూడదు.

145
00:07:24,570 --> 00:07:27,155
సరే, మనం డానీ ఇక్కడ అలవాటు
పడడానికి సహాయం చేద్దాము, సరేనా?

146
00:07:27,239 --> 00:07:29,491
ఈ లీగ్ లో మొదటి సారి అడుగుపెట్టటం
చాలా భయపెడుతుంది.

147
00:07:31,618 --> 00:07:34,705
డానీ రోహాస్! డానీ రోహాస్! డానీ రోహాస్!

148
00:07:34,788 --> 00:07:40,085
రోహాస్, డానీ రోహాస్!
రోహాస్, రోహాస్, రోహాస్!

149
00:07:40,169 --> 00:07:42,504
హే! హలో కోచులు.

150
00:07:42,588 --> 00:07:45,549
-ఈ అవకాశానికి ధన్యవాదాలు.
-ఆ. నీవు ఉత్సాహపూరిత వ్యక్తివి, డానీ.

151
00:07:45,632 --> 00:07:47,801
అక్కడికి వెళ్లి,
ఆ స్ట్రైకర్ స్థానం తీసుకో, సరేనా?

152
00:07:47,885 --> 00:07:51,763
అవును! సరిగ్గా గ్వాడలహారాలో లానే,
మీరు అంటారు, నేను చేస్తాను, కోచ్.

153
00:07:52,222 --> 00:07:53,557
ఫుట్ బాలే జీవితం!

154
00:07:57,728 --> 00:07:58,937
నాకతను నచ్చాడు.

155
00:08:01,982 --> 00:08:03,233
జేమీకి నచ్చలేదు.

156
00:08:03,317 --> 00:08:06,153
అలాంటి పిచ్చి వెధవలు
పిచ్ లో ఎప్పటికీ ఆడలేరు.

157
00:08:25,088 --> 00:08:26,340
చాలా బాగా క్రాస్ చేసావు, సామ్!

158
00:08:28,217 --> 00:08:29,635
ఫుట్ బాలే జీవితం!

159
00:08:30,969 --> 00:08:31,970
అబ్బా.

160
00:08:37,267 --> 00:08:39,019
నువ్వది చూసావా?

161
00:08:39,102 --> 00:08:42,438
నేను నిజంగా చెప్పలేను, కానీ అతను
చాలా బాగా ఆడతాడనుకుంటాను.

162
00:08:43,899 --> 00:08:45,150
మళ్ళీ చీర్స్.

163
00:08:45,234 --> 00:08:48,612
కొంతమంది ఉద్యోగంలేని మేనేజర్లు
త్వరలోనే ఖాళీ వస్తుందా అని అడుగుతున్నారు.

164
00:08:48,695 --> 00:08:51,865
టోనీ పులిస్. ఆలన్ కర్బిష్లీ.
హ్యారీ రెడ్ న్యాప్ మూడుసార్లు ఫోన్ చేసాడు.

165
00:08:52,783 --> 00:08:56,745
హాయ్. నేను రాత్రంతా కూర్చుని
ఆటగాళ్ళ గురించి లోతుగా శోధించాను.

166
00:08:56,828 --> 00:08:59,289
రిచర్డ్ ఒక మేకల పొలంలో
పెరిగాడని నీకు తెలుసా?

167
00:08:59,373 --> 00:09:02,209
ఐసాక్ తల్లి అయోమయం అని నీకు తెలుసా?

168
00:09:02,292 --> 00:09:05,546
నేను నాకు తెలిసిన వారిని స్పాన్సర్షిప్
అవకాశాల గురించి ఆడిగాను.

169
00:09:05,629 --> 00:09:07,214
నాకోసం ఒక వర్క్ ప్లానర్
కూడా తెచ్చుకున్నాను.

170
00:09:07,297 --> 00:09:10,217
"యూనికార్న్" అని రాసి లేనిది
నీకు దొరకలేదా?

171
00:09:10,300 --> 00:09:12,469
ఛీ పో. ఇది చాలా బాగుంది.

172
00:09:14,012 --> 00:09:17,474
క్షమించండి, నేను మిమ్మల్నలా అంటే మీరెలా
స్పందిస్తారో ఆలోచించకుండా ఉండలేకపోయాను.

173
00:09:22,813 --> 00:09:24,815
-ఇక అంతే, హిగ్గిన్స్.
-అవును.

174
00:09:25,482 --> 00:09:27,276
నువ్వు నవ్వుతూంటే చూడడం
నాకు నిజంగా బాగుంది.

175
00:09:27,359 --> 00:09:29,069
నేను నువ్వు బాగానే ఉన్నావో లేదో
చూడడానికి వచ్చాను నిజంగా.

176
00:09:29,152 --> 00:09:30,487
నేనెందుకు బాగుండను?

177
00:09:30,571 --> 00:09:32,948
ఓహ్, దేవుడా.
అయితే నువ్వు ఇంకా వార్తలు చూడలేదా?

178
00:09:34,074 --> 00:09:37,703
నేను నీకు స్వాంతన ఇవ్వాలనుకున్నాను కానీ
నీకా వార్త చెప్పే దాన్ని అవ్వాలనుకోలేదు.

179
00:09:38,537 --> 00:09:40,372
నీకా అందమైన అమ్మాయి, బెక్స్, గుర్తుందా?

180
00:09:40,455 --> 00:09:42,749
గాలా రోజు రాత్రి
రూపర్ట్ తో వెళ్ళిన అమ్మాయి?

181
00:09:45,085 --> 00:09:47,337
ఆమె నిజంగా అందంగా లేదని
నన్ను నటించమని అంటున్నావా?

182
00:09:47,421 --> 00:09:48,630
నేనది మెచ్చుకుంటాను.

183
00:09:48,714 --> 00:09:52,050
సరే. ఆ పిచ్చి అమ్మాయి, ఆమె పేరు బెక్స్,

184
00:09:52,634 --> 00:09:55,137
-అది పొట్టి పేరు...
-రెబెక్కా కోసం.

185
00:09:55,220 --> 00:09:57,806
అవును, అది నీ పేరు కూడా, అది నీకు తెలుసు.

186
00:09:57,890 --> 00:10:00,225
అందుకని ప్రెస్ ఆమెని పిలుస్తోంది...

187
00:10:00,309 --> 00:10:02,436
"కొత్త రెబెక్కా." అబ్బా.

188
00:10:03,103 --> 00:10:04,104
కాదు.

189
00:10:04,771 --> 00:10:09,193
ప్రెస్ ఆమెను "రెబెక్కా"
అంటోంది, ఇంక నిన్ను...

190
00:10:10,360 --> 00:10:11,361
"ఓల్డ్ రెబెక్కా" అంటోంది.

191
00:10:11,778 --> 00:10:13,989
-ఏంటి?
-ఓల్డ్ రెబెక్కా.

192
00:10:14,573 --> 00:10:15,991
ఓల్డ్ రెబెక్కా?

193
00:10:19,453 --> 00:10:22,122
దాని గురించి ఆలోచించకు.
నువ్విది తట్టుకోగలవు.

194
00:10:22,206 --> 00:10:23,624
నీకు ఎప్పుడైనా బాధగా అనిపిస్తే,

195
00:10:23,707 --> 00:10:26,126
లేదా నువ్విది తట్టుకోలేకపోతే,
నాకు ఫోన్ చెయ్యి, సరేనా?

196
00:10:44,561 --> 00:10:47,314
వావ్! అది కావాలని చేసావు, కదా?

197
00:10:47,397 --> 00:10:49,024
అవును. చూడు, మిత్రమా.

198
00:10:49,107 --> 00:10:50,776
నువ్వు బాగా ఆడతావు, కానీ ఇక్కడ,

199
00:10:50,859 --> 00:10:53,278
బాగా ఆడడానికి,
గొప్పగా ఆడడానికి మధ్య తేడా ఉంది.

200
00:10:58,075 --> 00:10:59,910
1-1. నీ వంతు, మిత్రమా.

201
00:11:13,757 --> 00:11:14,758
అబ్బా.

202
00:11:14,842 --> 00:11:16,844
సరే, అయితే ఇది చూడు. లెఫ్ట్ పోస్ట్.

203
00:11:19,805 --> 00:11:21,265
వావ్. అది చాలా బాగుంది.

204
00:11:22,224 --> 00:11:23,308
నాకు తెలుసు.

205
00:11:25,811 --> 00:11:26,937
అవును!

206
00:11:35,737 --> 00:11:36,738
నాకు అదృష్టం కలిసొచ్చింది.

207
00:11:36,822 --> 00:11:39,908
-మళ్ళీ రేపా, జేమీ టార్ట్?
-చూద్దాం.

208
00:11:39,992 --> 00:11:41,159
ఫుట్ బాలే జీవితం!

209
00:11:43,453 --> 00:11:46,999
డానీ రోహాస్, రోహాస్! డానీ రోహాస్!

210
00:11:47,082 --> 00:11:49,918
అబ్బా. నేను చెప్తున్నాను.

211
00:11:50,002 --> 00:11:54,339
మనమొక అదృష్టవంతమైన చెట్టు నుంచి పడి కిందకి
వెళుతూ దారిలో ప్రతి కొమ్మను తగులుకుంటూ

212
00:11:54,423 --> 00:11:57,634
నిండా డబ్బు, సోర్ పాచ్ కిడ్స్ ఉన్న
పూల్ లో పడినట్లు అనిపిస్తోంది.

213
00:11:57,718 --> 00:12:00,345
అంటే, జేమీ ఒక ఆసు, అవునా?

214
00:12:00,429 --> 00:12:03,307
అతని వైఖరి అతన్ని
కళావరు ఏడుగా మార్చింది.

215
00:12:03,390 --> 00:12:06,059
అందుకని మనం అతన్ని తిరిగి
ఆసుగా మార్చడానికి ఒకతన్ని తీసుకువస్తే,

216
00:12:06,143 --> 00:12:08,103
అతను కూడా ఒక ఆసు అయ్యాడు.

217
00:12:08,187 --> 00:12:09,605
ఇప్పుడు మన దగ్గర రెండు ఆసులు ఉన్నాయి.

218
00:12:09,688 --> 00:12:13,609
ఆసులు. ఆసులు. అబ్బా. నేనిది మళ్ళీ చేసాను.
నాకు అదృష్టం తగిలింది.

219
00:12:13,692 --> 00:12:15,068
-ఆసులు.
-ఆ పదం అదే కదా?

220
00:12:15,152 --> 00:12:16,695
-ఆసులు.
-ఆసులు.

221
00:12:16,778 --> 00:12:18,155
-ఆసు.
-ఆసులు? ఓహ్, ఇప్పుడు నేను ఇక్కడున్నాను.

222
00:12:18,238 --> 00:12:20,532
-చూసావా? సరే, బాగుంది.
-ఆసులు? ఆసులు.

223
00:12:20,616 --> 00:12:22,159
-ఇది అంటుకునే రకం కాకపొతే బాగుంది.
-ఆసులు.

224
00:12:22,242 --> 00:12:24,620
-ఆసులు. ఆసులు.
-ఆసులు? ఆసులు?

225
00:12:24,703 --> 00:12:25,537
-ఆసులు.
-ఆసులు.

226
00:12:25,621 --> 00:12:27,164
-ఐసిస్.
-కాదు, అది 'ఐసిస్" లా అనిపిస్తోంది.

227
00:12:27,247 --> 00:12:28,665
నేను "ఐసిస్" అన్నాను. నేనలా అనాలనుకోలేదు.

228
00:12:28,749 --> 00:12:31,585
సరే, మనం కిస్ నుంచి
లీడ్ గిటారిస్ట్ ని క్లోన్ చేద్దామా?

229
00:12:31,668 --> 00:12:33,212
-నీకప్పుడు ఇద్దరు...
-ఫ్రేలేస్ ఉంటారు.

230
00:12:44,306 --> 00:12:46,683
ఈ మధ్య వాతరవరణం బాగుంటోంది కదా?

231
00:12:46,767 --> 00:12:48,310
నాకు సంవత్సరంలో ఈ సమయం నచ్చుతుంది.

232
00:12:48,393 --> 00:12:51,104
-తాజా ఆకుల సువాసన.
-ఏమవుతోంది?

233
00:12:51,188 --> 00:12:53,774
నేను మనిద్దరం కలిసి నడకకు
వెళ్లినట్టు నటిస్తున్నాను.

234
00:12:53,857 --> 00:12:54,858
నేను చదవడానికి ప్రయత్నిస్తున్నాను.

235
00:12:56,401 --> 00:12:58,779
నేను కూడా నిజానికి
ఈ మధ్య చాలా చదువుతున్నాను.

236
00:13:00,072 --> 00:13:01,865
నేను సౌత్ లండన్ లో ఒక చెత్త భాగంలో పెరిగిన

237
00:13:01,949 --> 00:13:04,785
ఒక అబ్బాయి గురించి ఈ పిచ్చి కథను చదివాను.

238
00:13:04,868 --> 00:13:09,081
పంపక పంపక ఆ పిల్లాడ్ని
సందర్లాండ్ లో ఆడడానికి పంపించారు.

239
00:13:09,540 --> 00:13:12,835
ఆ తరువాత అతను తన సొంత
చారిటీ సింగిల్ ర్యాప్ చేయాల్సి వచ్చింది,

240
00:13:12,918 --> 00:13:15,379
దాన్ని "విన్నర్, విన్నర్,
ఫుట్ బాల్ డిన్నర్" అన్నారు.

241
00:13:15,462 --> 00:13:16,922
అది ప్రపంచ ఆకలి కోసం.

242
00:13:17,422 --> 00:13:19,633
అది చికిత్స అని నేను నమ్ముతాను.

243
00:13:21,635 --> 00:13:24,096
అయినా ఇదంతా నీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వేం
చేస్తున్నావు? నా వెంట పడుతున్నావా?

244
00:13:24,179 --> 00:13:27,140
లేదు, నేను అందరు
ఆటగాళ్ళ జీవితచరిత్రలు చూస్తున్నాను.

245
00:13:27,724 --> 00:13:29,852
రెబెక్కా నన్ను పిఆర్ టీమ్ కి
సహాయం చేయమని అడిగింది.

246
00:13:29,935 --> 00:13:32,980
నన్ను దానికి దూరంగా ఉంచు. నేను
అందరికీ చూపించుకునే నీ గుర్రాన్ని కాను.

247
00:13:33,772 --> 00:13:36,400
ఒక నెంబర్ ధరించి, జనాలు
చప్పట్లు కొడుతుంటే అటూ ఇటూ పరిగెడతావు,

248
00:13:37,150 --> 00:13:39,528
అందుకని నేను అందరికన్నా
గొప్పవాడినని అనుకోను.

249
00:13:41,071 --> 00:13:42,114
మళ్ళీ కలుస్తాను, రాయ్.

250
00:13:45,492 --> 00:13:48,203
డానీ రోహాస్! డానీ, డానీ!

251
00:13:55,752 --> 00:13:56,753
సరే.

252
00:13:56,837 --> 00:13:59,590
సరే, సరే, నాకు అర్థం కావడం లేదు.
అసలు ఏమైంది?

253
00:13:59,673 --> 00:14:02,384
-నువ్వు దేనికైనా తట్టుకుని పడ్డావా?
-విషయం అదే, కోచ్.

254
00:14:02,467 --> 00:14:05,804
నేను దేనికీ తట్టుకుని కింద పడలేదు.
ఏదో నన్ను కిందపడేసింది.

255
00:14:06,388 --> 00:14:07,931
అక్కడ లేనిది ఏదో.

256
00:14:12,769 --> 00:14:15,480
ఆ. సరే, డాక్.
వెళ్లి అతన్ని చూపిద్దాము.

257
00:14:16,607 --> 00:14:18,358
సరే. నువ్వు బాగానే ఉన్నావు.

258
00:14:19,651 --> 00:14:21,612
దేవుడా, ఇదంతా నా తప్పు.

259
00:14:21,695 --> 00:14:23,530
నేను శిక్షణకు ముందు డానీని
చికిత్సా గదిలోకి వెళ్ళడం చూసాను,

260
00:14:23,614 --> 00:14:24,865
కానీ నేను ఏమీ అనలేదు.

261
00:14:25,782 --> 00:14:27,284
అదొక పొరపాటు.

262
00:14:27,367 --> 00:14:29,036
నువ్వు ఏమీ అనకుండా ఎలా ఉన్నావు?

263
00:14:29,119 --> 00:14:30,621
మీరందరూ మీ వీడ్కోళ్ళు
చెప్పుకున్నారని ఆశిస్తాను,

264
00:14:30,704 --> 00:14:32,706
-మనమిక అతన్ని ఎన్నటికీ చూడము.
-హే, అది చాలు!

265
00:14:32,789 --> 00:14:35,459
నాకు, బియర్డ్ కి అర్థం కాని విషయం
మరొక్క సారి ఎవరైనా మాట్లాడితే,

266
00:14:35,542 --> 00:14:37,669
నేను మా అబ్బాయి చేసేలాంటి గోల చేస్తాను.

267
00:14:37,753 --> 00:14:39,963
అది అతను నన్ను పిచ్చి పేర్లు పిలుస్తాడు,

268
00:14:40,047 --> 00:14:43,634
నాకు తెలియదు, అది "మొద్దు ముఖం"
లేదా "పాటీ ముఖం"

269
00:14:43,717 --> 00:14:46,136
లేదా "పాటీ మడ్డి ముఖం" లేదా నాకు తెలీదు,
లాంటివి. ఇక్కడ నాకు తెలియని విషయం ఏమిటి?

270
00:14:46,220 --> 00:14:47,930
-"పీ పీ వేళ్ళు."
-"పీ పీ వేళ్ళు."

271
00:14:48,013 --> 00:14:49,681
అబ్బా. చెప్పండి.

272
00:14:52,184 --> 00:14:55,020
ఆ చికిత్సా గది శపించబడింది.

273
00:14:55,103 --> 00:14:56,855
-ఏంటి?
-అది నిజం.

274
00:14:56,939 --> 00:14:59,107
నేను దీని గురిచి మొదటిసారిగా
ఇప్పుడే ఎందుకు వింటున్నాను?

275
00:14:59,191 --> 00:15:02,110
పెద్దవారి ఈ హూడూ, ఊడూ, జూజూల
వంటి వాటి గురించి నమ్మడం

276
00:15:02,194 --> 00:15:05,280
సిగ్గుపడే విషయం అని అందరూ
అనుకోవడంవలన అనుకుంటాను.

277
00:15:05,364 --> 00:15:07,032
-హే, నేనది నమ్మను.
-సరే, మంచిది.

278
00:15:07,115 --> 00:15:08,784
అయితే, నువ్వు, నేను
ఆ గదిలోకి వెళ్లి చూద్దాము.

279
00:15:08,867 --> 00:15:10,410
-వద్దు.
-ఎందుకు?

280
00:15:10,494 --> 00:15:12,162
ఎందుకంటే... వద్దు.

281
00:15:13,038 --> 00:15:15,290
అబ్బా! దేవుడా.

282
00:15:15,374 --> 00:15:18,168
అంటే, డానీ ఆ గదిలోకి
ఒక గంట క్రితం వెళ్ళాడా?

283
00:15:18,252 --> 00:15:19,795
ఆ పిచ్ మీద ఒక ఆనందంతో ఎగురుతున్న

284
00:15:19,878 --> 00:15:23,298
నల్ల బొచ్చు ఉన్న గోల్డెన్ రిట్రీవర్ లా.

285
00:15:23,382 --> 00:15:26,468
కోచ్, అమెరికాలో అందమైన
కుక్కలు ఎన్ని ఉంటాయంటే

286
00:15:26,552 --> 00:15:28,220
మీరు వాటిని కారణం లేకుండా
చంపేస్తారని విన్నాను, అవునా?

287
00:15:28,303 --> 00:15:29,847
అది నిజమే, సామ్.

288
00:15:29,930 --> 00:15:32,766
కానీ దాన్ని కొంత మంది మహిళా గాయక రచయితలు
మార్చడానికి ప్రయత్నిస్తున్నారు కూడా.

289
00:15:33,308 --> 00:15:36,937
చూడు, మనం డానీ రోహాస్ ని వదిలేయడం లేదు.
నేనది నీకు ఇప్పుడే చెప్తున్నాను.

290
00:15:37,020 --> 00:15:40,065
జెంటిల్మెన్, మీరు మిగతావారిని
ఇక్కడికి పిలవండి.

291
00:15:40,691 --> 00:15:43,861
ఎందుకంటే మనం
ఒక శాపాన్ని వెనక్కి తిప్పాలి.

292
00:15:51,743 --> 00:15:53,120
మీ ఇద్దరికీ అసలు ఏమైంది?

293
00:15:53,203 --> 00:15:55,038
పూర్తి రిచ్మండ్ టీమ్ ఇక్కడే ఉంది.

294
00:15:56,456 --> 00:15:58,041
అబ్బా.

295
00:16:06,091 --> 00:16:07,801
హే, కోచ్. జేమీ?

296
00:16:10,262 --> 00:16:11,263
పరవాలేదు. అది పరవాలేదు.

297
00:16:11,346 --> 00:16:12,764
హే.

298
00:16:12,848 --> 00:16:14,516
హే, అందరూ. అందరూ, వినండి.

299
00:16:15,434 --> 00:16:16,643
వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.

300
00:16:16,727 --> 00:16:19,146
చూడండి, నాకు దీని గురించి
ఎక్కువ విషయాలేమీ తెలియవు.

301
00:16:19,229 --> 00:16:20,731
నాకు శాపాల గురించి తెలియదు.

302
00:16:20,814 --> 00:16:22,858
కానీ నాకు ఒక విషయం తెలుసు,
అవి ఎక్కువ కాలం ఉండవు.

303
00:16:22,941 --> 00:16:25,235
సరే, బోస్టన్ రెడ్ సాక్స్ శాపం చూడండి.
అది అయిపోయింది.

304
00:16:25,777 --> 00:16:27,487
చికాగో కబ్స్. అది అయిపోయింది.

305
00:16:27,863 --> 00:16:31,241
మిస్టర్ మార్టిన్ స్కార్సేస్ కూడా
చివరికి తన ఆస్కర్ గెలుచుకున్నారు.

306
00:16:31,325 --> 00:16:33,535
కానీ మనమందరం ది డిపార్టెడ్
ఆయన పని చేసిన వాటిలో

307
00:16:33,619 --> 00:16:34,995
అత్యుత్తమమైనది కాదని
అంగీకరిస్తామని అనుకుంటాను.

308
00:16:35,078 --> 00:16:36,079
-కాదు.
-అవును.

309
00:16:36,163 --> 00:16:39,291
-అది ది కలర్ ఆఫ్ మనీ కి చెందాలి.
-కాదు, అది గుడ్ ఫెలాస్.

310
00:16:39,374 --> 00:16:43,003
-అంగీకరించను అనడానికి అంగీకరిస్తున్నాను.
-కాదు, కాదు, ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్, బాబు.

311
00:16:43,086 --> 00:16:45,631
-కేప్ ఫియర్.
-సైలెన్స్!

312
00:16:46,465 --> 00:16:49,009
ఓయ్, మీరందరూ ఇక్కడ
ఉన్నారని మాట బయటకు వెళితే,

313
00:16:49,092 --> 00:16:51,386
ఈ చోటు ఒక జూలా మారిపోతుంది.

314
00:16:52,346 --> 00:16:53,639
ఇంకా సమాధానం మీన్ స్ట్రీట్స్.

315
00:16:53,722 --> 00:16:55,641
-అవును. అది బాగుంటుంది.
-అవును.

316
00:16:55,724 --> 00:16:58,310
మీరందరూ ఇక్కడ నా వెనుక
ఉన్న పోస్టర్ కారణంగా ఉన్నారు.

317
00:16:58,393 --> 00:16:59,436
మిస్టర్ హిగ్గిన్స్.

318
00:16:59,520 --> 00:17:02,856
"మీరు ఒక మంచి, అత్యంత
గొప్ప ఫుట్ బాల్ అభిమానా?"

319
00:17:02,940 --> 00:17:04,733
అది చాలా గొప్ప అనుప్రాస.

320
00:17:04,816 --> 00:17:06,234
వందల కొద్దీ ఈ పోస్టర్లు
నవంబర్ 18, 1914న

321
00:17:06,318 --> 00:17:11,448
రిచ్మండ్ వీధుల్లో అంటించారు.

322
00:17:11,531 --> 00:17:13,909
ఒక ప్రోఫెషనల్ ఫుట్ బాలర్ అవడానికి

323
00:17:13,992 --> 00:17:16,662
యువకుల కోసం అది ఒక ఆహ్వానం.

324
00:17:16,744 --> 00:17:19,455
అది ఆ రోజు మన స్టేడియంకి
వచ్చినట్లుగా చెబుతారు.

325
00:17:20,290 --> 00:17:21,375
ఇంకా అది ఒక అబద్ధం.

326
00:17:21,458 --> 00:17:26,797
1914న, యద్ధం జరుగుతోంది.
అప్పుడు ట్రై అవుట్ లు లేవు.

327
00:17:26,880 --> 00:17:32,469
కేవలం రిక్రూటర్లు ఆ అబ్బాయిలు పోరాడడానికి
ప్రోత్సహించడానికి ఎదురు చూస్తున్నారు.

328
00:17:32,553 --> 00:17:35,764
వారు ఆ రోజున 400 మందిని
నమోదు చేసుకున్నారు.

329
00:17:37,099 --> 00:17:38,475
వారిలో చాలా తక్కువ మంది
ఇంటికి తిరిగి వచ్చారు.

330
00:17:39,685 --> 00:17:41,061
వారు నమోదు అయిన తరువాత...

331
00:17:41,854 --> 00:17:43,772
వారి శారీరక పరీక్షకు
వారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా?

332
00:17:43,856 --> 00:17:46,191
దేవుడా, అది మన చికిత్సా గది, కదా?

333
00:17:46,275 --> 00:17:47,609
నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు?

334
00:17:47,693 --> 00:17:51,989
హే, కాదు, కాదు, కాదు. హే, కాదు.
కాదు, అది కాదు, సరేనా?

335
00:17:54,283 --> 00:17:56,702
అది అదే. క్షమించండి, నేను చెప్పేది అబద్ధం.
అబద్ధం ఎందుకు చెబుతున్నానో నాకు తెలియదు.

336
00:17:56,785 --> 00:17:58,912
నన్ను క్షమించండి. మీరందరూ ఒక్క క్షణం
ఊపిరి తీసుకోవాలని అనుకున్నాను.

337
00:17:58,996 --> 00:18:01,707
ఆగండి, ఆగండి, ఆగండి. మీరక్కడ 400 దెయ్యాలు
ఉన్నాయని చెబుతున్నారా?

338
00:18:01,790 --> 00:18:03,041
అవి చాలా ఎక్కువ దెయ్యాలు.

339
00:18:03,125 --> 00:18:04,209
మనం వాటన్నిటితో పోరాడలేము.

340
00:18:04,293 --> 00:18:06,044
మనం వాటితో పోరాడవలసిన అవసరం లేదు, రిచర్డ్.

341
00:18:06,128 --> 00:18:08,213
ఆగండి, అయితే, కోచ్ మనం
దీన్ని ఎలా పరిష్కరిస్తాము?

342
00:18:08,297 --> 00:18:11,049
-మనం గతాన్ని మార్చలేము.
-లేదు, సామ్. మనం మార్చలేము.

343
00:18:11,800 --> 00:18:13,177
కానీ మనం దాన్ని గౌరవించాలని అనుకోవచ్చు.

344
00:18:13,844 --> 00:18:16,346
ఇప్పుడు ఆ యువకులు అంతిమ త్యాగం చేసారు.

345
00:18:16,430 --> 00:18:19,516
అందుకని మనం మా సొంత దానిని ఒకదాన్ని
త్యాగం చేయడం న్యాయమని అనుకుంటాను.

346
00:18:19,600 --> 00:18:22,352
నేను మే అందరినీ ఇవాళ రాత్రికి ఇంటికి
వెళ్లి, ఎదో ఒక దాన్ని, ఒక వస్తువును

347
00:18:22,436 --> 00:18:24,605
తీసుకురమ్మని అంటాను.

348
00:18:24,688 --> 00:18:26,857
ఏదైనా వ్యక్తిగతమైనది.
మీరు నిజంగా విలువ నిచ్చే దానిని.

349
00:18:27,482 --> 00:18:30,110
ఇవాళ రాత్రి మీరు దానిని సరిగ్గా
అర్థ రాత్రికి క్లబ్ హౌస్ కి తీసుకు రండి.

350
00:18:30,194 --> 00:18:31,737
కాదు. ఇదంతా చెత్త.

351
00:18:33,739 --> 00:18:35,616
మనమందరం ఇది చేయబోతున్నాము!

352
00:18:36,158 --> 00:18:37,075
సరే.

353
00:18:38,619 --> 00:18:40,120
అక్కడ ఆ మాట చెప్పింది మీ కాప్టెన్.

354
00:18:40,204 --> 00:18:45,167
రిచ్మండ్! రిచ్మండ్! రిచ్మండ్!

355
00:18:45,709 --> 00:18:46,710
చెప్పానా.

356
00:18:46,793 --> 00:18:51,298
రిచ్మండ్! రిచ్మండ్! రిచ్మండ్!

357
00:18:51,381 --> 00:18:54,259
హాయ్, జేమీ. నీకు ఏం కావాలి?

358
00:18:55,427 --> 00:18:58,555
ప్రియా, నేనిది ముఖ్యమని చెప్పాను.
మనం మీ ఇంట్లోకి వెళ్ళలేమా?

359
00:18:58,639 --> 00:19:00,432
లేదు! మనం వెళ్ళలేము.

360
00:19:00,516 --> 00:19:02,643
నువ్వు, నేను బాగా చేయగలిగింది
కేవలం సెక్స్ ఒక్కటే.

361
00:19:02,726 --> 00:19:05,187
నేను మూడు గ్లాసులు వైన్ తాగాను.
అది పావ్లోవియన్.

362
00:19:05,896 --> 00:19:08,273
పావ్లోవియన్? అదేంటి? అది వైనా?

363
00:19:09,608 --> 00:19:12,027
ప్రియా, మనం కనీసం నా కార్లోకి వెళదామా?
బయట చల్లగా ఉంది.

364
00:19:12,110 --> 00:19:14,863
లేదు. మనం ఈ కార్లో ఎన్ని సార్లు సెక్స్
చేసామో నీకు గుర్తు లేదా?

365
00:19:14,947 --> 00:19:17,032
అయితే కార్ కూడా పావ్లోవియనా?

366
00:19:17,115 --> 00:19:18,116
నాకది ఇప్పుడు అర్థం అవుతోందని అనుకుంటాను.

367
00:19:20,035 --> 00:19:21,453
అయితే, విషయం ఏంటి, జేమీ?

368
00:19:21,828 --> 00:19:24,164
ఆ పిచ్చి టెడ్ లాసో.

369
00:19:24,248 --> 00:19:26,208
అతను నిన్ను నిజంగా చాలా
ఇబ్బంది పెడుతున్నాడు కదా?

370
00:19:26,291 --> 00:19:28,168
ప్రియా, అతను నిజమైన కోచ్ కూడా కాదు.

371
00:19:28,252 --> 00:19:29,920
మేము ఇవాళ రాత్రికి ఏం చేయాలో తెలుసా?

372
00:19:30,003 --> 00:19:33,799
అది ఒక చెత్త బలి,
చూపించి-చెప్పే బలి.

373
00:19:34,341 --> 00:19:37,052
-సరే. నువ్వు వెళతావా?
-లేదు, నేను వెళ్ళను.

374
00:19:38,762 --> 00:19:41,849
-మిగతా అందరూ చేస్తున్నారా?
-ఆ, కానీ నేను జేమీ టార్ట్.

375
00:19:41,932 --> 00:19:43,433
నేను అందరిలాంటి వాడిని కాదు.

376
00:19:43,517 --> 00:19:48,146
అందరూ చేసినట్లు నేను చేస్తే, నార్త్
మాంచెస్టర్ లోని కౌన్సిల్ ఎస్టేట్ నుండి

377
00:19:48,230 --> 00:19:49,898
ప్రీమియర్ లీగ్ వరకు

378
00:19:50,649 --> 00:19:52,109
నేను రాగలిగేవాడినని నువ్వు అనుకుంటున్నావా?

379
00:19:52,192 --> 00:19:54,194
లేదు. నేను అనుకోలేదు.

380
00:19:55,863 --> 00:19:57,197
నువ్వొక యోధుడివి, జేమీ.

381
00:19:58,073 --> 00:19:59,449
అది చాలా బాగుంది.

382
00:20:00,909 --> 00:20:03,287
కానీ ఏదో ఒక రోజున నువ్వు నీకు
సహాయం చేయాలనుకునేవారితో

383
00:20:03,370 --> 00:20:04,830
పోరాడడం ఆపితే బాగుంటుంది.

384
00:20:08,625 --> 00:20:10,794
నీకు నేను లోపలికి రావాలని
అనిపిస్తున్నట్లు అనిపిస్తోంది.

385
00:20:10,878 --> 00:20:12,254
అది పావ్లోవియన్.

386
00:20:12,337 --> 00:20:14,423
నీకు గుడ్ నైట్, జేమీ.

387
00:20:15,924 --> 00:20:19,595
రెబెక్కా! -ఓల్డ్ రెబెక్కా

388
00:20:21,722 --> 00:20:22,764
లోపలికి రా.

389
00:20:23,473 --> 00:20:27,769
ఎక్స్క్యూజ్ మి, మిస్ వెల్టన్. హాయ్, నేను
సామ్. సామ్ ఒబిసాన్య. నేను టీమ్ లో ఆడతాను.

390
00:20:27,853 --> 00:20:30,355
చెప్పు, సామ్. నువ్వెవరో నాకు తెలుసు.

391
00:20:31,148 --> 00:20:33,525
నేను సహాయం చేయగలది ఏదైనా ఉందా?

392
00:20:33,609 --> 00:20:36,904
ఇది చాలా ఇబ్బందిగా ఉంది, కానీ మీరు
ఇవాళ రాత్రికి ఖాళీగా ఉన్నారా?

393
00:20:38,030 --> 00:20:40,490
సామ్, నాకు ఇందుకు చాలా
ఆనందంగా ఉంది, కానీ...

394
00:20:40,574 --> 00:20:43,327
కాదు, కాదు, కాదు. అది రోమాన్స్ కోసం కాదు.

395
00:20:43,410 --> 00:20:47,206
అది ఈ శాపాన్ని వదిలించుకోవడం కోసం. మీరది
తప్పుగా అనుకోవడం నేనర్థం చేసుకోగలను.

396
00:20:47,289 --> 00:20:48,498
అంటే, మీరు చాలా అందంగా ఉన్నారు,

397
00:20:48,582 --> 00:20:50,834
మీరు ఎప్పుడూ రొమాంటిక్ ఆహ్వానాలు
పొందుతూ ఉంటారేమో.

398
00:20:50,918 --> 00:20:51,919
అది బాగుంది.

399
00:20:52,002 --> 00:20:56,423
దేవుడా, నేను న సొంత శాపాన్ని
ఎదుర్కొంటున్నాను. సరేలే, ధన్యవాదాలు.

400
00:20:57,257 --> 00:21:00,761
నేను నైజీరియా నుంచి వచ్చాను,
అందుకని ఈ విషయం వచినప్పుడల్లా,

401
00:21:00,844 --> 00:21:04,348
అందరూ, "ఈ ఆఫ్రికన్ కి దీని గురించి
బాగా తెలుసు అని అనుకుంటారు.

402
00:21:04,431 --> 00:21:06,683
-నీకు తెలియదా?
-లేదు, లేదు, లేదు. నాకు నిజంగా తెలియదు.

403
00:21:06,767 --> 00:21:09,019
కానీ అది ముఖ్యంగా హ్యారీ పాటర్ నచ్చడం వలన.

404
00:21:09,561 --> 00:21:11,730
మీకు తెలుసా, జే.కే. రౌలింగ్ కి రాణి
కన్నా ఎక్కువ డబ్బు ఉందని?

405
00:21:11,813 --> 00:21:12,981
నాకు తెలుసు.

406
00:21:13,065 --> 00:21:16,235
వారు ప్రపంచానికి ఇచ్చిన దానివలన
ఆస్తి పొందడం అన్న ఆలోచన నాకు నచ్చుతుంది.

407
00:21:16,318 --> 00:21:17,903
కేవలం వారు వచ్చిన కుటుంబం వలన కాకుండా.

408
00:21:19,154 --> 00:21:21,990
మిస్ వెల్టన్ ఇవాళ రాత్రికి మేము
చేసే ఒక వేడుకలో పాల్గొనడానికి

409
00:21:22,074 --> 00:21:23,492
మీరు రాగలరని నేను ఆశిస్తున్నాను.

410
00:21:23,575 --> 00:21:24,868
నేను రాలేననుకుంటాను.

411
00:21:24,952 --> 00:21:27,412
నన్ను క్షమించండి, కానీ నేను కాదు
అనే సమాధానాన్ని ఒప్పుకోలేను.

412
00:21:27,996 --> 00:21:30,624
టీమ్ అంతా అక్కడ ఉంటేనే అది
పని చేస్తుందని కోచ్ అనుకుంటున్నారు,

413
00:21:30,707 --> 00:21:33,710
ఇంకా మిస్ వెల్టన్, ఇది మీ టీమ్.

414
00:21:35,420 --> 00:21:38,173
అందుకని మీరక్కడ ఉండాలి. ప్లీజ్.

415
00:21:40,467 --> 00:21:41,468
కనీసం దాని గురించి ఆలోచించండి.

416
00:21:42,803 --> 00:21:43,971
నీ కోసం సామ్, నేను ఆలోచిస్తాను.

417
00:21:44,555 --> 00:21:45,597
ధన్యవాదాలు.

418
00:21:49,643 --> 00:21:50,811
మిమ్మల్ని రాత్రికి కలుస్తాను.

419
00:21:50,894 --> 00:21:51,895
కలుస్తాను.

420
00:21:56,608 --> 00:21:58,735
జెంటిల్మెన్, స్వభావపరంగా
నేను ఒక నమ్మే వ్యక్తిని.

421
00:21:58,819 --> 00:22:01,321
దెయ్యాలు, ఆత్మ మార్గదర్శకులు,
గ్రహాంతరవాసులు.

422
00:22:01,405 --> 00:22:02,781
అయినప్పటికీ, మన భౌతిక ప్రపంచానికి మించి

423
00:22:02,865 --> 00:22:05,284
ఏమి ఉంటుందో, ఏమి ఉండదో
నేను నిజంగా మీకు చెప్పలేను.

424
00:22:06,702 --> 00:22:08,078
నేను మీకు చెప్పగలిగింది ఏమిటంటే,

425
00:22:08,161 --> 00:22:09,913
కాల్విన్ అండ్ హాబ్స్ యొక్క తెలివి,

426
00:22:09,997 --> 00:22:12,082
హాస్య చతురత యొక్క మినహాయింపుతో,

427
00:22:13,333 --> 00:22:14,751
ఏదీ ఎక్కువ కాలం ఉండదు.

428
00:22:20,382 --> 00:22:22,885
-హే, బాస్. మీరు వచ్చినందుకు సంతోషంగా ఉంది.
-హలో. ఆ.

429
00:22:27,097 --> 00:22:28,932
రాయ్, నువ్వు దీన్ని మాకోసం మొదలు పెడతావా?

430
00:22:35,063 --> 00:22:38,025
నన్ను సందర్లాండ్ వారు
తీసుకున్నప్పుడు నాకు తొమ్మిదేళ్ళు,

431
00:22:38,734 --> 00:22:41,361
నేను అంతవరకూ ఎప్పుడూ
లండన్ వదిలి వెళ్ళలేదు.

432
00:22:42,154 --> 00:22:47,951
మా తాతయ్య డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళారు,
చాలా చల్లగా ఉంది, నాకు భయం వేసింది.

433
00:22:49,703 --> 00:22:51,705
నాకు తొమ్మిదేళ్ళు. ఏమైనా అనండి.

434
00:22:53,707 --> 00:22:57,044
అక్కడికి వెళ్ళినప్పుడు, ఆయన నాకు
ఈ పాత దుప్పటి ఇచ్చారు.

435
00:22:57,628 --> 00:23:01,632
ఇఇద్ నన్ను వెచ్చగా ఉంచడానికి, నాకు ఇంటిని
గుర్తు చేయడానికి అని చెప్పారు.

436
00:23:02,090 --> 00:23:03,717
నేను ఆయనని చూడడం అదే ఆఖరి సారి.

437
00:23:03,800 --> 00:23:07,804
నేను క్రిస్మస్ కి ఇంటికి వెళ్ళే సమయానికి
ఆయన పోయారు, అందుకని...

438
00:23:09,348 --> 00:23:13,310
అందుకనే ఈ దుప్పీ విలువ నాకు చాలా ఎక్కువ.

439
00:23:13,393 --> 00:23:14,686
నువ్వు ఇప్పుడే దుప్పీ అన్నావా?

440
00:23:14,770 --> 00:23:17,523
లేదు, నేను "దుప్పటి" అన్నాను.
సంభాషణ అయిపొయింది. సామ్, నీ వంతు.

441
00:23:19,066 --> 00:23:22,110
ఇది 1994 నైజీరియన్ ప్రపంచ కప్ టీమ్ ఫోటో.

442
00:23:23,237 --> 00:23:26,240
నేను టీమ్ లో స్థానం పొందేవరకు దీన్ని
తీసేయనని నాకు నేను మాట ఇచ్చుకున్నాను,

443
00:23:27,282 --> 00:23:28,700
నేను ఇంకా అది చేయాలని అనుకుంటున్నాను.

444
00:23:31,745 --> 00:23:34,998
ఇది సెయింట్ బార్ట్స్ బీచ్ లోని ఇసక.

445
00:23:37,292 --> 00:23:39,711
ఇది మొదటి బీచ్...

446
00:23:41,255 --> 00:23:43,924
నేను ఒక సూపర్ మోడల్ తో మొదటి సారి
సెక్స్ చేసిన మొదటి బీచ్.

447
00:23:49,388 --> 00:23:51,640
-నవ్వు ఎందుకంటే అది జరిగింది.
-ధన్యవాదాలు.

448
00:23:51,723 --> 00:23:54,309
సామ్, రిచర్డ్ స్పెక్ట్రం యొక్క
రెండు చివర్ల నుండి వస్తున్నారు.

449
00:23:54,393 --> 00:23:55,394
అది మెచ్చుకుంటాను.

450
00:23:55,769 --> 00:24:00,941
ఈ కళ్ళద్దాలలొనేను క్లైవ్ ఓవెన్ లా
ఉంటానని ఒకమ్మాయి ఒకసారి చెప్పింది.

451
00:24:02,901 --> 00:24:04,236
నేనిది చేయగలనని నేను అనుకోను.

452
00:24:04,319 --> 00:24:06,697
-అబ్బా, నేట్. వాటిని విసురు.
-నువ్వు చేయగలవు, నేట్. దాన్ని విసురు.

453
00:24:06,780 --> 00:24:08,282
-బాగుంది.
-బాగా చేసావు, నేట్.

454
00:24:08,949 --> 00:24:09,992
ధన్యవాదాలు. ధన్యవాదాలు.

455
00:24:15,038 --> 00:24:16,915
అది ఇవాల్టి పేపరా?

456
00:24:16,999 --> 00:24:20,669
అందులో నా గురించి ఏదో ఉంది, ఎప్పటిలా
నేనది పట్టించుకోకూడదని ప్రయత్నిస్తున్నాను.

457
00:24:22,671 --> 00:24:23,881
ద్వేషించేవారిని పట్టించుకోవద్దు.

458
00:24:26,466 --> 00:24:27,467
పదం.

459
00:24:27,551 --> 00:24:31,972
ఇది నా పిల్లి కాలర్. అది 20 సంవత్సరాలుగా
నాకు నమ్మకమైన తోడుగా ఉంది.

460
00:24:33,932 --> 00:24:35,767
నిన్ను మిస్ అవుతాను, సిండీ క్రాఫోర్డ్.

461
00:24:37,311 --> 00:24:39,229
నేను నా పేరు కేవలం
ఈ ఒక్క పెన్ తో మాత్రమే రాయగలను.

462
00:24:59,458 --> 00:25:01,043
నా లామ్బోర్జిని తాళం చెవులు.

463
00:25:03,045 --> 00:25:04,129
నువ్వు ఇంటికి ఎలా వెళుతున్నావు.

464
00:25:05,339 --> 00:25:07,591
-సరే. అందరూ సిద్ధమా?

465
00:25:07,674 --> 00:25:10,344
-ఆ.
-కాదు. నాకు వెళ్ళాలని ఉంది.

466
00:25:19,895 --> 00:25:23,148
ఇవి నా మొదటి బూట్లు కాదు.
వీటిని నాకు మా అమ్మ ఇచ్చింది.

467
00:25:24,900 --> 00:25:27,402
నేను ఫుట్ బాల్ ఆడేలా చేసింది ఆమే.

468
00:25:28,529 --> 00:25:32,324
ఆమె, మా నాన్న నా చిన్నప్పుడే విడిపోయారు.

469
00:25:33,033 --> 00:25:36,328
నేను ఇంత కష్టపడడానికి కారణం ఆమె.
ఆమె గర్వపడేలా ఉండాలనుకున్నాను.

470
00:25:37,496 --> 00:25:39,414
నేను బాగా ఆడినా ఆమెకి అనవసరం.

471
00:25:39,498 --> 00:25:42,084
ఆమెకి నేను సంతోషంగా ఉంటే చాలు.
ఒక మంచి అబ్బాయిగా.

472
00:25:43,544 --> 00:25:47,506
నేను బాగా ఆడడం మొదలు పెట్టిన తరువాత
మా నాన్న రావడం మొదలు పెట్టాడు.

473
00:25:47,589 --> 00:25:50,259
నేను గోల్ కొట్టిన ప్రతిసారీ
తన మిత్రులకు గొప్పలు చెప్పుకునే వాడు.

474
00:25:50,342 --> 00:25:56,139
నేను ఆధిక్యం చూపని ప్రతిసారీ...
నన్ను "మెతక" అనేవాడు.

475
00:25:56,223 --> 00:25:57,766
నాకది నచ్చలేదు.

476
00:25:59,268 --> 00:26:01,270
నాకది అస్సలు నచ్చలేదు.

477
00:26:03,522 --> 00:26:09,361
నేను ఎంత కటువుగా ఉంటానంటే, నన్ను"మెతక"
అని పిలవకూడదు అని నిర్ణయించుకున్నాను.

478
00:26:12,531 --> 00:26:14,575
కొన్నిసార్లు నేననుకుంటాను...

479
00:26:15,450 --> 00:26:17,202
నేను ఆమె గర్వపడేలా చేయాలన్న
విషయం మర్చిపోయాను.

480
00:26:20,163 --> 00:26:21,957
ఆమెకి ఈ మధ్యలో నా పట్ల గర్వంగా
ఉంటుందని నేను అనుకోను.

481
00:26:34,928 --> 00:26:36,180
సరే, జెంటిల్మెన్...

482
00:26:39,099 --> 00:26:40,934
మనం ఈ చెత్తని కాల్చేద్దామని

483
00:26:41,018 --> 00:26:42,936
మనమిది బయట చేస్తే బాగుంటుందేమో?

484
00:26:43,020 --> 00:26:44,188
-అవును.
-అది మంచి ఆలోచన.

485
00:26:44,271 --> 00:26:45,272
ఆ. అది తెలివైన పని. సరే.

486
00:26:45,355 --> 00:26:47,232
హే, మీరిది నాకోసం తీసుకువస్తారా?

487
00:26:54,698 --> 00:26:57,326
ఎక్స్క్యూజ్ మి, టెడ్. ఈగిల్ దిగింది.

488
00:26:59,369 --> 00:27:00,537
హే, అందరూ.

489
00:27:00,621 --> 00:27:04,082
ఈ శాపం తొలగిపోయిందో లేదో తెలియాలంటే,

490
00:27:04,166 --> 00:27:06,710
మనం ఆత్మలను ఒక సంకేతం కోసం అడగాలి.

491
00:27:08,504 --> 00:27:09,713
ఆత్మలారా...

492
00:27:11,256 --> 00:27:12,925
మాతో మాట్లాడండి.

493
00:27:16,261 --> 00:27:20,182
డానీ రోహాస్! డానీ రోహాస్! డానీ రోహాస్!

494
00:27:23,894 --> 00:27:26,563
నేను శాపపు అగ్నిలోకి వేయడానికి
ఒక సీసా మెజ్కాల్ తెచ్చాను.

495
00:27:26,647 --> 00:27:28,565
హే, హి, హే. రోహాస్, చూడు.

496
00:27:28,649 --> 00:27:30,984
నిన్ను పడిపోయేలా చేసిన ఏ దెయ్యాలైనా,

497
00:27:31,068 --> 00:27:32,903
అవి ఇప్పుడు వెళిపోయాయి,
నేను మాట ఇస్తున్నాను, అవును.

498
00:27:32,986 --> 00:27:34,321
ఆ సీసాని తెరువు.

499
00:27:34,404 --> 00:27:36,448
-ఆ, అవును!
-అవును.

500
00:27:36,532 --> 00:27:40,369
జేమీ తప్పుగా చెప్పడం లేదు. దెయ్యాలకు మనం
తాగి ఖాళీ చేసిన సీసాలు నచ్చుతాయి.

501
00:27:40,452 --> 00:27:41,787
నిజం.

502
00:27:41,870 --> 00:27:44,039
మనం వేడుక చేసుకుందాం, మిత్రులారా.

503
00:27:46,667 --> 00:27:48,502
ఇది ఒక కలిసి ఉన్న టీమ్.

504
00:27:49,878 --> 00:27:52,506
డానీ గాయం వలన అంతా బాగున్నందుకు
నువ్వు చాలా అదృష్టవంతుడివి.

505
00:27:52,589 --> 00:27:55,050
నేను నిన్ను ఓకే జూదగాడిగా అనుకోలేదు, టెడ్.

506
00:27:55,133 --> 00:27:58,679
నేను కాను. డానీ బాగానే ఉన్నాడని
మాకు కొన్ని గంటల క్రితమే తెలుసు.

507
00:27:59,304 --> 00:28:01,306
నిజానికి వేడుక పూర్తయ్యే వరకు

508
00:28:01,390 --> 00:28:04,434
ఆ విషయాన్ని అబ్బాయిలతో పంచుకోకూడదన్నది
నా మిత్రుడు హిగ్గిన్స్ ఆలోచన.

509
00:28:05,686 --> 00:28:07,563
-ఇంకా నయం.
-అవును.

510
00:28:08,063 --> 00:28:09,648
టీమ్ అన్నిటికన్నా ముందు
ఉంచుతున్నావా, హిగ్గిన్స్?

511
00:28:10,524 --> 00:28:11,567
అవును, ఉంచుతున్నాననుకుంటున్నాను.

512
00:28:11,650 --> 00:28:13,694
హే, కోచ్, మీరు పార్టీలో చేరడం లేదా?

513
00:28:14,987 --> 00:28:17,698
ఏమంటారు బాస్?
అక్కడ మంట దగ్గర వెచ్చగా ఉంటుంది.

514
00:28:19,533 --> 00:28:20,868
నేను గౌరవంగా కాదంటాను.

515
00:28:22,452 --> 00:28:24,454
హిగ్గిన్స్, నాతో వస్తున్నారా?

516
00:28:26,415 --> 00:28:27,666
మీరు వెళ్ళండి.

517
00:28:31,128 --> 00:28:33,046
సరే, ఇప్పుడు, ఇక్కడ ఏమవుతోంది?

518
00:28:33,130 --> 00:28:35,007
ఇక్కడ ఏమవుతోంది? ఏమవుతోంది?

519
00:28:35,090 --> 00:28:36,884
మనం చనిపోయేవరకు రిచ్మండ్.

520
00:28:36,967 --> 00:28:38,760
మేము చనిపోయేవరకు మేము రిచ్మండ్.

521
00:28:38,844 --> 00:28:42,306
మనకు తెలుసు మనమని, మనకు తెలుసు మనమని.

522
00:28:42,389 --> 00:28:45,559
మనం చనిపోయేవరకు రిచ్మండ్.
మనం చనిపోయేవరకు రిచ్మండ్.

523
00:28:45,642 --> 00:28:48,812
మనకు తెలుసు మనమని, మనకు తెలుసు మనమని.

524
00:28:48,896 --> 00:28:52,065
మనం చనిపోయేవరకు రిచ్మండ్.
మనం చనిపోయేవరకు రిచ్మండ్.

525
00:28:52,149 --> 00:28:55,527
మనకు తెలుసు మనమని, మనకు తెలుసు మనమని.

526
00:28:55,611 --> 00:28:58,655
మనం చనిపోయేవరకు రిచ్మండ్.
మనం చనిపోయేవరకు రిచ్మండ్.

527
00:28:58,739 --> 00:29:01,992
మనకు తెలుసు మనమని, మనకు తెలుసు మనమని.

528
00:29:02,075 --> 00:29:05,662
మనం చనిపోయేవరకు రిచ్మండ్.
మనం చనిపోయేవరకు రిచ్మండ్.

529
00:29:05,746 --> 00:29:08,665
మనకు తెలుసు మనమని, మనకు తెలుసు మనమని.
మనం చనిపోయేవరకు రిచ్మండ్.

530
00:29:09,708 --> 00:29:10,834
గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు?

531
00:29:16,089 --> 00:29:17,341
హే, అది బాగుంది.

532
00:29:19,927 --> 00:29:21,261
అబ్బా. ఇదుగో.

533
00:29:24,139 --> 00:29:25,599
నేను పట్టుకున్నాను.

534
00:29:26,767 --> 00:29:29,269
మధ్యలోకి వస్తున్నాను.
మెల్లగా, జెంటిల్మెన్, మెల్లగా.

535
00:29:30,687 --> 00:29:32,272
గుడ్ మార్నింగ్, ప్రియా.

536
00:29:32,356 --> 00:29:34,942
నువ్వు అక్కడ గోల విన్నావా? నాకది నచ్చింది.

537
00:29:35,025 --> 00:29:36,109
ఎలా ఉన్నావు?

538
00:29:38,654 --> 00:29:39,988
మీరు జేమీని పంపించేసారా?

539
00:29:40,614 --> 00:29:42,449
మాన్ సిటీ అతన్ని వెనక్కి పిలిచింది.

540
00:29:42,533 --> 00:29:44,493
నేను చెప్పాను కదా, టెడ్.
వారు అతను ఆడడం లేదని ఆందోళన చెందారు.

541
00:29:44,576 --> 00:29:46,161
చివరికి అతను అర్థం చేసుకున్నాడు!

542
00:29:46,245 --> 00:29:48,247
అంటే, మీరది చూసారు.

543
00:29:48,330 --> 00:29:51,875
అతను, డానీ, మన దగ్గర
ఇద్దరు ఆసులు ఉన్నారు, రెబెక్కా.

544
00:29:51,959 --> 00:29:54,795
-నువ్వు కావాలనుకున్నది అదే అనుకున్నాను.
-ఆ, మీరు తప్పుగా అనుకున్నారు!

545
00:29:55,587 --> 00:29:57,881
నన్ను క్షమించండి. నేను మాట్లాడిన
విధానానికి క్షమించండి. అది దురుసుగా ఉంది.

546
00:29:57,965 --> 00:30:02,636
చూడండి, నేనీవిషయంలో ప్రశాంతంగా
ఉండాలనుకున్నాను, కానీ నాకు కోపం వస్తోంది.

547
00:30:02,719 --> 00:30:05,597
బహుశా మీరు అనకూడదని మాట అనేలోపు
ఇక్కడి నుంచి వెళితే బాగుంటుందేమో.

548
00:30:07,349 --> 00:30:09,601
లేదు, నిజానికి, ఏంటో తెలుసా? ఇదుగోండి.

549
00:30:10,185 --> 00:30:11,186
మీ బిస్కట్లు.

550
00:30:11,270 --> 00:30:13,146
అవి ఎప్పుడూ ఉండేంత
బాగా ఉండకూడదని ఆశిస్తాను.

551
00:30:13,230 --> 00:30:16,900
అవి ఇప్పటి వరకు చేసిన అత్యుత్తమ బ్యాచ్.
నేను చివరికి రెసిపీ మీద పట్టు సాధించాను.

552
00:30:24,950 --> 00:30:26,034
కోచ్?

553
00:30:30,289 --> 00:30:31,790
ఫుట్ బాలే జీవితం.

554
00:30:45,512 --> 00:30:50,601
టార్ట్

555
00:31:33,894 --> 00:31:35,896
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి

