1
00:00:05,506 --> 00:00:09,426
కాదు. కాదు, కాదు, కాదు.

2
00:00:09,801 --> 00:00:12,971
కాదు, ట్రెవర్, కాదు.
ఆ బ్యాగు లోపలి దాకా వెళ్ళాలి, సరేనా?

3
00:00:13,055 --> 00:00:15,140
ఈ చోటంతా వాడుకోవాలి. పక్కకి జరుగు.
ధన్యవాదాలు.

4
00:00:17,142 --> 00:00:19,061
ఇక్కడ వెనకాల ఏమైంది? అవును.

5
00:00:19,686 --> 00:00:24,483
వీటిని పక్కకి జరపాలి ఎందుకంటే
ఇదంతా కిందకి పడుతుంది.

6
00:00:24,566 --> 00:00:26,485
ఇప్పుడు, మనం మార్చవచ్చా... హలో?

7
00:00:26,568 --> 00:00:29,446
ఇక్కడ ఒకరున్నారు. దేవుడా.

8
00:00:29,530 --> 00:00:31,907
హే, నేను దాదాపు మర్చిపోయాను. మనం రేపు
ఎవర్టన్ తో ఎలా ఆడతామో నీకు తెలుసా?

9
00:00:31,990 --> 00:00:33,242
-అవును.
-అది, అది ఒక ఊరు కాదు.

10
00:00:33,325 --> 00:00:37,412
-నిజానికి అది లివర్పూల్ లో ఒక టీమ్.
-బీటిల్స్ లా!

11
00:00:37,496 --> 00:00:41,708
మీరు జాన్, పాల్, జార్జ్ లేదా రింగోని
చూస్తే, నాకోసం ఫోటో తీసుకుంటారా, ప్లీజ్?

12
00:00:41,792 --> 00:00:42,835
హే, అలాగే, బాబు.

13
00:00:43,627 --> 00:00:45,587
సరే, హే, నేను వెళ్ళాలి, సరేనా?

14
00:00:45,671 --> 00:00:48,131
సరే. అమ్మ మీతో మాట్లాడతానని
అంటోంది. ఆగండి.

15
00:00:48,215 --> 00:00:49,716
-ఐ లవ్ యు, బాబు.
-లవ్ యు, నాన్న.

16
00:00:49,800 --> 00:00:51,426
జాన్, జార్జ్ చనిపోయారని
అతనికింకా చెప్పలేదా?

17
00:00:51,510 --> 00:00:52,594
వారు ఏంటి?

18
00:00:52,678 --> 00:00:54,221
అది కీథ్ రిచర్డ్స్.

19
00:00:54,930 --> 00:00:55,931
హే, టెడ్.

20
00:00:56,014 --> 00:00:57,140
-హే. ఎలా ఉన్నావు?
-బాగున్నాను.

21
00:00:57,224 --> 00:00:58,809
నీ పని ఎలా ఉంది? అంతా బాగానే ఉందా?

22
00:00:58,892 --> 00:01:02,938
ఆ. నన్ను క్షమించు. ఇది అంత తేలిక కాదు,
కానీ లాయర్లు పంపిన ఆ పేపర్లు?

23
00:01:03,021 --> 00:01:04,647
నాకు తెలుసు. ఓహ్, హే.

24
00:01:05,524 --> 00:01:06,525
అవి ఇక్కడే ఉన్నాయి.

25
00:01:06,608 --> 00:01:10,112
నేను వాటిని చూసి, సంతకం చేసి, వెంటనే
వెనక్కి పంపుతాను. నేను మాట ఇస్తున్నాను.

26
00:01:10,195 --> 00:01:12,948
సరే, ధన్యవాదాలు. హే, రేపటికి గుడ్ లక్.
మేము చూస్తూ ఉంటాము.

27
00:01:13,031 --> 00:01:14,032
సరే.

28
00:01:19,705 --> 00:01:21,456
బ్లూమింగ్ బ్రిలియంట్ ఫ్లవర్స్
హ్యాపీ యానివర్సరీ రెబెక్కా!

29
00:01:21,540 --> 00:01:22,708
కింద క్లిక్ చేసి,
పూల మీద 20% తగ్గింపు పొందండి

30
00:01:26,044 --> 00:01:29,381
-అమ్మాయిల ట్రిప్!
-లివర్పూల్, మేం వస్తున్నాం.

31
00:01:29,464 --> 00:01:30,507
ఈ వారంతం నువ్వు నన్ను రమ్మని అడిగినందుకు

32
00:01:30,591 --> 00:01:32,718
నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది.

33
00:01:32,801 --> 00:01:34,553
అబ్బా, ఊరుకో.

34
00:01:34,636 --> 00:01:38,015
కానీ, హే, మనమిద్దరం ఒంటరివాళ్ళం.
నేను నువ్వు చాలా అందంగా ఉంటావనుకుంటాను.

35
00:01:38,098 --> 00:01:39,892
నేను అమ్మాయిల ప్రపంచంలో
అడుగు పెట్టాలనుకుంటే,

36
00:01:39,975 --> 00:01:42,728
అది నీతో చేయడం కన్నా
మంచి ఎంపిక ఉండబోదని అనుకుంటాను.

37
00:01:42,811 --> 00:01:44,646
లేదు, కీలీ,
నువ్వు తప్పుగా అనుకుంటున్నావనుకుంటాను.

38
00:01:44,730 --> 00:01:47,149
ముందు, నేను అలాగే అనుకున్నాను.
తరువాత, "అబ్బా, కీలీ.

39
00:01:47,232 --> 00:01:50,444
నీ కొత్త స్నేహితురాలితో సరదాగా సమయం గడిపి,
మంచి సెక్స్ చెయ్యి" అని అనుకున్నాను.

40
00:01:52,446 --> 00:01:53,655
నేను నీతో ఊరికే అంటున్నాను.

41
00:01:54,281 --> 00:01:55,282
అబ్బా.

42
00:01:55,908 --> 00:01:58,535
నేను నువ్వు నిజంగా అంటున్నావనుకున్నాను.
అంటే, నువ్వు ఊహించుకోగాలవా?

43
00:01:58,619 --> 00:01:59,745
ఓహ్, నేను ఊహించుకున్నాను.

44
00:02:02,873 --> 00:02:05,667
చూడబోతే మనతో ఫ్లైట్లో ఇవాళ
కొత్త ప్రయాణీకులు వస్తున్నట్టున్నారు.

45
00:02:05,751 --> 00:02:07,961
నిజానికి, జెట్ లో
నీ స్థానంలో కీలీ వస్తోంది, హిగ్గిన్స్.

46
00:02:09,545 --> 00:02:10,797
క్షమించండి.

47
00:02:10,881 --> 00:02:12,841
నేను మనం బయలుదేరడానికి ముందు కిందకి
వెళ్లి కాస్త డబ్బు ఖర్చు పెట్టి వస్తాను.

48
00:02:12,925 --> 00:02:14,176
నిన్ను కింద కలుస్తాను, రెబెక్కా.

49
00:02:14,259 --> 00:02:17,179
అది పరవాలేదు. నాకు బస్సులో
వారి గోల ఎప్పుడూ నచ్చుతుంది.

50
00:02:17,262 --> 00:02:19,348
లేదు. నువ్వు ఈ వారాంతం ఇక్కడే ఉండాలి.

51
00:02:19,973 --> 00:02:21,558
అవసరం లేని పని చేస్తూ.

52
00:02:27,523 --> 00:02:30,984
సరే, జెంటిల్మెన్. మన సామర్ధ్యాన్ని ఎవర్టన్
కి చూపించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు?

53
00:02:33,946 --> 00:02:35,072
ధన్యవాదాలు, డానీ.

54
00:02:35,531 --> 00:02:39,743
దేవుడా, లూయీస్.
అందరూ ఇంత నిరాశగా ఎందుకున్నారు?

55
00:02:39,826 --> 00:02:42,162
ఏమైంది?
బియాన్సే జే జీని వదిలేసిందా, ఏమిటి?

56
00:02:42,246 --> 00:02:43,288
లేదు, అలాంటిదేమీ లేదు.

57
00:02:43,372 --> 00:02:47,334
హమ్మయ్య. అది పైకి అన్న వెంటనే
నాకు బాధగా అనిపించింది.

58
00:02:47,417 --> 00:02:48,710
ఇక్కడ ఏమవుతోందో చూడనివ్వండి.

59
00:02:48,794 --> 00:02:52,256
హే. నిజంగా. నాతో మాట్లాడండి. ఏమైంది?

60
00:02:52,923 --> 00:02:54,341
మేము బాగానే ఉన్నాము.

61
00:02:55,509 --> 00:02:57,886
-అవును, నేను బాగానే ఉన్నాను.
-సరే.

62
00:02:57,970 --> 00:03:00,931
మేము ఈ చెత్త మూడ్ లో ఎందుకున్నామంటే
మేము ఎప్పుడూ ఎవర్టన్ మీద గెలవలేదు,

63
00:03:01,014 --> 00:03:02,850
ఇంకా అది చెత్తలా బాలేదు!

64
00:03:02,933 --> 00:03:04,768
అబ్బా, ఊరుకోండి.

65
00:03:04,852 --> 00:03:06,895
మీరు ఎవర్టన్ మీద గెలిచి ఎంత కాలం అయింది?

66
00:03:07,354 --> 00:03:09,356
-అరవై ఏళ్ల క్రితం.
-దేవుడా.

67
00:03:10,023 --> 00:03:12,693
వావ్. అది నిజంగా చాలా కాలం. సరే.

68
00:03:12,776 --> 00:03:14,361
అయితే, మనకు అదొకటి ఉంది.

69
00:03:14,444 --> 00:03:17,322
ఇంకా ఓ'బ్రయన్ పిరుదులు పట్టేసినందుకు
మనం చాలా నిరాశగా ఉన్నాము.

70
00:03:17,406 --> 00:03:18,949
అది నా పై భాగపు హ్యామ్ స్ట్రింగ్ కోచ్.

71
00:03:19,032 --> 00:03:22,494
నీ పిరుదులు పట్టేసాయి, బాబు. అందులో
సిగ్గుపడేదేమీ లేదు, సరేనా? అలా జరుగుతుంది.

72
00:03:22,578 --> 00:03:25,455
అథ్లెటిక్స్ లో అందరికీ ఎప్పుడూ పిరుదులు
పట్టేస్తూ ఉంటాయి. నీ ఒక్కడికే కాదు, బాబు.

73
00:03:26,498 --> 00:03:28,375
హే, కోచ్, నీకు కూడా కొన్నిసార్లు
పిరుదులు పట్టేసాయి కదా?

74
00:03:28,458 --> 00:03:29,793
-మూడు సార్లు.
-మూడు సార్లు.

75
00:03:30,252 --> 00:03:33,630
పిరుదులు అనేవి అద్భుతమైన కండరాలు.
దేవుడి సాక్షిగా, నీ పిరుదులు నయమవుతాయి.

76
00:03:34,131 --> 00:03:36,049
ఇక్కడమంచి విషయం ఏమిటంటే,
ఓ'బ్రయన్ పిరుదులు పట్టేయడంతో,

77
00:03:36,133 --> 00:03:39,219
మాంట్రియల్ నుంచి వచ్చిన వ్యక్తి
గోలీగా అతని స్థానంలో ఆడతాడు.

78
00:03:39,303 --> 00:03:42,097
-అందరూ జోరోకి చప్పట్లు కొట్టండి.
-దానిని "జొహో" అంటారు.

79
00:03:42,181 --> 00:03:44,892
-నన్ను క్షమించు, జోరో.
-"జొహో."

80
00:03:45,893 --> 00:03:47,394
నేనిక్కడ తప్పుగా ఏమంటున్నానో
నాకు తెలియడం లేదు.

81
00:03:47,477 --> 00:03:49,605
విషయం ఏమిటంటే, జెంటిల్మెన్, మీలో
ఎవరి దగ్గరైన క్రిస్టల్ బాల్ ఉంటే తప్ప,

82
00:03:49,688 --> 00:03:51,273
రేపు ఏం జరగబోతోందో మనకు తెలియదు.

83
00:03:51,356 --> 00:03:52,733
అందుకనే మనం ఆట ఆడతాము.

84
00:03:53,233 --> 00:03:55,903
అందుకని గట్టిగా అనండి! మూడు మీద రిచ్మండ్!
ఒకటి, రెండు, మూడు!

85
00:03:55,986 --> 00:03:57,905
-రిచ్మండ్!
-సరే, పదండి. వెళదాం.

86
00:04:00,991 --> 00:04:02,993
-హే, కోచ్.
-ఎలా ఉన్నారు? మీకెలా సహాయం చేయగలను?

87
00:04:03,076 --> 00:04:05,954
జేమీ టార్ట్ మాన్ సిటీ కి
వెళ్ళిన తరువాత,

88
00:04:06,038 --> 00:04:08,832
మీరు ఒకటి ఓడిపోయారు, ఒకటి డ్రా అయింది,
మీరు గోల్స్ ఏమీ స్కోర్ చేయలేదు.

89
00:04:08,916 --> 00:04:09,917
-అవును.
-అందుకని, నేను అనుకుంటున్నాను,

90
00:04:10,000 --> 00:04:12,252
బహిష్కరణ ముప్పు గురించి మీరు
ఎంత ఆందోళన చెందుతున్నారు?

91
00:04:13,045 --> 00:04:16,548
లాయిడ్, ప్రస్తుతం నేను బహిష్కరణ యొక్క
నిర్వచనం గురించి ఆందోళన చెందుతున్నాను.

92
00:04:17,925 --> 00:04:19,259
నువ్వేం అడుగుతావు, మార్కస్?

93
00:04:19,343 --> 00:04:22,053
జేమీ టార్ట్ నిష్క్రమణతో మీకెలా
అనిపిస్తోందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను?

94
00:04:22,137 --> 00:04:23,722
అవును.

95
00:04:23,805 --> 00:04:26,517
నిజం చెప్పాలంటే,
నా మనసు కొంచెం గాయపడింది.

96
00:04:26,600 --> 00:04:28,769
కోచ్గా అవడంలోని చక్కని విషయాలలో ఒకటి

97
00:04:28,852 --> 00:04:30,854
ఆటగాళ్లతో మీకు ఏర్పడే అనుబంధం
అని నేను అనుకుంటాను.

98
00:04:30,938 --> 00:04:34,066
ఇది నాకు చాలా కష్టతరమైనది
ఇంకా గడ్డిపై ఆట ఆడుతున్నప్పుడు

99
00:04:34,149 --> 00:04:36,652
జరిగే దేనికన్నా కూడా
అది చాలా కాలం పాటు నాతోనే ఉంటుంది.

100
00:04:37,486 --> 00:04:39,029
సరే అయితే. నేను మిమ్మల్ని
లివర్పూల్ లో కలుస్తాను, సరేనా?

101
00:04:39,112 --> 00:04:40,239
సరే.

102
00:04:42,282 --> 00:04:44,826
హే! అక్కడ మిగిలిపోయిన
చివరి వారు స్కాచ్ ఎగ్!

103
00:04:46,495 --> 00:04:47,496
ఏంటి?

104
00:05:00,968 --> 00:05:02,344
హే, అతను అక్కడున్నాడు.

105
00:05:09,268 --> 00:05:11,270
-నిన్ను చూడడం బాగుంది, మిత్రమా.
-సరే, పదండి వెళదాం.

106
00:05:38,505 --> 00:05:41,592
ఇదుగోండి. ఇది ప్రెసిడెన్షియల్ స్వీట్.
ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.

107
00:05:41,675 --> 00:05:44,136
మీకు గదిలో ఉన్న వేరు
వేరు సౌలభ్యాలు చూపించమంటారా?

108
00:05:44,219 --> 00:05:45,762
వద్దు, ధన్యవాదాలు.

109
00:05:45,846 --> 00:05:47,848
నేను, నా అమ్మాయి
మేమిద్దరం రాత్రికి ఊర్లోకి వెళ్ళే ముందు

110
00:05:47,931 --> 00:05:49,266
సెక్స్ చేసి, స్నానం చేద్దామనుకుంటున్నాము.

111
00:05:50,017 --> 00:05:51,101
లివర్పూల్ కి స్వాగతం.

112
00:05:54,062 --> 00:05:56,315
ఏంటి? అతను మనం ఇచ్చే
డబ్బుని నిమిషంలో ఖర్చు పెట్టేస్తాడు.

113
00:05:56,398 --> 00:05:59,109
అబ్బా. నేను అతనికి ఇచ్చిన ఆ కల్పన
అతనితో జీవితాంతం ఉంటుంది.

114
00:05:59,193 --> 00:06:02,237
లేదు, అది నువ్వు కాదు. అది... ఛ.

115
00:06:02,321 --> 00:06:05,741
ఇది నాది, రూపర్ట్ ది
వార్షికోత్సవ వారాంతం. ఇంకా...

116
00:06:07,075 --> 00:06:09,286
-మొదటి సారి నా అంతట నేనే గడుపుతున్నాను...
-హే, ఊరుకో.

117
00:06:14,082 --> 00:06:15,083
ధన్యవాదాలు.

118
00:06:17,836 --> 00:06:19,171
ఇది చాలా పెద్ద కౌగిలింత.

119
00:06:20,881 --> 00:06:24,593
మీకు గుర్తుచేయడానికి,
హోటల్ సామను గదుల్లోనే ఉంటుంది,

120
00:06:24,676 --> 00:06:27,137
హాల్ వే లేదా పూల్ లో కాదు.

121
00:06:27,221 --> 00:06:32,601
అదీ కాకుండా మీరు వాటిని మీ ఇంటికి లేదా
ఇతర హోటళ్లకు పంపడానికి వీల్లేదు, సరేనా?

122
00:06:32,684 --> 00:06:34,645
సరే. ఒక గంటలో
టీమ్ భోజనం ఉంటుంది.

123
00:06:34,728 --> 00:06:37,272
దాని తరువాత, అది సినిమా రాత్రి
లేదా దిండ్లతో ఆడుకోవడం అవుతుంది.

124
00:06:37,356 --> 00:06:38,607
ఈసారి అది ఏమవుతుంది?

125
00:06:38,690 --> 00:06:40,150
సినిమా రాత్రి.

126
00:06:40,234 --> 00:06:43,403
సరే. కానీ ఏంటో చెప్పనా, మీరందరూ ఒక్కసారి
"దిండ్లతో ఆడుకోవడం" కి సరే అంటే,

127
00:06:43,487 --> 00:06:45,030
మనం ఇంకెప్పుడూ కూర్చుని సినిమా చూడము.

128
00:06:45,113 --> 00:06:46,323
-అది మీ కోసం, కోచ్.
-ధన్యవాదాలు, సర్.

129
00:06:46,406 --> 00:06:48,033
-ఇంకా ఇది మీ కోసం.
-ధన్యవాదాలు.

130
00:06:48,116 --> 00:06:50,953
గది 5150. మొత్తానికి.

131
00:06:51,036 --> 00:06:54,414
సామీ హాగర్, వాన్ హాలెన్
చరిత్రలోని అతి గొప్ప గాయకుడు.

132
00:06:54,498 --> 00:06:57,125
-డేవిడ్ లీ రాత్ యుగం తరువాతి సమయంలో.
-ధన్యవాదాలు.

133
00:06:57,209 --> 00:06:58,961
-కోచ్, మీకే గది దొరికింది?
-5148.

134
00:06:59,044 --> 00:07:01,421
-హే.
-ఎలా ఉన్నావు, పక్కింటాయన.

135
00:07:01,505 --> 00:07:05,342
అవును, హలో. నేను ఆర్డర్ చేసిన
షాంపేన్ ఇంకా రాలేదు. ధన్యవాదాలు.

136
00:07:06,552 --> 00:07:08,262
మంచి ప్రశ్న. ఒక్క క్షణం.

137
00:07:08,345 --> 00:07:12,349
ఈ రాత్రికి మనకు ఎక్కడైనా రిజర్వేషన్
చెయ్యమని కాన్సియర్జ్ కి చెప్పనా?

138
00:07:12,432 --> 00:07:15,185
షిప్లేస్ స్టేక్ హౌస్ దాని భోజనం,
పరిసరాలకు చాలా పేరు పొందింది.

139
00:07:15,727 --> 00:07:17,354
అవునా? సరే, నేను స్టేక్ తినగలను.

140
00:07:17,437 --> 00:07:20,065
సరే. దయచేసి, ఇద్దరికీ స్టేక్ హౌస్.

141
00:07:21,024 --> 00:07:22,943
నీకు ఎనిమిదింటికి వీలవుతుందా?

142
00:07:23,026 --> 00:07:26,238
బిజినెస్ సెంటర్ రోజులో
24 గంటలు తెరిచే ఉంటుంది.

143
00:07:26,321 --> 00:07:27,322
సరే.

144
00:07:28,657 --> 00:07:30,117
ఆ బిజినెస్ సెంటర్ సంగతి ఏంటి?

145
00:07:30,200 --> 00:07:32,703
అతిథులు మా అత్యాధునిక వ్యాయామశాలకు
కూడా ప్రాప్యత కలిగి ఉన్నారు,

146
00:07:32,786 --> 00:07:35,455
ఇది సరికొత్త వ్యాయామ
సాంకేతికతతో నిండి ఉంది.

147
00:07:35,539 --> 00:07:36,540
కెటిల్ బెల్స్ లాగా!

148
00:07:36,623 --> 00:07:37,916
దేవుడా.

149
00:07:38,000 --> 00:07:40,252
నైట్ లైఫ్ విషయానికి వస్తే
లివర్పూల్ చాలా అందిస్తుంది.

150
00:07:40,335 --> 00:07:45,424
పబ్బులు మరియు క్లబ్ల నుండి,
గొప్ప ఆసియా కాలక్షేపం అయిన కారియోకే వరకు!

151
00:07:46,008 --> 00:07:47,885
నాకిది చేయడం కూడా గుర్తులేదు.

152
00:07:48,385 --> 00:07:50,345
-మీకు కళా హృదయం ఉంటే...
-సరే, చాలు.

153
00:07:50,888 --> 00:07:52,514
ఈ వారాంతం మనం ముందుకు వెళ్ళడానికి.

154
00:07:52,598 --> 00:07:55,976
ఆ షాంపేన్ వచ్చిన తరువాత,
మనం తాగి, మంచి భోజనం చేసి,

155
00:07:56,059 --> 00:07:57,477
గతాన్ని గతంలోనే వదిలేద్దాం.

156
00:07:57,561 --> 00:07:59,730
-సరేనా?
-చాలా బాగుంది.

157
00:07:59,813 --> 00:08:01,023
తలుచుకోగానే ప్రత్యక్షం.

158
00:08:04,401 --> 00:08:06,236
హలో, స్టింకీ.

159
00:08:08,405 --> 00:08:12,743
నీ మాజీ భర్త డబ్బు చెల్లించకపోయినా
నువ్వీ పెద్ద గదిలోనే దిగావు.

160
00:08:12,826 --> 00:08:14,870
మంచిది. రూపర్ట్ సంగతి మర్చిపో!

161
00:08:16,538 --> 00:08:19,166
ఇదెవరు? నీ కొత్త
ఉంపుడుగత్తెనా? ఆమె రష్యనా?

162
00:08:19,249 --> 00:08:22,085
-నువ్వు రష్యనా?
-ఒకటి, నువ్వు నచ్చావు, రెండు, నువ్వెవరు?

163
00:08:22,628 --> 00:08:26,965
ఈమె నా చిన్ననాటి
ప్రాణ స్నేహితురాలు,ఫ్లో కాలిన్స్.

164
00:08:27,049 --> 00:08:30,010
అద్భుతమైన చైల్డ్ సైకాలజిస్ట్,
ఇటీవలే గర్వించతగ్గ ఒంటరి తల్లి అయింది,

165
00:08:30,093 --> 00:08:34,472
ఒక అద్భుతమైన 12 ఏళ్ల అమ్మాయి,
నోరా, నా గాడ్ డాటర్ కి.

166
00:08:34,556 --> 00:08:35,474
వావ్.

167
00:08:35,557 --> 00:08:38,477
ఇద్దరితో, ఈ గత ఆరేళ్ళలో మాట్లడడాన్ని
నేను పూర్తిగా నిర్లక్ష్యం చేసాను.

168
00:08:38,936 --> 00:08:40,562
దేవుడా, స్టింకీ.

169
00:08:40,645 --> 00:08:43,565
నా అంత్యక్రియల సమయంలో నిన్ను స్పీచుల
కోసం ఉంచే జాబితాలో చేర్చడం గుర్తు చెయ్యి.

170
00:08:44,149 --> 00:08:47,069
హాయ్, నేను, ఫ్లో. లేదా నువ్వు "సాసీ" అని
పిలవచ్చు. నువ్వెలా పిలిచినా పరవాలేదు.

171
00:08:47,861 --> 00:08:49,112
అయితే, నువ్వు విడాకుల గురించి విన్నావా?

172
00:08:49,196 --> 00:08:53,325
ఆ. నేను డెర్రెన్ ని ఒక పార్టీలో కలిసాను.
నాతో సరసాలాడి వెంటనే చెప్పాడు.

173
00:08:53,408 --> 00:08:56,995
హే, కొత్త ఏముంది? ఆ సమాచారం ఇవ్వడానికి
అది వింతైన క్రమం.

174
00:08:57,538 --> 00:08:59,206
అవును, అయితే,
ఇవాళ రాత్రికి ఏం చేస్తున్నావు?

175
00:08:59,289 --> 00:09:00,999
నేనిక్కడ కూర్చోనా? ఒక రోబ్ తెచ్చుకోనా?

176
00:09:02,793 --> 00:09:04,127
చూడు, నేనేం తెచ్చానో.

177
00:09:05,963 --> 00:09:07,506
బయట రూమ్ సర్వీస్
ట్రాలీ నుంచి దొంగిలించాను.

178
00:09:07,589 --> 00:09:08,799
నువ్వు అద్భుతం!

179
00:09:09,883 --> 00:09:11,927
నేను, కీలీ. హాయ్!

180
00:09:12,010 --> 00:09:13,095
ఆ, నువ్వెవరో నాకు తెలుసు, తల్లీ.

181
00:09:13,178 --> 00:09:15,430
నా మాజీ భర్త నిన్ను చూస్తూ పిచ్చివాడిలా
హస్తప్రయోగం చేసుకునేవాడు, అందుకని...

182
00:09:29,862 --> 00:09:32,614
రేపు వీరిని మనం ఓడించగలమని అనుకోవడానికి
నేను కోకో పఫ్స్ కోసం కుకూనా?

183
00:09:32,698 --> 00:09:34,992
-లేదు, మనిద్దరం సరిగ్గా సరిపోతాము.
-అవును.

184
00:09:35,075 --> 00:09:36,952
నీ సంగతి ఏంటి, నేట్?
వీరు గెలుస్తారని నువ్వనుకుంటావా?

185
00:09:37,327 --> 00:09:38,745
ఈ టీమ్ ఏమైనా చేయగలదని నేననుకుంటాను.

186
00:09:38,829 --> 00:09:40,539
చూసావా? అదుగో.
నేను అంటోంది అదే.

187
00:09:40,622 --> 00:09:43,166
సరే, నేట్, నా స్థానంలో నువ్వుంటే,
వీరికి నువ్వేం చెబుతావు?

188
00:09:43,250 --> 00:09:44,543
లేదు. నేను ఏమీ అనను... లేదు, నేను...

189
00:09:44,626 --> 00:09:47,754
హే, కేవలం నీ అభిప్రాయం అడుగుతున్నాను.
నీకది అర్థమయిందా?

190
00:09:48,088 --> 00:09:49,548
-ఆ.
-నీకొక అభిప్రాయం ఉంది, అవునా?

191
00:09:49,631 --> 00:09:51,592
-అవును.
-అంతా చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా?

192
00:09:53,093 --> 00:09:54,136
-నాకు చెప్పు.
-లేదు.

193
00:09:54,219 --> 00:09:56,638
ఎందుకు చెప్పవు? నాకు చెబితే
ఏమవుతుందని భయపడుతున్నావు?

194
00:09:56,722 --> 00:09:58,557
మీకు నా ఆలోచన నచ్చదని,
మీరు నన్ను ద్వేషిస్తారని అనుకుంటాను.

195
00:09:58,640 --> 00:09:59,516
ఆ తరువాత మీరు నన్ను
ఉద్యోగంలోంచి తీసేస్తారు.

196
00:09:59,600 --> 00:10:01,852
నేను నా తల్లిదంద్రులతో ఉండడానికి వెళ్ళాలి,
వారికి నన్ను చూసి సిగ్గుగా ఉంటుంది.

197
00:10:01,935 --> 00:10:04,563
అప్పుడు ఇంటి దగ్గర అందరికీ విషయం తెలిసి
నా ముఖం కరిగే దాకా నన్ను చూసి నవ్వుతారు.

198
00:10:04,646 --> 00:10:05,522
ఎక్స్క్యూజ్ మి.

199
00:10:09,443 --> 00:10:11,153
అతనీసారి తడబడలేదు.

200
00:10:15,616 --> 00:10:16,450
మిచెల్ లాసో

201
00:10:16,533 --> 00:10:18,410
విసిగిస్తున్నందుకు క్షమించు.
నీకవి చూడడానికి అవకశం దొరికిందా? X

202
00:10:18,493 --> 00:10:21,288
నాకు కొన్ని పనులున్నాయి.
మిమల్ని ఉదయం కలుస్తాను, సరేనా?

203
00:10:21,371 --> 00:10:23,373
హే, నాకొక సహాయం చెయ్యి.
వీరి మీద ఒక కన్నేసి ఉంచు,

204
00:10:23,457 --> 00:10:27,503
ఎందుకంటే సరిగ్గా 74 వ నిమిషానికి,
ఈ గది నిండా ఏడ్చే పురుషులు ఉంటారు.

205
00:10:28,462 --> 00:10:29,463
నేను వారిలో ఒకడిని అవుతాను.

206
00:10:32,132 --> 00:10:34,259
సరే, నేను ఏమీ తయారు చేసుకోలేదు.

207
00:10:34,343 --> 00:10:37,471
కావల్సినంత తాగగల బార్ ఉన్న చోట
మెయిడ్ ఆఫ్ హానర్ కి తెలివైన ఆలోచన కాదు.

208
00:10:37,554 --> 00:10:39,097
అవును, ఆమె ఆ వారాంతానికి
పెద్ద స్టార్ అయింది.

209
00:10:39,181 --> 00:10:42,059
-ఆ, ఎల్టన్ జాన్ కి హస్తప్రయోగం చేసాను.
-ఏం చేసావు?

210
00:10:42,142 --> 00:10:44,394
-లేదు, నువ్వు చేయలేదు.
-అవును, నేను చేసాను!

211
00:10:44,478 --> 00:10:46,355
అతనది జరగలేదని పదే పదే చెప్పాడు.

212
00:10:46,438 --> 00:10:48,273
అది ఎప్పుడూ జరిగే,
"ఆమె అంది, ఆమె అంది" కాదా?

213
00:10:51,109 --> 00:10:54,238
మీకు ఇంకో బాటిల్ కావాలా?
బహుశా ఒక డెజర్ట్?

214
00:10:54,905 --> 00:10:58,075
ఇక్కడున్న నా సెక్సీ, ఒంటరి స్నేహితురాలికి

215
00:10:58,158 --> 00:11:01,245
ఆమె డెజర్ట్లు పెద్ద సైజులో కావాలి.

216
00:11:01,328 --> 00:11:04,081
అదేమైనా మీరు చేయగలిగితే, అలాగే.

217
00:11:05,874 --> 00:11:07,042
నేను మీకు కొన్ని నిమిషాలు ఇస్తాను.

218
00:11:07,125 --> 00:11:08,210
ధన్యవాదాలు. క్షమించండి.

219
00:11:11,004 --> 00:11:12,548
నువ్వలా చేసావంటే నేను నమ్మలేను.

220
00:11:12,965 --> 00:11:14,132
నోరు మూసుకో. నీకది నచ్చింది.

221
00:11:14,216 --> 00:11:16,260
అవును. నేను సిగరెట్ తాగడానికి
వెళ్తున్నాను. స్టింకీ వస్తావా?

222
00:11:16,343 --> 00:11:17,636
లేదు. నేను సిగరెట్లు తాగడం లేదు.

223
00:11:18,887 --> 00:11:21,306
అయినా నువ్వు కాలిపోతున్నావు.

224
00:11:27,312 --> 00:11:28,564
ఆ, నాకు తెలియదు. అది...

225
00:11:29,565 --> 00:11:33,527
మీరు దాన్ని మళ్ళీ గట్టిగా ఫ్లష్ చేయమని
నేను సూచించవచ్చా? సరే, బై.

226
00:11:34,862 --> 00:11:35,946
హాయ్, నేను మీకెలా సహాయం చేయగలను?

227
00:11:36,029 --> 00:11:38,198
హే, ఎలా ఉన్నావు? మీ దగ్గార్ ఒక ఫాక్స్
మెషీన్ ఉందేమోనని అనుకుంటున్నాను.

228
00:11:38,866 --> 00:11:39,867
ఫాక్స్ మెషీనా?

229
00:11:41,535 --> 00:11:45,289
ఓహ్, సరే. అది ఒక మంచి ప్రశ్న.
మీరు ఒక్క నిమిషం ఓపిక పట్టండి.

230
00:11:45,372 --> 00:11:47,875
నేను మా సహచరులను అడిగి
ఎక్కడైనా ఉందేమో కనుక్కుంటాను.

231
00:11:47,958 --> 00:11:51,753
ఫాక్స్ మెషీనా, హే? 1997 లో
ఏమైనా పంపుతున్నారా?

232
00:11:51,837 --> 00:11:54,256
అవును, ఆపిల్ షేర్లు కొనమని
నాకు నేనే ఒక నోట్ పంపుకుంటున్నాను.

233
00:11:54,339 --> 00:11:55,799
మంచి ఆలోచన.

234
00:11:55,883 --> 00:11:59,011
మీరు నాకు జే.కే.రౌలింగ్ ని హత్య చేసి మొదటి
హ్యారీ పాటర్ పుస్తకం రాయమని కూడా చెబుతారా?

235
00:11:59,469 --> 00:12:02,014
అలాగే. ఆ. నేను "హత్య" కి
బదులుగా "చూసుకోమని" రాస్తాను,

236
00:12:02,097 --> 00:12:03,098
అలా అయితే సాక్ష్యాలేమీ ఉండవు.

237
00:12:04,266 --> 00:12:06,226
-ఆ, నేను టెడ్.
-సాసీ.

238
00:12:06,727 --> 00:12:08,395
సాసీ, హా? ఆ స్మర్ఫ్ లానా?

239
00:12:09,479 --> 00:12:11,148
సాసీ స్మర్ఫ్ లేదనుకుంటాను, ఉందా?

240
00:12:11,231 --> 00:12:12,232
అయ్యో.

241
00:12:12,316 --> 00:12:14,860
ఒక వైఖరి ఉన్న స్మర్ఫ్ ఉంటే
చూడానికి చాలా బాగుంటుంది.

242
00:12:15,402 --> 00:12:18,363
సరే, ఆలాగే, నేనతనికి చెప్తాను.
ట్రయల్ ఎలా వెళ్తుందో చెప్పు. సరే, బై.

243
00:12:19,239 --> 00:12:21,658
సరే, మా ప్రాంగణంలో ఫాక్స్ మెషీన్ లేదు.

244
00:12:21,742 --> 00:12:23,911
కానీ ఇక్కడి నుంచి ఎనిమిది మైళ్ళ దూరంలో

245
00:12:23,994 --> 00:12:27,414
క్రాక్స్టెత్ లో ఒక టానింగ్ సలూన్లో ఒకటి
ఉందని మా కాన్సియర్జ్ తెలుసుకున్నాడు.

246
00:12:27,497 --> 00:12:28,707
ఏంటో తెలుసా, వదిలేయండి.

247
00:12:28,790 --> 00:12:31,793
నేను దగ్గరలో పావురాలను పంపే
మానిక్యూరిస్ట్ దగ్గరకు వెళతాను.

248
00:12:33,629 --> 00:12:35,255
-అయినా, ధన్యవాదాలు. సరే.
-సరే.

249
00:12:35,839 --> 00:12:36,924
మిమ్మల్ని కలవడం బాగుంది.

250
00:12:37,674 --> 00:12:38,759
సరే, నేను మీకు ఎలా సహాయం చేయగలను?

251
00:12:38,842 --> 00:12:40,844
నేను సిగరెట్ తాగడానికి వెళితే,

252
00:12:40,928 --> 00:12:43,096
నా స్నేహితురాలు బిల్లు
కడుతుందేమోనని అనుకున్నాను.

253
00:12:43,805 --> 00:12:46,892
అప్పుడు నేను లైన్లో మాగ్నం పిఐని చూసాను,
అతనితో కాసేపు సరసాలడదామని అనుకున్నాను.

254
00:12:46,975 --> 00:12:49,603
-ఏమవుతుందో చూద్దామనుకున్నాను, సరేనా?
-గుడ్ లక్.

255
00:12:49,686 --> 00:12:52,022
ఆ, నేనది పాడు చేసుకున్నాననుకుంటాను.

256
00:12:53,982 --> 00:12:56,944
నా పని 30 నిమిషాల్లో అయిపోతుంది,
మీరు కావాలనుకుంటే...

257
00:12:57,027 --> 00:12:58,195
ఓహ్, తప్పకుండా, నువ్వెందుకు అనుకోవు?

258
00:13:00,322 --> 00:13:02,032
నువ్వు ఎవరవ్వాలని ఎంచుకుంటే అదే అవుతావు.

259
00:13:05,118 --> 00:13:07,454
సూపర్మాన్.

260
00:13:10,666 --> 00:13:13,794
సరే, నేను ఇప్పుడే
ఒక మార్ల్బరో మాన్ ని కలిసాను...

261
00:13:13,877 --> 00:13:16,713
-స్టింకీ ఏది? నిన్నువదిలేసి వెళ్ళిందా?
-లేదు, బాత్రూంకి వెళ్ళింది.

262
00:13:17,130 --> 00:13:18,298
"స్టింకీ" పేరు ఎలా వచ్చింది?

263
00:13:19,091 --> 00:13:21,218
ఆమె మా ఊరికి వచ్చిన రోజు నాకు గుర్తుంది.

264
00:13:21,301 --> 00:13:23,262
ఆమె అప్పటికే నాకన్నా పొడుగ్గా ఉంది,
పెద్ద వక్షోజాలు ఉన్నాయి.

265
00:13:23,762 --> 00:13:26,390
ధనిక కుటుంబం,
అందుకని ఏడో తరగతి మొదటి రోజున,

266
00:13:26,473 --> 00:13:29,142
నేను అందరికీ ఆమె ముద్దు పేరు
"స్టింకీ" అని చెప్పాను.

267
00:13:29,643 --> 00:13:30,644
అది అద్భుతం.

268
00:13:31,895 --> 00:13:33,230
మనను దగ్గరగా ఉంచే అనుబంధాలకు.

269
00:13:33,313 --> 00:13:34,523
రెబెక్కాకి.

270
00:13:35,899 --> 00:13:37,818
ఆ, ఈమె రెబెక్కా కాదు.

271
00:13:38,944 --> 00:13:39,945
ఏమంటున్నావు?

272
00:13:40,654 --> 00:13:42,281
కాదు, అసలు రెబెక్కా చాలా సరదాగా ఉంటుంది.

273
00:13:42,990 --> 00:13:44,533
గట్టిది కానీ ప్రేమ లేకుండా ఉండదు.

274
00:13:45,284 --> 00:13:47,494
-ఆమె పాడడం ఎప్పుడైనా విన్నావా?
-లేదు.

275
00:13:47,578 --> 00:13:49,121
అందమైన స్వరం.

276
00:13:50,122 --> 00:13:52,207
ఆమె, నోరా కలిసి గంటల తరబడి పాడేవారు.

277
00:13:54,376 --> 00:13:56,211
-నోరా ఎవరు?
-మా అమ్మాయి.

278
00:13:56,295 --> 00:13:57,504
ఓహ్, అవును.

279
00:13:57,588 --> 00:14:00,132
ఆ, నీకు ఈ అమ్మాయి నచ్చితే,
నువ్వా రెబెక్కాని ప్రేమిస్తావు.

280
00:14:01,592 --> 00:14:03,302
-వెళదామా?
-బిల్లు సంగతి ఏంటి?

281
00:14:03,385 --> 00:14:05,888
-ధన్యవాదాలు, మిస్ వెల్టన్.
-సరే.

282
00:14:08,765 --> 00:14:10,976
నీకు చెల్లించాలని ఉందని నటించేది చేస్తావా?

283
00:14:11,059 --> 00:14:12,936
ఆ, ఆ.
అది సరదాగా ఉంటుంది. నువ్వు కూడా చెయ్యి.

284
00:14:13,604 --> 00:14:16,148
నువ్వు నిజంగా చెత్తవి!
నేనదే చేయబోతున్నాను.

285
00:14:16,231 --> 00:14:19,067
-నేను ఇప్పుడే కార్డు బయటకుతీయబోతున్నాను.
-నువ్విలా చేసావంటే నేను నమ్మలేను.

286
00:14:19,151 --> 00:14:22,112
-మనం పంచుకుందాం. అది చాలా బాగుంది.
-ఆరేళ్లుగా నేను దీని కోసమే ఎదురు చూసాను...

287
00:14:32,497 --> 00:14:35,792
విడాకులకు సమ్మతి

288
00:14:35,876 --> 00:14:37,961
మిచెల్ లాసో
థియోడర్ లాసో

289
00:14:50,807 --> 00:14:52,309
నేను బ్రయన్ స్వాన్సన్. మిచెల్ లాయర్ ని.
ఆమె మీతో మాట్లాడమని చెప్పింది.

290
00:14:52,392 --> 00:14:53,977
మంచి వార్త! మీరు సంతకం చేసిన దాని
ఫోటో తీసి ఇమెయిల్ చెయవచ్చు.

291
00:15:10,619 --> 00:15:13,038
-నువ్వేంచేస్తున్నావు?
-నన్ను క్షమించండి. నేను...

292
00:15:13,121 --> 00:15:14,122
నువ్వు ఏంటి?

293
00:15:14,831 --> 00:15:17,084
-ఇదేంటి?
-ఇవి టీమ్ గురించి నా అభిప్రాయలు.

294
00:15:17,167 --> 00:15:19,253
వెళ్ళు, నేథన్. వెళ్ళు. ఇప్పుడు నువ్వు బయట
తిరగకూడని సమయం దాటిపోయింది.

295
00:15:19,336 --> 00:15:20,796
-వెళ్ళు! ఇక్కడి నుంచి వెళ్ళు!
-క్షమించండి!

296
00:15:36,728 --> 00:15:39,773
నైట్ లైఫ్ విషయానికి వస్తే
లివర్పూల్ చాలా అందిస్తుంది.

297
00:15:39,857 --> 00:15:45,571
పబ్బులు మరియు క్లబ్ల నుండి,
గొప్ప ఆసియా కాలక్షేపం అయిన కారియోకే వరకు!

298
00:15:45,654 --> 00:15:50,033
మీకు కళా హృదయం ఉంటే, లేక మీ
ప్రేమికురాలిని ఆకట్టుకోవాలని చూస్తే,

299
00:15:50,117 --> 00:15:51,952
లివర్పూల్ లో చాలా మ్యూజియంలు,
గ్యాలరీలు ఉన్నాయి...

300
00:15:52,703 --> 00:15:56,164
గూడిసన్ పార్క్ కి స్వాగతం.
నేను క్రిస్ పొవెల్ తో ఆర్లో వైట్.

301
00:15:56,248 --> 00:15:58,959
సరే! ఇక్కడ కొన్ని స్నాక్స్ ఉన్నాయి!

302
00:15:59,042 --> 00:16:02,379
వీటన్నిటిని మొదటి హాఫ్ లోనే
పూర్తి చేయద్దు. ఆడు, రిచ్మండ్!

303
00:16:02,462 --> 00:16:05,048
ఎనిమిదో స్థానంలో ఉన్న ఎవర్టన్
ఏ ఎఫ్ సి రిచ్మండ్ కి ఆతిథ్యం ఇస్తోంది,

304
00:16:05,132 --> 00:16:08,010
వారి 18వ స్థానంలో ఉన్నారు మరియు
బహిష్కరణకు సిద్ధంగా ఉన్నారు.

305
00:16:08,093 --> 00:16:10,220
ఇక్కడి నుంచి విజయం సాధించి
రిచ్మండ్ వెళ్ళింది,

306
00:16:10,304 --> 00:16:14,975
యుకెలో ఎల్విస్ ప్రె స్లీ పాట "ఇట్స్ నౌ
ఆర్ నెవర్" ఒకటవ స్థానంలో ఉన్నప్పుడు.

307
00:16:15,058 --> 00:16:18,478
ఇవాళ టెడ్ లాసో అబ్బాయిల
పరిస్థితి ఖచ్చితంగా అదే.

308
00:16:19,354 --> 00:16:21,481
-నేట్, దయచేసి నేను నీతొ మాట్లాడవచ్చా?
-చెప్పండి.

309
00:16:25,944 --> 00:16:27,279
నువ్వు బాగానే ఉన్నావా?

310
00:16:27,362 --> 00:16:31,575
నిన్న రాత్రి నీ మీద అనవసరంగా అరిచినందుకు
క్షమాపణ అడగాలనుకుంటున్నాను,

311
00:16:31,658 --> 00:16:33,785
అందుకు నన్ను క్షమించు,
నువ్వు నన్ను క్షమించగలవని ఆశిస్తున్నాను.

312
00:16:34,536 --> 00:16:36,330
ఆ, అలాగే... ఆ,అలాగే.

313
00:16:36,413 --> 00:16:40,959
ధన్యవాదాలు.
ఇంకా నేను నీ ఆలోచనలను చదివాను.

314
00:16:41,043 --> 00:16:42,961
-ఆ.
-అవి చాలా బాగున్నాయి.

315
00:16:44,463 --> 00:16:46,548
నేను అందులో చివరిదానితో సహా అంగీకరిస్తాను.

316
00:16:46,632 --> 00:16:48,509
కానీ ఇది నేను వారికి చెప్పలేను.

317
00:16:48,592 --> 00:16:50,594
-కానీ వారిది వినాలి.
-అవును.

318
00:16:51,386 --> 00:16:52,513
అందుకనే ఇది నువ్వు చేయబోతున్నావు.

319
00:16:53,555 --> 00:16:54,556
మీరు తాగి ఉన్నారా?

320
00:16:54,640 --> 00:16:57,267
నువ్వు ఆటకి ముందు వారితో మాట్లాడుతున్నావు,
నువ్వు ఇది వారికి చదివి వినిపిస్తావు.

321
00:16:58,852 --> 00:17:01,522
-నాకు తెలియదు.
-ఇది సరదాగా ఉంటుంది.

322
00:17:03,524 --> 00:17:05,025
కాదు. కాదు, కాదు, కాదు.

323
00:17:06,276 --> 00:17:07,319
దేవుడా.

324
00:17:07,986 --> 00:17:09,154
సరే, అందరూ వినండి.

325
00:17:09,238 --> 00:17:12,031
ఈ మధ్యలో మీరు నేను చెప్పే చెత్త
చాలానే విన్నారని నాకనిపించింది.

326
00:17:12,115 --> 00:17:15,368
అందుకని నేను నేట్ ది గ్రేట్ ని
మీ గురించి, నేటి గేమ్ గురించి

327
00:17:15,452 --> 00:17:17,162
అతని ఆలోచనలు, అభిప్రాయాలను
కొన్నిటిని రాయమని చెప్పాను.

328
00:17:17,246 --> 00:17:18,372
అందకని అందరం దృష్టి పెడదాము.

329
00:17:18,454 --> 00:17:20,082
-చెప్పు, నేట్.
-సరే.

330
00:17:27,005 --> 00:17:29,967
-చెప్పు, నేట్.
-చెప్పు. నువ్విది చేయగలవు.

331
00:17:30,050 --> 00:17:33,053
-నువ్విది చేయగలవు, నేట్.
-సరే. ధన్యవాదాలు. ఇది చేద్దాం.

332
00:17:35,722 --> 00:17:36,723
ఐసాక్.

333
00:17:39,226 --> 00:17:41,520
ఆ, ఆ.
ఆ, నువ్విది చేయగలవు, సోదరా, సరేనా?

334
00:17:41,603 --> 00:17:42,646
సరే.

335
00:17:42,729 --> 00:17:44,064
నేను ఈ మధ్య గమనించాను...

336
00:17:49,236 --> 00:17:51,363
నువ్వు మొద్దు, చిన్న
అమ్మాయిలా ఆడుతున్నారని.

337
00:17:54,992 --> 00:17:55,993
వావ్.

338
00:17:56,827 --> 00:17:58,328
నువ్వు నాతో ఏమన్నావు, సోదరా?

339
00:17:59,454 --> 00:18:02,457
నువ్వు గట్టివాడిలా ఉండేదానికన్నా ఎక్కువ
గట్టివాడిలా కనిపించడానికి ప్రయత్నిస్తావు.

340
00:18:02,541 --> 00:18:04,668
శారీరకంగా కాకుండా భయపెట్టేలా ఉండవచ్చు.

341
00:18:04,751 --> 00:18:06,336
నేనిలా అన్నందుకు నువ్వేమీ అనుకోకు.

342
00:18:08,005 --> 00:18:09,840
-సామ్.
-కాదు.

343
00:18:09,923 --> 00:18:11,800
నువ్వు వింగ్స్ లో
నిరంతరం దెబ్బ తింటున్నావు.

344
00:18:11,884 --> 00:18:13,010
అది నువ్వు నిర్ణయం తీసుకోలేకపోవడం వలన.

345
00:18:13,093 --> 00:18:14,845
నీ పునరాలోచన ఒక చెత్త సైకిక్
కన్నా చెత్తగా ఉంటుంది.

346
00:18:15,679 --> 00:18:17,931
తమ ఆలోచనలలో బంధీ అయిన
నాకు తెలిసిన ఒకే ఒక ఆఫ్రికన్,

347
00:18:18,015 --> 00:18:19,349
నెల్సన్ మండేలా.

348
00:18:22,102 --> 00:18:23,103
నువ్వది విన్నావా?

349
00:18:23,187 --> 00:18:26,064
నువ్వది సరదాగా ఉందనుకుంటున్నావా, కాలిన్?
నువ్వు నీ స్టెప్ ఓవర్ చెత్త.

350
00:18:26,148 --> 00:18:27,608
నిన్ను ఒకటి అడగుతాను.
నువ్వు నీ వృషణాలు వాక్స్ చేసుకుంటావా?

351
00:18:28,650 --> 00:18:29,568
ఏంటి?

352
00:18:29,651 --> 00:18:31,862
నేనేమైనా తడబడ్డానా, పిచ్చివెధవ? నువ్వు నీ
వృషణాలు వాక్స్ చేసుకుంటావా? అవును, కాదు.

353
00:18:31,945 --> 00:18:32,988
కాదు.

354
00:18:33,071 --> 00:18:35,157
అయితే ఎప్పుడూ ఒక బ్రెజీలియన్ లా
ఎందుకు ఆడతావు?

355
00:18:35,741 --> 00:18:36,742
అవును.

356
00:18:38,243 --> 00:18:39,203
ఇప్పుడే ఏమయింది?

357
00:18:39,286 --> 00:18:41,538
-రోహాస్.
-నా పని పట్టు, మిత్రమా.

358
00:18:41,622 --> 00:18:43,665
సరే. నువ్వు ఫుట్ బాలే జీవితం అంటావు, కదా?

359
00:18:43,749 --> 00:18:45,250
ఫుట్ బాలే జీవితం.

360
00:18:45,334 --> 00:18:46,919
అవును, కానీ నీ డిఫెన్స్ మరణం.

361
00:18:47,836 --> 00:18:50,839
తన మనుషులను ఇంత కన్నా తరచుగా కోల్పోగా నేను
చూసింది కేవలం క్యారీ చెత్త బ్రాడ్ షాని.

362
00:18:52,841 --> 00:18:54,635
సెక్స్ అండ్ ది సిటీ.

363
00:18:56,595 --> 00:18:58,263
-అవును.
-కష్టం కానీ న్యాయమే.

364
00:18:58,347 --> 00:18:59,640
అవును. రాయ్.

365
00:19:09,608 --> 00:19:12,236
అను. నువ్వు ఏం అనాలాని అనుకుంటున్నావో అను.

366
00:19:13,695 --> 00:19:14,780
సరే.

367
00:19:17,783 --> 00:19:19,284
దాన్ని చదవకు.

368
00:19:20,577 --> 00:19:21,870
నా ముఖం మీద చెప్పు.

369
00:19:23,580 --> 00:19:25,499
ఆ గొప్ప, రాయ్ కెంట్.

370
00:19:26,875 --> 00:19:28,335
ఇప్పుడు నీకు వయసయిపోయింది.

371
00:19:29,795 --> 00:19:33,173
ఇంకా నెమ్మదిగా అయ్యావు.
నీ దృష్టి తప్పిపోతోంది.

372
00:19:33,257 --> 00:19:35,884
కానీ నిన్ను నిన్నుగా చేసింది
నీ తెలివి, నీ వేగం కాదు.

373
00:19:36,844 --> 00:19:39,763
చేసింది నీ కోపం. అది నీ అద్భుత శక్తి.

374
00:19:39,847 --> 00:19:42,683
అదే నిన్ను ఈ లీగ్ చరిత్రలో
అత్యంత గొప్ప మిడ్ ఫీల్డర్ గా చేసింది.

375
00:19:43,100 --> 00:19:45,561
కానీ నేను నిన్నుఈ సీజన్ లో
పిచ్ లో అస్సలు చూడలేదు, రాయ్.

376
00:19:45,644 --> 00:19:48,272
అంటే, నువ్వు గడ్డి మీద
కోపంగా ఉన్నట్లు పరిగెత్తేవాడివి.

377
00:19:48,355 --> 00:19:51,692
నీ భార్యని పట్టుకున్నట్లు
ఆ బంతిని పట్టుకునేవాడివి.

378
00:19:52,943 --> 00:19:55,654
కానీ ఇప్పుడు నువ్వు ఆడుతున్నప్పుడు
ఆ కోపం బయటకే రావడం లేదు.

379
00:19:55,737 --> 00:19:57,197
కానీ అది ఇంకా లోపల ఉంది.

380
00:19:59,074 --> 00:20:02,160
అది నువ్వు నీలోనే ఉంచుకుంటే,
అది నిన్నేం చేస్తుందో అని నాకు భయంగా ఆంది.

381
00:20:28,896 --> 00:20:30,314
మనం వెళ్లి ఆ వెధవల ఆ పని పడదాం.

382
00:20:36,904 --> 00:20:38,572
చూసావా? అది సరదాగా ఉంటుందని చెప్పానా?

383
00:20:48,290 --> 00:20:53,629
ఇంకా అసంభవం అయినది జరిగింది.
రిచ్మండ్ ఎవర్టన్ మీద 1-0 తేడాతో గెలిచింది.

384
00:20:53,712 --> 00:20:57,007
-అవును, టెడ్! అవును!
-రాయ్ కెంట్ నుండి వచ్చిన అరుదైన గోల్ వలన.

385
00:20:57,090 --> 00:20:59,885
కెంట్ ఇవాళ అద్భుతంగా ఆడాడు.
అతను పిచ్చిపట్టిన వాడిలా ఆడాడు.

386
00:20:59,968 --> 00:21:03,222
అవును!

387
00:21:03,305 --> 00:21:06,808
మనకు తెలుసు, మనమని, మనకు తెలుసు మనమని.

388
00:21:06,892 --> 00:21:08,393
మేము మరణించే దాకా రిచ్మండ్.
మేము మరణించే దాకా రిచ్మండ్...

389
00:21:08,477 --> 00:21:10,103
దేవుడా!

390
00:21:10,187 --> 00:21:11,939
రా, నేట్, మాకొక హగ్ ఇవ్వు. అవును.

391
00:21:12,022 --> 00:21:13,565
-టెడ్!
-హే!

392
00:21:14,107 --> 00:21:16,443
-అభినందనలు.
-ధన్యవాదాలు, బాస్.

393
00:21:16,527 --> 00:21:18,779
నేను మీకు పరిచయం చేస్తాను...

394
00:21:18,862 --> 00:21:21,990
-సాసీ స్మర్ఫ్!
-మార్ల్బరో మాన్! దేవుడా.

395
00:21:22,658 --> 00:21:24,493
మనకు తెలుసు, మనమని, మనకు తెలుసు మనమని...

396
00:21:25,911 --> 00:21:28,288
-నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలియదు.
-సర్ప్రైజ్!

397
00:21:28,372 --> 00:21:30,290
నేను నీ గురించి ఈ వారాంతం
చాలా ఎక్కువగా అనుకున్నాను.

398
00:21:30,374 --> 00:21:31,834
అవునా? ఎందుకు?

399
00:21:31,917 --> 00:21:35,504
ఎందుకంటే, నువ్వు, నీ పిచ్చి జుట్టు నేను
టీవీ ఆన్ చేసినప్పుడల్లా వస్తూ ఉన్నారు.

400
00:21:39,633 --> 00:21:41,468
ఓయ్! విను!

401
00:21:42,219 --> 00:21:44,429
మీరెవరూ ఇవాళ రాత్రికి
హోటల్ కి తిరిగి వెళ్ళడం లేదు.

402
00:21:44,513 --> 00:21:48,058
ఎందుకంటే మనం ఇవాళ సాధించింది మనం
సాధించగలమని ఎవరూ అనుకోలేదు, మనం కూడా!

403
00:21:48,141 --> 00:21:50,060
అందుకని బయటకు వెళుతున్నాము,
మనం పార్టీ చేసుకుంటున్నాము,

404
00:21:50,143 --> 00:21:52,479
మనం అది ఈ నగరానికి చూపించి చేద్దాము.

405
00:21:55,732 --> 00:21:58,110
రాయ్! రాయ్! మనం ఎక్కడికి వెళ్తున్నాము?

406
00:21:59,069 --> 00:22:00,153
కీలీ?

407
00:22:03,240 --> 00:22:05,450
అంటే, లివర్పూల్ చాలా అందిస్తుంది.

408
00:22:05,534 --> 00:22:09,580
పబ్బులు మరియు క్లబ్ల నుండి,
గొప్ప ఆసియా కాలక్షేపం అయిన...

409
00:22:09,663 --> 00:22:14,042
-నేను బహుశా అన్నాను.
-బహుశా అన్నాను.

410
00:22:14,126 --> 00:22:16,545
నన్ను రక్షించేది నువ్వే

411
00:22:16,628 --> 00:22:19,339
నన్ను రక్షించేది

412
00:22:19,423 --> 00:22:23,385
ఇంకా

413
00:22:24,553 --> 00:22:29,725
నువ్వు నా అద్భుతమైన గోడ

414
00:22:30,976 --> 00:22:32,227
నేను సిగరెట్ తాగడానికి వెళ్తున్నాను.

415
00:22:32,311 --> 00:22:33,937
-నేను నీతో రావచ్చా?
-రా.

416
00:22:34,771 --> 00:22:37,149
ధన్యవాదాలు, రిచ్మండ్ ఎఫ్ సి!

417
00:22:40,027 --> 00:22:42,237
అయితే, ఈ మర్ల్బరో మాన్ సంగతి ఏంటి?

418
00:22:42,321 --> 00:22:43,947
ఎందుకంటే నాకతని చెవులు పట్టుకుని,

419
00:22:44,031 --> 00:22:46,700
అతని మీసాలు పట్టుకుని
జెట్ స్కీలా సవారీ చేయాలనుంది.

420
00:22:46,783 --> 00:22:50,120
-నిన్ను కలవడం చాలా బాగుంది, సాస్.
-నిన్ను కూడా, స్టింకీ.

421
00:22:52,289 --> 00:22:54,416
దేవుడా. ఇవాళ నా...

422
00:22:54,499 --> 00:22:57,377
అవును, నాకు తెలుసు.
నేనిక్కడికి ఎందుకు వచ్చానని అనుకున్నావు?

423
00:22:59,505 --> 00:23:00,881
మిత్రమా, నన్ను క్షమించు.

424
00:23:01,757 --> 00:23:04,968
నీ నుంచి, నోరా నుంచి
మాయామైపోయినందుకు నన్ను క్షమించు.

425
00:23:06,803 --> 00:23:07,804
నన్ను నిజంగా క్షమించు.

426
00:23:07,888 --> 00:23:10,057
అలా అన్నందుకు ధన్యవాదాలు.

427
00:23:11,517 --> 00:23:13,602
దేవుడా, అతను నా నుంచి చాలా తీసుకున్నాడు.

428
00:23:14,102 --> 00:23:15,395
కాదు.

429
00:23:15,479 --> 00:23:20,609
రూపర్ట్ ఒక ఘోరమైన వ్యక్తి, అతనొక
దంతపు కోట కట్టి నిన్ను అందులో బంధించాడు.

430
00:23:20,692 --> 00:23:25,113
కానీ ఆ కోట యొక్క ప్రతి మెట్టు
నీ అంతట నువ్వే ఎక్కావు.

431
00:23:25,989 --> 00:23:28,534
ఇంటికి రావడం, ఫోన్ చెయ్యడం
మానేసింది నువ్వే.

432
00:23:28,617 --> 00:23:31,870
ఒక ఆరేళ్ళ అమ్మాయి తనేం తప్పు చేసానా
అని అనుకునేలా చేసింది.

433
00:23:32,829 --> 00:23:34,706
నేను నీ తరపున ఎప్పుడూ వాదిస్తాను,

434
00:23:34,790 --> 00:23:37,793
కానీ నీవు పోషించిన నీ వంతు
పాత్రను నువ్వు ఒప్పుకోవాలి.

435
00:23:38,335 --> 00:23:39,461
నువ్వు సరిగ్గా చెప్పావు.

436
00:23:39,545 --> 00:23:41,046
నేను సరిగ్గా చెప్పాను.
నేను ఎప్పుడూ సరిగ్గానే చెప్తాను.

437
00:23:41,129 --> 00:23:43,090
నువ్వు అన్నిసార్లు సరిగ్గా చెప్పవు.
చాలా సార్లు నువ్వు సుత్తిదానిలా ఉంటావు.

438
00:23:43,173 --> 00:23:45,884
ఇక్కడున్నారు. అబ్బా.
మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళారనుకున్నాను.

439
00:23:45,968 --> 00:23:47,427
-లేదు!
-అదెలా!

440
00:23:47,511 --> 00:23:51,390
దేవుడా, ఇప్పటివరకు నాకు పరిత్యాగ సమస్యలు
ఉన్నాయని నాకు తెలియదు.

441
00:23:51,473 --> 00:23:53,100
పద, రెబెక్కా. తరువాత నీ పాట.

442
00:23:53,183 --> 00:23:54,101
-ఏంటి?
-అవును.

443
00:23:54,184 --> 00:23:55,644
లేదు, నేను పాట మీ ఇవ్వలేదు.

444
00:23:55,727 --> 00:23:58,355
అయితే, నీ బదులు ఎవరో చేసి ఉంటారు.

445
00:23:59,439 --> 00:24:00,774
అలా ఎవరు చేసి ఉండవచ్చు?

446
00:24:00,858 --> 00:24:03,110
చూసావా? నువ్వు సుత్తిదానివి.

447
00:24:03,193 --> 00:24:05,737
చెడ్డ శృంగారంలో చిక్కుకున్నారు

448
00:24:11,910 --> 00:24:14,288
మీ చెడు శృంగారం కావాలి

449
00:24:18,667 --> 00:24:19,668
సరే, తరువాత ఎవరు?

450
00:24:19,751 --> 00:24:21,211
నేను, నేను, నేను.

451
00:24:22,087 --> 00:24:24,298
నీ వంతు, రెబెక్కా. ఇక్కడికి రా.

452
00:24:24,381 --> 00:24:27,134
ధన్యవాదాలు. దేవుడా.

453
00:24:27,217 --> 00:24:30,470
సరే. నేను ఏ పాట పాడుతున్నానో
కూడా నాకు తెలియదు.

454
00:24:30,554 --> 00:24:34,224
కానీ ఈ పాటను ఒక అమ్మాయికి ఉండగల
ప్రాణ స్నేహితురాలికి అంకితం చేస్తున్నాను.

455
00:24:34,308 --> 00:24:35,976
అది నేనే! ఆమె నా గురించే మాట్లాడుతోంది!

456
00:24:43,025 --> 00:24:46,028
ఇది నా గాడ్ డాటర్ నోరాకి
కూడా అంకితం చేస్తున్నాను.

457
00:24:46,653 --> 00:24:47,654
ఐ లవ్ యు.

458
00:26:20,122 --> 00:26:22,165
-టెడ్.
-నాన్నా?

459
00:26:22,666 --> 00:26:23,750
టెడ్?

460
00:26:25,085 --> 00:26:26,086
టెడ్.

461
00:26:29,631 --> 00:26:30,924
అంతా బాగానే ఉంది.

462
00:26:31,550 --> 00:26:32,593
ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించు.

463
00:26:32,676 --> 00:26:37,097
నేను తీసుకోలేను. నాకు ఏమవుతోందో
తెలియడం లేదు. నన్ను క్షమించండి.

464
00:26:37,181 --> 00:26:40,559
అంతా బాగానే ఉంది.
మీకు పానిక్ అటాక్ అయింది. ఊపిరి తీసుకోండి.

465
00:26:42,644 --> 00:26:43,979
నాకు పిచ్చెక్కుతోందా?

466
00:26:44,897 --> 00:26:46,398
అందరికీ ఎక్కుతున్న దానికన్నా కాదు.

467
00:26:49,276 --> 00:26:50,777
సరే. మీరు బాగానే ఉన్నారు.

468
00:26:52,613 --> 00:26:57,868
అదుగో. అదుగో. అదుగో.

469
00:27:05,876 --> 00:27:06,960
అదుగో.

470
00:27:07,711 --> 00:27:09,463
నేను ఇక వెళతాను.

471
00:27:09,546 --> 00:27:13,008
నేను హోటల్ కి వెళ్లి, రాత్రికి
విశ్రాంతి తీసుకుంటాను, సరేనా?

472
00:27:13,091 --> 00:27:15,010
నన్ను మీతో రమ్మంటారా?

473
00:27:15,886 --> 00:27:16,887
మీరు నా కార్ తీసుకువెళతారా?

474
00:27:16,970 --> 00:27:19,848
వద్దు, వద్దు, వద్దు. నేను బాగానే ఉన్నాను.
అయినా, ధన్యవాదాలు. ఇందుకు ధన్యవాదాలు.

475
00:27:19,932 --> 00:27:21,683
-సరే.
-అలాగే.

476
00:27:26,313 --> 00:27:29,608
హే, నాకొక సహాయం చెయ్యండి. నేను హోటల్ కి
తిరిగి వెళ్లానని బియర్డ్ కి చెప్పండి.

477
00:27:29,691 --> 00:27:32,236
తప్పకుండా.
మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి.

478
00:27:32,319 --> 00:27:33,654
-సరే, ధన్యవాదాలు.
-సరే.

479
00:27:34,446 --> 00:27:35,697
సరే.

480
00:28:52,524 --> 00:28:55,110
-జరగండి. ఒక తాగిన వ్యక్తి వస్తున్నాడు.
-సరే.

481
00:28:55,194 --> 00:28:58,447
వినండి. వినండి, వినండి, వినండి. మనం వీరిని
పబ్ కి తీసుకువెళితే బాగుంటుందనుకుంటాను.

482
00:28:58,822 --> 00:29:01,742
నేను అలసిపోయాను, సాస్. నన్ను క్షమించు.

483
00:29:01,825 --> 00:29:03,911
నేను కూడా ఈ సాయంత్రాన్ని
ముగిద్దామని అనుకుంటున్నాను.

484
00:29:03,994 --> 00:29:08,081
అయితే, నేను ఒక్కదాన్నే 18 మంది
అందమైన యువకులను తీసుకువెళ్ళాలా?

485
00:29:08,165 --> 00:29:09,958
అబ్బా, ఎంత బాధ.

486
00:29:10,042 --> 00:29:12,419
-సరే, అయితే. మళ్ళీ కలుస్తాను.
-బై. ఐ లవ్ యు.

487
00:29:12,503 --> 00:29:15,422
మిత్రులారా, నాకు నా పూల పూల
షర్టు కనిపించడం లేదు.

488
00:29:15,506 --> 00:29:17,841
-అతను ఎంత తాగి ఉన్నాడో.
-నీకది అవసరం లేదు. నీకది అవసరం లేదు.

489
00:29:18,759 --> 00:29:20,427
అయితే, హోటల్ కి లిఫ్ట్ కావాలా?

490
00:29:20,511 --> 00:29:24,765
వద్దు. నేను నడిచి వెళదామనుకుంటున్నాను.

491
00:29:29,061 --> 00:29:31,021
నువ్వు నన్ను నీతో రమ్మని
అడిగితే తప్ప. నేనది చేయగలను.

492
00:29:31,104 --> 00:29:33,357
-బాగానే ఉన్నాను. నిజంగా.
-అవునా?

493
00:29:33,440 --> 00:29:35,526
అదీ కాక, అది నిన్న.

494
00:29:37,778 --> 00:29:40,280
-నీ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నావు.
-సరే, సరే. వెళ్తున్నాను. వెళ్తున్నాను.

495
00:30:00,467 --> 00:30:01,635
ఇది నా గది.

496
00:30:02,678 --> 00:30:06,348
నేను రెబెక్కాతో కలిసి స్వీట్ లో ఉంటున్నాను
కాకపోతే మా బెడ్ రూమ్స్ వేరు.

497
00:30:22,990 --> 00:30:24,074
గుడ్ నైట్.

498
00:30:47,848 --> 00:30:49,641
టెడ్ లాసో -ఇవాళ రాత్రి అంత దయగా ఉన్నందుకు
ధన్యవాదాలు. కేవలం ఇవాళ రాత్రే కాదు.

499
00:30:49,725 --> 00:30:51,727
ఈ మొత్తం సాహసంలో.
ఇది నిజంగా వేరుగా ఉంది.

500
00:31:58,919 --> 00:32:00,921
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి

