1
00:00:09,259 --> 00:00:10,886
టార్ట్, చివరికి వచ్చేసాడు.

2
00:00:11,637 --> 00:00:14,431
అతను ఎవరికైనా పాస్ చేయచ్చు.
రోహాస్ ని ఎంచుకున్నాడు.

3
00:00:16,058 --> 00:00:18,477
అద్భుతమైన గోల్! గొప్ప ముగింపు.

4
00:00:18,560 --> 00:00:21,313
ఈ సీజన్ వారు మొదలు
పెట్టినప్పటి స్థితి నుంచి చూస్తే,

5
00:00:21,396 --> 00:00:24,066
ఈరిచ్మండ్ టీమ్ ని అస్సలు
గుర్తుపట్టలేమని ఒప్పుకోవాలి, క్రిస్.

6
00:00:24,149 --> 00:00:27,569
ఏ ఎఫ్ సి రిచ్మండ్ ఎంత బాగా ఆడుతోంది!

7
00:00:27,653 --> 00:00:30,656
ఆ డానీ రోహాస్ గోల్ తో, ఇప్పుడు రిచ్మండ్
వరుసగా నాలుగు గేములు గెలిచింది.

8
00:00:30,739 --> 00:00:31,823
ఫోర్జా లవ్ ఆఫ్ ది గేమ్

9
00:00:31,907 --> 00:00:33,700
వారి మాజీ కాప్టెన్ ని
కోచింగ్ సిబ్బందిలో చేర్చిన తరువాత,

10
00:00:33,784 --> 00:00:36,620
వారి ఆటతీరు పూర్తిగా
మారిపోయింది, కదా, రైటీ?

11
00:00:36,703 --> 00:00:37,788
అవును, సీమ్స్.

12
00:00:37,871 --> 00:00:41,291
రిచ్మండ్ ఆడుతున్న విధానం చూస్తే,
మనకు రాయ్ కెంట్ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తోంది.

13
00:00:41,375 --> 00:00:45,170
ప్రీమియర్ షిప్ టోటెన్హామ్ హాట్స్పర్ తో
శనివారం జరిగే

14
00:00:45,254 --> 00:00:47,589
ఎఫ్ఏ కప్ క్వార్టర్ ఫైనల్ ఘర్షణలోకి
ఇది వారిని బాగా తీసుకువెళ్తుంది.

15
00:00:47,673 --> 00:00:48,841
అవును, అందుకు వాళ్లకి గుడ్ లక్.

16
00:00:48,924 --> 00:00:51,552
ఇలా అనడానికి బాధగా ఉంది
కానీ టోటెన్హామ్ చాలా చాలా మంచి టీమ్.

17
00:00:51,635 --> 00:00:53,136
అద్భుతమైన టీమ్.

18
00:00:53,220 --> 00:00:56,014
తరువాత,
మనం బౌర్న్ మౌత్ మరియు సౌతాంప్టన్ మధ్య

19
00:00:56,098 --> 00:00:58,308
క్వార్టర్ ఫైనల్ ప్రివ్యూ చూస్తాము.

20
00:00:58,392 --> 00:01:00,435
-టీ తాగుతావా?
-తాగుతాను.

21
00:01:03,063 --> 00:01:06,066
ఎల్.డి.ఎన్152 - తథాస్తు దేవతలను నమ్ముతానని
ఒక సహోద్యోగి వేళాకోళం చేశాడు.

22
00:01:06,149 --> 00:01:07,818
తరువాత ఏదో తట్టుకుని పడిపోయాడు
యాదృచ్చికమా?

23
00:01:07,901 --> 00:01:09,945
-పంచదార?
-వద్దు, ధన్యవాదాలు.

24
00:01:11,530 --> 00:01:16,201
లూకా, నువ్వు తథాస్తు దేవతలను
నమ్ముతావా?

25
00:01:16,285 --> 00:01:18,370
వాళ్ళు గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ లాంటి వాళ్ళా?

26
00:01:21,707 --> 00:01:23,750
ఆగు, నువ్వు వంటింట్లో నగ్నంగా ఉన్నావా?

27
00:01:24,459 --> 00:01:25,669
నేను చిరునవ్వు ధరించాను.

28
00:01:26,211 --> 00:01:27,671
బట్టలు వేసుకో!

29
00:01:28,297 --> 00:01:30,549
పనమ్మాయి, మీనా ఎప్పుడైనా రావచ్చు.

30
00:01:35,220 --> 00:01:38,182
మీనా. నువ్వు టీ తాగుతావా?

31
00:01:38,765 --> 00:01:40,392
బిస్కట్లు కూడా ఉంటాయా?

32
00:01:40,475 --> 00:01:41,476
అమ్మా.

33
00:01:42,853 --> 00:01:43,854
హలో, తల్లీ.

34
00:01:44,688 --> 00:01:45,814
నేను మీ నాన్నని వదిలేశాను.

35
00:01:47,941 --> 00:01:49,193
ఆగు, మీ అమ్మ పనమ్మాయా?

36
00:01:49,276 --> 00:01:50,277
కాదు.

37
00:01:50,944 --> 00:01:53,614
ఆయన నా మాట వినరు.
నన్ను గౌరవించరు.

38
00:01:53,697 --> 00:01:56,992
ఒక నమూనాను రూపొందించడానికి
ఇద్దరు కావాలని,

39
00:01:57,075 --> 00:01:58,577
కానీ దాన్ని మార్చడానికి ఒకరే
చాలని ఎస్తర్ పెరెల్ చెప్పారు.

40
00:01:59,828 --> 00:02:01,205
ఆ మార్పుని నేనే.

41
00:02:01,288 --> 00:02:02,706
మంచిది.

42
00:02:03,415 --> 00:02:05,918
లూకా, దయచేసి బట్టలు వేసుకుంటావా?

43
00:02:12,132 --> 00:02:13,550
నేను ఆ గదితో మొదలు పెడతాను.

44
00:02:14,301 --> 00:02:15,594
ధన్యవాదాలు.

45
00:02:39,451 --> 00:02:41,620
ఏ.ఎఫ్.సి రిచ్మండ్ కి స్వాగతం

46
00:02:41,703 --> 00:02:44,915
హే, లీజా.
ఆదివారం నీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసాను.

47
00:02:44,998 --> 00:02:46,708
ఆ ఐస్ బకెట్ చాలెంజ్ బాగా చేశావు.

48
00:02:46,792 --> 00:02:48,794
-గుడ్ మార్నింగ్.
-హే, డెరెక్.

49
00:02:52,297 --> 00:02:53,423
అద్భుతమైన ఉదయం, ఇసాబెల్.

50
00:02:53,507 --> 00:02:54,591
-అవును.
-హే, టెడ్.

51
00:02:54,675 --> 00:02:56,677
హే, లియాం. మీ అమ్మకి నా తరఫు నుంచి
హ్యాపీ బర్త్ డే అని చెప్పు.

52
00:02:56,760 --> 00:02:59,847
నువ్వు ఆమెకి ఇచ్చే బహుమతి
మన ఇద్దరినుంచి అని చెప్పు, సరేనా?

53
00:03:03,767 --> 00:03:05,227
-గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు?
-గుడ్ మార్నింగ్.

54
00:03:05,936 --> 00:03:08,397
నువ్వు బాగా చేస్తున్నావు, కాలిన్.
నీ కొత్త మంత్రం నాకు నచ్చింది.

55
00:03:08,480 --> 00:03:11,233
నేను బలవంతుడిని, సమర్థుడిని.
నేను చెత్త కాదు.

56
00:03:11,316 --> 00:03:13,402
-ఆ రెండో మాట అవసరం లేదు.
-సరే.

57
00:03:13,485 --> 00:03:14,695
-గుడ్ మార్నింగ్, కాలిన్.
-హే.

58
00:03:14,778 --> 00:03:16,446
హే, డాక్.
రాత్రి ఏమైనా చేశారా?

59
00:03:17,030 --> 00:03:18,699
చేసాను కానీ అది ఆఫీసులో చెప్పేది కాదు.

60
00:03:19,366 --> 00:03:21,410
డాక్, ఏరియా 51 లో
స్యూ గ్రాఫ్టన్ నవల చదివిన

61
00:03:21,493 --> 00:03:23,912
డేవిడ్ బ్లెయిన్ కంటే మీరు చాలా
రహస్యంగా ఉన్నారు.

62
00:03:23,996 --> 00:03:26,331
టెడ్, మీరు మాట్లాడాలనుకున్నప్పుడు
అపాయింట్మెంట్ తీసుకోండి.

63
00:03:26,415 --> 00:03:27,624
హే, నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను, డాక్.

64
00:03:27,708 --> 00:03:29,293
మిమ్మల్ని పది నిముషాలు అనుసరించనివ్వండి.

65
00:03:29,376 --> 00:03:30,794
ఐదు నిమిషాల తరువాత,
మీరే నన్ను మాట్లాడద్దంటారు.

66
00:03:31,795 --> 00:03:33,630
-ఇక్కడ చూడండి.
-గుడ్ మార్నింగ్, టెడ్.

67
00:03:33,714 --> 00:03:36,216
హే. మీ ఇద్దరూ ఒక జంటని అంటాను.

68
00:03:37,384 --> 00:03:38,594
నేను హెచ్ ఆర్ కి ఫోన్ చేస్తాను.

69
00:03:38,677 --> 00:03:40,429
మిస్టర్ పఫ్ ఎన్ స్టఫ్ కి
హలో చెప్పానని చెప్పండి.

70
00:03:41,054 --> 00:03:44,600
అది 70లలో పుట్టిన వారి కోసం ఒక జోక్.

71
00:03:44,683 --> 00:03:48,395
వాళ్ళు టార్టెలిని ఆకారం మార్చి…

72
00:03:49,146 --> 00:03:52,858
మీ సంగతి నాకు తెలియదు కానీ ఈ ఎఫ్ఏ కప్
గురించి నాకు చాలా ఉత్సాహంగా ఉంది.

73
00:03:52,941 --> 00:03:54,026
అబ్బా, ఇది బాగుంది.

74
00:03:54,109 --> 00:03:56,570
మన సీజన్ మధ్యలో
మన దేశంలో ఉన్న ప్రతి టీమ్ ఆడే

75
00:03:56,653 --> 00:03:58,864
ఒక మార్చ్ మాడ్నెస్ టోర్నమెంట్?

76
00:03:58,947 --> 00:04:00,407
అవును.

77
00:04:00,490 --> 00:04:02,868
అంటే, ఇదేంటి?
డేవిడ్స్ వెర్సస్ గొలాయత్ ఆ?

78
00:04:02,951 --> 00:04:05,996
అవునా? రాకీస్ వెర్సస్ అపోలోస్.
స్టీవ్ వైబ్స్ వెర్సస్ నిల్లీ మిచెల్స్.

79
00:04:06,079 --> 00:04:08,332
-ఇంకొకటి ఏంటి, కోచ్?
-పర్ల్ జామ్ వెర్సస్ టికెట్ మాస్టర్.

80
00:04:08,415 --> 00:04:11,084
ఆ సాంప్రదాయ కళలు వెర్సస్ వ్యాపారం. అవును.

81
00:04:11,168 --> 00:04:12,419
మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి.

82
00:04:12,503 --> 00:04:15,547
ప్రీమియర్ లీగ్ లో లేని టీమ్,
మనలాంటి టీమ్, ఎపుడైనా దీన్ని గెలిచిందా?

83
00:04:15,631 --> 00:04:17,673
-ఎనిమిది సార్లు.
-ఎనిమిది సార్లు. నిజంగా?

84
00:04:17,757 --> 00:04:19,134
కానీ 40 ఏళ్లలో కాదు.

85
00:04:20,302 --> 00:04:21,637
ఇక్కడ ఏంటిది?

86
00:04:21,720 --> 00:04:23,805
ఆహ్-ఓహ్. నువ్వు మళ్ళీ తిరిగే
ఆఫీసు మోడ్ లోకి వచ్చేసావా, హా?

87
00:04:23,889 --> 00:04:25,557
అవును. కానీ, ఇదేమీ ఇబ్బంది కాదు.

88
00:04:25,641 --> 00:04:27,643
నేను స్వభావసిద్ధంగా ఒక ఫ్లానూర్ ని.

89
00:04:28,268 --> 00:04:29,269
హా. నాకు అర్థం అయింది, అవును.

90
00:04:29,353 --> 00:04:30,771
హే, కోచ్, ఫ్లానూర్ అంటే ఏంటి?

91
00:04:30,854 --> 00:04:32,105
ఒక సంచారి.

92
00:04:32,898 --> 00:04:35,567
-నీకేమైంది?
-ఏమీ కాలేదు.

93
00:04:37,069 --> 00:04:38,487
జేన్, నేను మళ్ళీ ఒకటయ్యాము.

94
00:04:39,238 --> 00:04:40,614
-బాగుంది.
-అది చాలా బాగుంది.

95
00:04:40,697 --> 00:04:43,158
-అద్భుతం.
-అది చాలా బాగుంది. మిమ్మల్ని చూడండి.

96
00:04:43,659 --> 00:04:45,536
ఇది నిజంగా మంచి ఆలోచన అనుకుంటావా?

97
00:04:53,460 --> 00:04:55,337
అబ్బా. ఆమె నుంచి రెండు మిస్డ్ కాల్స్.

98
00:04:55,420 --> 00:04:56,547
ఇప్పుడే వస్తాను!

99
00:04:58,757 --> 00:05:01,760
నేను డైమండ్ డాగ్స్ యొక్క అత్యవసర
సమావేశాన్ని అభ్యర్థించాలనుకుంటున్నాను.

100
00:05:01,844 --> 00:05:03,095
డైమండ్ డాగ్స్, రండి.

101
00:05:04,471 --> 00:05:06,598
-హే, రాయ్, మాతో కూర్చుంటావా?
-కూర్చోను.

102
00:05:06,682 --> 00:05:08,308
సరే. అది మూసేయ్.

103
00:05:10,686 --> 00:05:11,687
అతను కొంచెం...

104
00:05:11,770 --> 00:05:14,356
నువ్వు ఇక్కడి నుంచి వస్తున్నావా.
అది సరే. నేను పట్టుకుంటాను.

105
00:05:14,439 --> 00:05:15,607
అది... నువ్వు...

106
00:05:15,691 --> 00:05:16,650
డ్యూక్స్ ఆఫ్ హాజర్డ్ స్టైల్ లో,

107
00:05:16,733 --> 00:05:18,735
లేదా మీరు దీన్ని "ఎర్ల్స్ ఆఫ్ రిస్క్"
అని అంటారేమో.

108
00:05:18,819 --> 00:05:21,071
-చుట్టూ తిరిగి రండి.
-ఆ, సరే. ముందు కాళ్ళు పెడతారా?

109
00:05:21,154 --> 00:05:22,406
నువ్వు... నువ్వు లోపలికి దూకుతావా?

110
00:05:22,489 --> 00:05:24,366
చుట్టూ తిరిగి వచ్చుంటే
ఈ పాటికి లోపల ఉండేవాడివి.

111
00:05:24,449 --> 00:05:26,618
-రెడీ? వచ్చేస్తున్నాడు. సరిగ్గా...
-నేను ఇక్కడే ఉంటాను.

112
00:05:26,702 --> 00:05:28,370
సరే. మంచి ఐడియా. అదే మంచిదేమో.

113
00:05:28,453 --> 00:05:32,082
అలాగే. సరే, హిగ్గీబాటమ్స్, నువ్వు ఈ మీటింగ్
పిల్చావు, అందుకని మాట్లాడడం మొదలు పెట్టు.

114
00:05:32,165 --> 00:05:35,836
జేన్, బియర్డ్ కలిసి ఉండడం
మంచి ఆలోచన అని నేను అనుకోను.

115
00:05:35,919 --> 00:05:37,754
నేనలా అన్నప్పుడు మీరు ఏమీ మాట్లాడనందుకు

116
00:05:37,838 --> 00:05:40,132
నాకు చాలా నిరాశగా ఉంది.

117
00:05:41,717 --> 00:05:42,885
సరే. మా తప్పు చెప్తున్నావు.

118
00:05:42,968 --> 00:05:45,053
అందుకు ధన్యవాదాలు,
నువ్వు అనేది వింటున్నాను, కానీ...

119
00:05:45,137 --> 00:05:48,015
నేను ఎందుకు ఏమీ అనలేదో నాకు తెలుసు.

120
00:05:48,098 --> 00:05:50,726
-ఎందుకని?
-ఎందుకంటే మనం ఎప్పుడూ మీ అనకూడదు.

121
00:05:50,809 --> 00:05:52,603
చూడు, నేనది కష్టంగా తెలుసుకున్నాను.

122
00:05:52,686 --> 00:05:55,647
నా స్నేహితుడు ఒకతను ఉండేవాడు,
అతని పేరు మార్కస్ గిరార్డ్.

123
00:05:55,731 --> 00:05:59,443
అతను హైస్కూల్ నుంచి కాలేజీ వరకు
ఒకే అమ్మాయిని డేట్ చేసాడు.

124
00:05:59,526 --> 00:06:02,529
నిజం చెప్పాలంటే, ఆమె అంత
ఆహ్లాదకరమైన వ్యక్తి కాదు, సరేనా?

125
00:06:02,613 --> 00:06:03,864
ఇప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు.

126
00:06:03,947 --> 00:06:06,825
ఇంకా, నేను అతనికి ఆ సంగతి చెప్పాను.
అతనికది చెప్పాను.

127
00:06:06,909 --> 00:06:09,328
అతనికి కోపం వచ్చింది, సరేనా?

128
00:06:09,411 --> 00:06:11,830
నేను బెస్ట్ మ్యాన్ స్పీచ్
ఇవ్వడం అదే చివరి సారి.

129
00:06:11,914 --> 00:06:15,417
అంటే, నేను బయట నుంచి
అన్ని సంబంధాలు బాగున్నాయని అంటాను,

130
00:06:15,501 --> 00:06:17,711
ఎందుకంటే మా నాన్న
నా మొదటి ప్రేమను నాశనం చేశారు.

131
00:06:18,462 --> 00:06:21,632
నాలుగో క్లాసులో ఆయన నన్ను,
నా క్లాస్ మేట్ నాడియా షూకమ్స్ ని కూర్చోబెట్టి

132
00:06:21,715 --> 00:06:24,134
మాకు ఇంతకన్నా మంచి
వారు దొరుకుతారని చెప్పారు.

133
00:06:25,469 --> 00:06:27,137
తను ఆయన మాట వింది.

134
00:06:27,221 --> 00:06:29,598
అబ్బా, అలాంటి నిజం
మనం వినాలని అనుకోము.

135
00:06:29,681 --> 00:06:30,849
అవును. నాకు తెలుసు.

136
00:06:30,933 --> 00:06:32,851
విను, హిగ్గిన్స్,
మరొకరి విషయంలో

137
00:06:32,935 --> 00:06:35,604
తల దూర్చడం మనకు సంబంధం లేని
విషయం అనుకుంటాను, సరేనా?

138
00:06:36,230 --> 00:06:38,065
సరే, అర్థమయింది.

139
00:06:39,775 --> 00:06:42,736
బియర్డ్ ఇక్కడ లేడు కాబట్టి
ఇది అనధికారిక మీటింగ్ అయినా,

140
00:06:42,819 --> 00:06:44,655
మనం డైమండ్ డాగ్స్ మీటింగ్ ముగిద్దాం.

141
00:06:49,618 --> 00:06:51,161
పిచ్చి మొరుగుడు వినిపించిందంటే
అది అయిపోయిందని కదా అర్థం?

142
00:06:51,245 --> 00:06:52,246
అవును, సర్. మీకు పునఃస్వాగతం.

143
00:06:52,329 --> 00:06:54,998
-ఆయ్, ఆయ్, ఆయ్. అది ఊహించలేదు.
-ఏమైంది?

144
00:06:55,082 --> 00:06:57,709
జేన్ రూమ్ మేట్ ఆమెని ఖాళీ చెయ్యమంటోంది.

145
00:06:57,793 --> 00:06:59,253
-ఆమెని ఇంట్లోంచి పంపించేసింది.
-అయ్యో.

146
00:06:59,336 --> 00:07:01,547
అందుకని ఆమె నాతో ఉంటుంది.

147
00:07:02,422 --> 00:07:03,257
అది మంచిది.

148
00:07:03,340 --> 00:07:05,092
అది మంచి సమాచారం. కంగ్రాచ్యులేషన్స్.

149
00:07:06,260 --> 00:07:08,011
ధన్యవాదాలు.

150
00:07:18,814 --> 00:07:20,607
పైకి చూడండి, అబ్బాయిలు.

151
00:07:20,691 --> 00:07:22,484
బాగా ఆడు, కాలిన్. వెధవ.

152
00:07:23,652 --> 00:07:25,863
కాలిన్, నువ్వు మరీ వెనక్కి ఒంగుతున్నావు.

153
00:07:25,946 --> 00:07:27,614
తల కిందకి ఒంచి, బాల్ ని కిక్ చెయ్యి.

154
00:07:29,032 --> 00:07:30,951
నేను బలవంతుడిని, సమర్థుడిని.

155
00:07:31,034 --> 00:07:32,286
ధన్యవాదాలు, రాయ్.

156
00:07:32,369 --> 00:07:34,329
బాంబర్కాచ్, బాగా పాస్ చేశావు,

157
00:07:34,413 --> 00:07:36,248
కానీ వాళ్ళకది తెలిస్తే,
దాని వల్ల లాభం ఉండదు.

158
00:07:36,331 --> 00:07:38,333
మిగతావారందరూ గోల్ బాక్స్ లోకి వెళ్లి,
బాల్ ని కిక్ చేసినప్పుడు,

159
00:07:38,417 --> 00:07:39,835
దాని వెనకే వెళ్ళండి.

160
00:07:39,918 --> 00:07:42,004
అవును, మీకు వాసన వస్తోందా, అబ్బాయిలు?

161
00:07:42,087 --> 00:07:43,380
అది రాయ్ కెంట్ ప్రభావం.

162
00:07:45,424 --> 00:07:48,385
-రాయ్ కెంట్! రాయ్ కెంట్!
-రాయ్ కెంట్!

163
00:07:53,640 --> 00:07:54,850
నాకేమైనా చెప్తారా, కోచ్?

164
00:07:57,811 --> 00:07:58,979
సరే, మళ్ళీ మొదలుపెడదాం.

165
00:08:02,941 --> 00:08:05,611
హే, రాయ్. టీమ్ అంతటినీ కోచ్ చేయడానికి
నీకు జీతం ఇస్తున్నారు, కాదా?

166
00:08:06,111 --> 00:08:09,031
లేదు, అది పరవాలేదు.
నా జీతంలోంచి 4 శాతం తగ్గించండి.

167
00:08:09,656 --> 00:08:10,657
టెడ్!

168
00:08:11,408 --> 00:08:12,951
-టెడ్!
-మీకది వినిపించిందా?

169
00:08:14,953 --> 00:08:16,038
హే!

170
00:08:16,121 --> 00:08:18,373
నీకు లంచ్ ప్లాన్ ఏమైనా ఉందా?

171
00:08:18,457 --> 00:08:20,501
నిజానికి, ఉంది.

172
00:08:20,584 --> 00:08:23,670
నేను, కోచ్ బియర్డ్ ప్రతి శుక్రవారం

173
00:08:23,754 --> 00:08:24,922
సీక్రెట్ సాండ్విచ్ స్విచరూ చేస్తాం.

174
00:08:25,005 --> 00:08:28,217
-మేము ఏం చేస్తామంటే, నేనొక సాండ్విచ్ చేసి...
-నాకు అనవసరం, టెడ్.

175
00:08:28,300 --> 00:08:30,844
నువ్వు నాతో, మా అమ్మతో
లంచ్ కి వస్తున్నావు.

176
00:08:30,928 --> 00:08:32,095
సరే. బాగుంది.

177
00:08:33,263 --> 00:08:35,097
నేను ముందే చేప్పేస్తున్నాను.
నీకు బిఎల్టి సాండ్విచ్ చేసాను,

178
00:08:35,182 --> 00:08:36,767
-నేనూ అదే చేశాను.
-ఇంకా నయం?

179
00:08:37,267 --> 00:08:39,977
క్రౌన్ & ఆంకర్ వద్ద రెండింటికి.

180
00:08:40,062 --> 00:08:41,063
సరే.

181
00:08:42,022 --> 00:08:44,983
నీతో కలిసి భోజనం చేయడానికి
ఎదురు చూస్తున్నాను, టెడ్.

182
00:08:45,067 --> 00:08:46,777
హాయ్, రెబెక్కా వాళ్ళ అమ్మ.

183
00:08:46,860 --> 00:08:48,362
హే, అబ్బాయిలు. హాయ్ చెప్పండి.

184
00:08:48,445 --> 00:08:50,405
హాయ్, రెబెక్కా వాళ్ళ అమ్మ.

185
00:08:50,489 --> 00:08:51,907
హలో, అబ్బాయిలు.

186
00:08:51,990 --> 00:08:55,077
నా పేరు రెబెక్కా వాళ్ళ అమ్మ కాదు.
నా పేరు డెబ్రా.

187
00:08:55,160 --> 00:08:56,995
నేను మెరుగుగా అవుతున్నాను,

188
00:08:57,079 --> 00:08:59,790
టేపులు బాగా వింటాను,

189
00:08:59,873 --> 00:09:03,961
ఇంకా జీవితం మీకు నిమ్మకాయలు ఇస్తే,

190
00:09:04,044 --> 00:09:06,880
లెమన్ లావెండర్ మొహీతోలు
చేసుకోవాలని నమ్ముతాను.

191
00:09:06,964 --> 00:09:07,965
అమ్మా!

192
00:09:08,757 --> 00:09:10,509
మిమ్మల్ని కలవడం బాగుంది, డెబ్రా.

193
00:09:12,219 --> 00:09:14,805
నాకు అందరి తల్లులని కలవడం ఇష్టం.

194
00:09:14,888 --> 00:09:17,474
వాళ్లలా ఎందుకుంటారో తెలియడానికి
అది ఒక మాన్యువల్ లా ఉంటుంది.

195
00:09:17,558 --> 00:09:19,476
పదండి వెళ్దాం!

196
00:09:20,102 --> 00:09:21,562
మిసెస్ బియర్డ్ ఎలా ఉంది?

197
00:09:21,645 --> 00:09:23,605
-బాగా ఉత్సాహంగా ఉంది.
-సరే.

198
00:09:26,108 --> 00:09:27,609
ఫుట్ బాల్ అగైన్స్ట్ ది ఎనిమీ
సైమన్ కుపర్

199
00:09:27,693 --> 00:09:30,279
-హే, పట్టుకోండి, కోచ్.
-ధన్యవాదాలు.

200
00:09:30,946 --> 00:09:32,823
-ముల్లంగి లేదా?
-నీకు దానితో అలెర్జీ అనుకున్నాను?

201
00:09:32,906 --> 00:09:34,157
గుర్రాలకి, ముల్లంగులకి.

202
00:09:34,241 --> 00:09:35,242
క్షమించు.

203
00:09:35,784 --> 00:09:37,077
-హాయ్.
-హే.

204
00:09:37,160 --> 00:09:40,205
ఓయ్, టెడ్. భోజనం తరువాత తిరిగి
వచ్చేటప్పుడు నువ్వు కార్ డ్రైవ్ చేస్తావా?

205
00:09:40,289 --> 00:09:41,415
సరే, చేస్తాను.

206
00:09:41,498 --> 00:09:43,166
నేను మధ్యాహ్నం ఒక సృజనాత్మక పని
చేద్దామనుకుంటున్నాను,

207
00:09:43,250 --> 00:09:44,626
అందుకు కొంచెం తాగి ఉంటే, బాగా వస్తుంది.

208
00:09:44,710 --> 00:09:47,379
-అన్ని చోట్లా అది మంచి ఐడియాలా ఉంది.
-ధన్యవాదాలు.

209
00:09:48,964 --> 00:09:50,257
ఒక్క క్షణం.

210
00:09:50,340 --> 00:09:51,341
హలో?

211
00:09:52,176 --> 00:09:53,177
అది నేనే.

212
00:09:54,386 --> 00:09:56,638
వాడు... వాడు బానే ఉన్నాడా?

213
00:09:58,765 --> 00:10:00,434
సరే. సరే. నేను...

214
00:10:00,517 --> 00:10:03,061
అంటే, అది కొంచెం కష్టం అవుతుంది,
ఎందుకంటే నేను ఆఫీసులో ఉన్నాను.

215
00:10:04,229 --> 00:10:05,522
లేదు, నేను లండన్ లో పని చేస్తాను.

216
00:10:06,023 --> 00:10:07,900
అవును, అది చాలా దూరం.

217
00:10:07,983 --> 00:10:10,611
నేను మా ఆవిడకి...
వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాను,

218
00:10:10,694 --> 00:10:11,945
ఆ తరువాత చూస్తాను...

219
00:10:13,322 --> 00:10:14,573
ఆమె వస్తోందా?

220
00:10:15,073 --> 00:10:17,784
సరే మంచిది.
సమస్య తప్పిపోయింది.

221
00:10:17,868 --> 00:10:20,579
సరే. అలాగే. బై.

222
00:10:23,498 --> 00:10:24,917
అంతా బానే ఉందా?

223
00:10:25,542 --> 00:10:26,543
బానే ఉంది.

224
00:10:26,627 --> 00:10:29,338
లేదు, హెన్రీ తన ఫీల్డ్ ట్రిప్ కి లంచ్
తీసుకు వెళ్ళడం మర్చిపోయాడట.

225
00:10:29,421 --> 00:10:31,548
కానీ, మిచెల్ వచ్చింది.
అందుకని, అవును, అంతా బానే ఉంది.

226
00:10:33,467 --> 00:10:34,510
హాయ్, కీలీ.

227
00:10:34,593 --> 00:10:36,762
నాకు కోచింగ్ ఇవ్వాలని
మీరు రాయ్ కి చెప్పాలి.

228
00:10:37,429 --> 00:10:39,932
ఆగు. రాయ్ కెంట్ కి
ఏం చెయ్యాలో నన్ను చెప్పమంటున్నావా?

229
00:10:40,015 --> 00:10:42,434
-అది మంచి ఐడియా.
-అతనికది నచ్చుతుంది.

230
00:10:42,518 --> 00:10:44,937
అవును, రాయ్ నాకు తన జీవితం గురించి
చెప్పి, నా సలహా అడిగినప్పుడు,

231
00:10:45,020 --> 00:10:47,898
నేను దాన్ని మా సంభాషణలలో చేరుస్తాను.

232
00:10:52,486 --> 00:10:53,779
ఫిలిస్టైన్స్!

233
00:10:53,862 --> 00:10:55,781
-ఫిలిస్టైన్స్.
-నేను సహాయం కోసం అడుగుతున్నాను.

234
00:10:55,864 --> 00:10:57,533
జేమీ, నీకు, రాయ్ కి ఒక చరిత్ర ఉంది.

235
00:10:57,616 --> 00:10:59,409
మీరిద్దరూ కలిసి అమ్మాయిల్లా మాట్లాడుకోవాలి.
సరేనా?

236
00:11:00,744 --> 00:11:01,995
మీ ఉద్దేశం, అబ్బాయిల్లానా.

237
00:11:02,829 --> 00:11:05,707
లేదు, మీరు చాలా కాలం
అబ్బాయిలలా చేసారు. అదేమీ పని చేయలేదు కదా.

238
00:11:05,791 --> 00:11:07,960
కీలీ, ఈ అర్థ నగ్న యువకుడికి
రాయ్ తో ఎలా ఉండాలన్న విషయంలో

239
00:11:08,043 --> 00:11:09,461
సలహా ఏమైనా ఇస్తావా?

240
00:11:09,545 --> 00:11:10,712
నేను ఒప్పుకుంటాను.

241
00:11:11,588 --> 00:11:13,715
ఆ ప్రశ్నకి అది తికమక కలిగించే సమాధానం. కాదా?

242
00:11:14,633 --> 00:11:16,051
లేదు, అంటే, నేను రాయ్ చెప్పేది ఒప్పుకుంటాను.

243
00:11:16,593 --> 00:11:18,470
అతను ఏం చెప్తే దానికి ఒప్పుకో.

244
00:11:18,554 --> 00:11:20,472
అది అతనిలోంచి ఆ కోపాన్ని తీసేస్తుంది.

245
00:11:21,974 --> 00:11:23,475
-మనం వెళ్దామా?
-అలాగే, మేడం.

246
00:11:24,351 --> 00:11:26,562
-సరే. బై
-బై, జేమీ!

247
00:11:34,903 --> 00:11:36,405
మీతో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు.

248
00:11:37,489 --> 00:11:38,866
అయితే అది పనిచేస్తోంది.

249
00:11:42,369 --> 00:11:44,663
నువ్వు "ఫిలిస్టైన్స్" అర్థం ఏంటో చూడు.

250
00:11:48,834 --> 00:11:51,211
ఫుల్లర్ స్మిత్ & టర్నర్స్
చిస్విక్ ఏల్స్ & స్టౌట్స్

251
00:11:51,295 --> 00:11:54,965
జీవితం చాలా పెద్దది ఇంకా
చాలా చిన్నది కూడా అని మీరు అనుకునే

252
00:11:55,048 --> 00:11:56,550
పరిస్థితి ఎదురవుతుంది.

253
00:11:57,593 --> 00:11:59,344
కొన్నిసార్లు అది ఏదీ కాదు.

254
00:11:59,428 --> 00:12:03,473
కానీ అది ఎప్పుడూ, అది ఏంటో అదే, సరేనా?

255
00:12:04,141 --> 00:12:07,895
నేనాయన కళ్ళలోకి చూసి,
"పాల్, నేను నిన్ను వదిలేస్తున్నాను.

256
00:12:08,937 --> 00:12:12,316
నేను నా మంచి జీవితం జీవించబోతున్నాను,

257
00:12:12,399 --> 00:12:15,903
నేను జీవించగలిగినంత కాలం,
నేను చచ్చిపోయేంత వరకు.

258
00:12:16,445 --> 00:12:18,197
లేదా నన్ను ఎవరైనా హత్య చేసేవరకు."

259
00:12:20,782 --> 00:12:23,493
ఆ తరువాత, నేను లేచి నుంచుని,
టాయ్లెట్ ఫ్లష్ చేసి,

260
00:12:23,577 --> 00:12:26,830
పాంట్ పైకి లాక్కుని,
అక్కడి నుంచి వచ్చేసాను.

261
00:12:26,914 --> 00:12:29,958
-అది అద్భుతం. ప్రేరణ ఇచ్చేదిగా ఉంది.
-అవును.

262
00:12:30,042 --> 00:12:31,418
మీరొక టెడ్ టాక్ చెయ్యాలి.

263
00:12:31,502 --> 00:12:32,836
హా. లేదు, నేను అంగీకరిస్తాను.

264
00:12:32,920 --> 00:12:35,422
అవును, ఎందుకంటే మీకిప్పుడు
చాలా ఎక్కువ "టెడ్ వినడం" దొరుకుతోంది.

265
00:12:35,506 --> 00:12:37,216
-అవును!
-అబ్బా! ఛ!

266
00:12:37,299 --> 00:12:39,468
అబ్బా! అబ్బా!

267
00:12:39,551 --> 00:12:42,930
ఇటీవలే విడాకులు పొందినవాడిగా,

268
00:12:43,013 --> 00:12:46,475
నాకు వచ్చిన సలహా ఏమిటంటే,
సంబంధాన్ని మంచిగా వదిలిపెట్టాలి.

269
00:12:46,558 --> 00:12:48,894
-అవును. నేను ఒప్పుకుంటాను. అవును.
-అవును.

270
00:12:48,977 --> 00:12:51,855
ఈ విషయంలో అది కొంచెం వేరు
ఎందుకంటే వదిలిపెడుతోంది నేను.

271
00:12:51,939 --> 00:12:54,233
నాకు తెలిసి,
నీ భార్య నిన్ను వదిలిపెట్టింది కదా?

272
00:12:57,319 --> 00:12:59,029
అవును, అది నిజం.
పెద్ద తేడా ఉంది, అవును.

273
00:12:59,112 --> 00:13:01,156
-అది ఘోరం!
-ఏంటది?

274
00:13:01,240 --> 00:13:03,867
వాళ్ళని ఫుట్ బాల్ మీద
అరవడం ఆపమని చెప్తారా?

275
00:13:03,951 --> 00:13:06,620
ఏం ఫుట్ బాల్?
వాళ్ళు నిన్న రాత్రి బేక్ ఆఫ్ చూస్తున్నారు.

276
00:13:06,703 --> 00:13:08,747
-ఆ స్పాంజ్ చూడండి!
-అది చెత్త!

277
00:13:08,830 --> 00:13:11,083
నీ చాక్లెట్ ని టెంపర్ చెయ్యి, వెధవ!

278
00:13:13,418 --> 00:13:15,671
నన్ను క్షమించండి, ఇప్పుడే వస్తాను?
నా సైకిక్ ఫోన్ చేసింది.

279
00:13:15,754 --> 00:13:17,714
సరిగ్గా నాకు అవసరం ఉన్నపుడే
ఫోన్ చేస్తానని చెప్పింది.

280
00:13:20,092 --> 00:13:21,677
అది అద్భుతం, కదా?

281
00:13:21,760 --> 00:13:23,011
-అవును.
-వావ్.

282
00:13:23,095 --> 00:13:25,055
హలో, టిష్. ఇది అత్యద్భుతం.

283
00:13:25,138 --> 00:13:26,139
టిష్.

284
00:13:26,223 --> 00:13:29,059
ఆమె వయసులో ఇలా
చేయడానికి చాలా ధైర్యం కావాలి.

285
00:13:29,142 --> 00:13:30,727
ఆమె నీతో ఉంటారా?

286
00:13:31,228 --> 00:13:32,980
నువ్వు ఆ పిలాటేస్ మెషీన్ కొంటే,

287
00:13:33,063 --> 00:13:35,232
నేను వచ్చినప్పుడు ఆవిడకి నేర్పించి,
నేను కూడా వాడుకోవచ్చు.

288
00:13:35,315 --> 00:13:38,944
అబ్బా. ఆమె చెప్పిన ప్రతి మాట మర్చిపోండి.
వాళ్ళు ఇలా కొన్నేళ్ళకు ఒకసారి చేస్తారు.

289
00:13:39,528 --> 00:13:42,072
మా నాన్నకి కోపం వస్తుంది,
ఆమె ఆయనని వదిలిపెడుతుంది.

290
00:13:42,155 --> 00:13:43,949
ఆ తరువాత వాళ్ళు "మర్చిపోతారు."

291
00:13:44,032 --> 00:13:47,160
ఆయన ఆవిడకి ఒక ఖరీదైన పర్యావరణ
అవగాహన ఉన్న బహుమతి కొంటారు,

292
00:13:47,244 --> 00:13:48,579
మళ్ళీ వారంలో తిరిగి కలుస్తారు.

293
00:13:49,955 --> 00:13:53,208
కానీ, బిల్లు ఆమె కడుతుంది కాబట్టి
మీ ఉచిత భోజనాన్ని ఆనందించండి.

294
00:13:53,292 --> 00:13:55,711
అంటే, ఈసారి వేరు కావచ్చు కదా?

295
00:13:55,794 --> 00:13:56,795
మనుషులు మారవచ్చు.

296
00:13:57,379 --> 00:13:59,006
కొంతమంది మారవచ్చు. ఆమె కాదు.

297
00:13:59,590 --> 00:14:01,091
పాపం కేక్

298
00:14:01,175 --> 00:14:02,801
మెత్తగా ఉంది

299
00:14:02,885 --> 00:14:06,263
పాపం కేక్
మెత్తగా ఉంది

300
00:14:06,346 --> 00:14:09,933
పాపం కేక్
మెత్తగా ఉంది

301
00:14:10,017 --> 00:14:13,520
పాపం కేక్
మెత్తగా ఉంది...

302
00:14:14,271 --> 00:14:17,107
హ్యాపీ సర్ప్రైజ్ సాండ్విచ్ ఫ్రైడే!

303
00:14:26,366 --> 00:14:29,536
హే. నేను నీ గురించే ఆలోచిస్తున్నాను.

304
00:14:29,620 --> 00:14:30,829
ఏం ఆలోచిస్తున్నావు?

305
00:14:31,663 --> 00:14:34,416
నువ్వు మళ్ళీ నన్ను వదిలి వెళితే
నేను కొండ మీద నుంచి దూకేస్తానని.

306
00:14:35,000 --> 00:14:37,503
నేనప్పుడు నువ్వు నా మీద పడేలా
కింద పడుకుని ఉంటాను.

307
00:14:37,586 --> 00:14:39,254
జేన్ పేన్.

308
00:14:41,298 --> 00:14:44,301
నేను ఫిన్ తో కాఫీ తాగడానికి
కెఫే సోలోకి వెళ్తున్నాను.

309
00:14:46,428 --> 00:14:47,554
మంచిది.

310
00:14:48,805 --> 00:14:49,932
ఈ ఫిన్ ఎవరు?

311
00:14:50,015 --> 00:14:53,227
నా పాత కాలేజీ స్నేహితుడు.
అండర్ వేర్ మోడల్.

312
00:14:54,811 --> 00:14:56,688
అతను చేసిన షూట్ చూపిస్తానని అన్నాడు.

313
00:14:57,356 --> 00:14:59,149
నిన్ను మళ్ళీ కలుస్తాను. బై!

314
00:15:18,961 --> 00:15:21,046
-పెద్ద మనిషి, రాయ్ కెంట్.
-వద్దు.

315
00:15:22,047 --> 00:15:23,632
అబ్బా. నువ్వు నన్ను ఎందుకు కోచ్ చెయ్యవు?

316
00:15:23,715 --> 00:15:25,092
నీకా అర్హత లేదు కాబట్టి.

317
00:15:25,175 --> 00:15:26,510
అవును. నాకా అర్హత లేదు.

318
00:15:26,593 --> 00:15:28,679
నువ్వు ఆడే విధానం నిస్తేజంగా,
అనుగుణంగా ఉంటుంది.

319
00:15:28,762 --> 00:15:33,267
అవును. నేను నిస్తేజంగా,
అనుగుణంగా ఆడతాను.

320
00:15:40,607 --> 00:15:41,650
ఇంకా నువ్వు అందవికారంగా ఉంటావు.

321
00:15:45,362 --> 00:15:47,781
నువ్వు అందవికారంగా, అందవికారంగా ఉంటావు.

322
00:15:49,408 --> 00:15:50,868
నీ జుట్టు బాగోదు.

323
00:15:56,623 --> 00:15:57,624
అను.

324
00:16:00,669 --> 00:16:02,212
-నేను…
-ఆ?

325
00:16:02,296 --> 00:16:06,425
నేను అందవికారంగా, అందవికారంగా ఉంటాను…

326
00:16:09,261 --> 00:16:12,890
నా జుట్టు బహుశా కొంచెం...

327
00:16:13,432 --> 00:16:15,225
నా జుట్టు బాగోదు!

328
00:16:19,688 --> 00:16:20,772
చీర్స్. నాకది నచ్చింది.

329
00:16:22,524 --> 00:16:25,611
-వెధవ!
-ఆ, నువ్వు వెధవవని తెలుసు, కానీ నువ్వు వెధవ్వే.

330
00:16:25,694 --> 00:16:26,987
నేనిక్కడ స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాను.

331
00:16:27,070 --> 00:16:30,991
న్వువు ఏమీ చేయలేవు, జెఫ్ బ్రిడ్జస్.

332
00:16:31,074 --> 00:16:32,784
హే, హే, హే!
ఏమవుతోంది? ఏమైంది?

333
00:16:32,868 --> 00:16:34,244
ఇతను నన్ను కోచ్ చేయనంటున్నాడు.

334
00:16:34,328 --> 00:16:36,205
అతను వెధవలా ఉండడం ఆపట్లేదు.

335
00:16:36,288 --> 00:16:37,539
రాయ్, నీకిది నచ్చదు.

336
00:16:37,623 --> 00:16:40,125
కానీ ఇప్పుడు,
జేమీ మీలో పెద్దమనిషిలా ప్రవర్తిస్తున్నాడు.

337
00:16:40,209 --> 00:16:43,170
అవును. నేను పెద్ద మనిషినే,
ఓ పెద్ద, మూర్ఖపు పిచ్చి వెధవ.

338
00:16:43,253 --> 00:16:44,338
అతను నీ నుంచి
నేర్చుకోవాలనుకుంటున్నాడు.

339
00:16:44,421 --> 00:16:47,674
నేను మెరుగ్గా అవడానికి ఏం చెయ్యాలో
నీకు తెలిస్తే నాకు చెప్పు.

340
00:16:47,758 --> 00:16:48,842
చూసావా?

341
00:16:49,676 --> 00:16:51,595
సరే. నీలో లోపం ఏంటో నేను చెప్తాను.

342
00:16:51,678 --> 00:16:52,930
సరే. ఇదుగో చెప్తున్నాడు!

343
00:16:53,013 --> 00:16:54,723
నువ్వతన్ని పాడు చేశావు.

344
00:16:54,806 --> 00:16:56,600
సరే. చెప్పు.

345
00:16:56,683 --> 00:16:58,101
నువ్వతన్ని టీమ్ ప్లేయర్ గా మార్చావు.

346
00:16:58,185 --> 00:17:00,312
అతన్ని పాస్ చేసేలా చేసావు,

347
00:17:00,395 --> 00:17:02,689
అలా చేసి, అతన్ని సాధారణంగా మార్చావు.

348
00:17:03,732 --> 00:17:08,403
ఎందుకంటే, నీ మనసు లోతుల్లో, జేమీ, నువ్వు,

349
00:17:08,487 --> 00:17:10,571
నువ్వొక వెధవ్వి.

350
00:17:12,074 --> 00:17:13,659
అందుకని వెధవలా ఉండు.

351
00:17:14,492 --> 00:17:16,118
నువ్వు గోల్స్ స్కోర్ చెయ్యాలి,

352
00:17:16,203 --> 00:17:18,579
ఇంకా నువ్వు అవతల
టీమ్ లోని వారిని భయపెట్టాలి,

353
00:17:18,664 --> 00:17:21,583
కేవలం నువ్వు చేయగలిగినట్లు చేసి
వాళ్ళు ఆడలేకపోయేలా చెయ్యాలి.

354
00:17:21,666 --> 00:17:23,167
అయితే నేను మళ్ళీ వెధవని అవ్వాలా?

355
00:17:23,252 --> 00:17:26,755
కాదు. కొన్నిసార్లు అవ్వమంటున్నాను.

356
00:17:26,839 --> 00:17:28,590
తగిన సమయంలో…

357
00:17:29,758 --> 00:17:32,219
అవును, వెధవలా ఉండు.

358
00:17:34,429 --> 00:17:35,514
సరే.

359
00:17:36,431 --> 00:17:37,516
ఎప్పుడు అవ్వాలో నాకెలా తెలుస్తుంది?

360
00:17:38,433 --> 00:17:40,310
నాకు కూడా దాని గురించి కుతూహలంగా ఉంది.

361
00:17:41,395 --> 00:17:42,479
మేము నీకు సంకేతం పంపుతాము.

362
00:17:45,691 --> 00:17:48,026
-ఏ సంకేతం?
-మేము ఏదైనా ప్రత్యేకమైన దాని కోసం చూడాలా?

363
00:17:48,569 --> 00:17:50,070
చూసినప్పుడు అది నీకు తెలుస్తుంది.

364
00:17:54,575 --> 00:17:55,576
సరే.

365
00:17:55,659 --> 00:17:57,244
సరే, అది బాగుంది. అలాగే.

366
00:17:57,953 --> 00:18:00,330
-నీకు అర్థమయిందా?
-అది చూసినప్పుడు నీకు తెలుస్తుందన్నాడు.

367
00:18:00,414 --> 00:18:01,456
అందుకని, ఆ…

368
00:18:02,165 --> 00:18:04,293
నీ కళ్ళు పెదవి చేసుకుని, ఆ…

369
00:18:05,836 --> 00:18:08,130
నమ్మండి

370
00:18:14,511 --> 00:18:17,222
ఛ, ఛ.

371
00:18:19,558 --> 00:18:20,559
హంకీ లూకా - గుడ్ నైట్ ఎక్స్

372
00:18:20,642 --> 00:18:21,810
-ఇవాళ రాత్రి సెక్సీ స్లీపోవర్ కి ఖాళీగా ఉన్నావా?
-ఉన్నాను! రాత్రికి కలుస్తాను.

373
00:18:21,894 --> 00:18:23,520
నేను ఇంకొన్ని సార్లు చేసేవాడినే.

374
00:18:25,981 --> 00:18:26,857
ఎల్.డి.ఎన్152 - హే బాస్ గర్ల్.

375
00:18:26,940 --> 00:18:28,192
నా రోజులో మంచి భాగం
అయినందుకు ధన్యవాదాలు

376
00:18:28,275 --> 00:18:29,401
నువ్వు, బ్రేక్ఫాస్ట్ పోటాపోటీగా ఉన్నారు.

377
00:18:34,448 --> 00:18:37,701
సరే, ఎల్.డి.ఎన్152,
ఈ కబుర్లు చాలు కానీ నువ్వెవరో చెప్పు.

378
00:18:37,784 --> 00:18:40,370
నేనెవరో నేకు చెప్తే నేను ఎలాంటి
గూఢాచారిని అవుతాను - ఊప్స్!

379
00:18:41,997 --> 00:18:43,248
హలో, బంగారం.

380
00:18:43,332 --> 00:18:45,375
ఇవాళ మ్యాచ్ కి ఎన్నింటికి వెళ్తున్నావు?

381
00:18:46,084 --> 00:18:49,630
-మూడింటికి. నువ్వు నాతో రావట్లేదా?
-లేదు. లేదు, కంగారు పడకు.

382
00:18:50,547 --> 00:18:52,674
నేను లవీనియా,
మేరీ-ఆలిస్ ని కలుస్తున్నాను.

383
00:18:52,758 --> 00:18:55,802
మేము బ్రీన్ బ్రౌన్ తన కొత్త పుస్తకం,
ఎంటర్ ది ఎరీనా, బట్ బ్రింగ్ ఎ నైఫ్

384
00:18:55,886 --> 00:18:58,722
లోంచి చదవడం వింటాము.

385
00:18:58,805 --> 00:19:00,182
హా. సరే.

386
00:19:05,896 --> 00:19:07,231
కానీ నేను అనుకుంటున్నాను.

387
00:19:07,314 --> 00:19:11,485
నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి,
నీకు ఇష్టమైనది చేస్తాను:

388
00:19:11,568 --> 00:19:13,529
చీజ్ పైన వేసిన షెపర్డ్స్ పై.

389
00:19:14,696 --> 00:19:17,741
ఆ తరువాత నువ్వు, నేను మాట్లాడుకోవచ్చు.
ఏమంటావు?

390
00:19:18,408 --> 00:19:19,618
చాలా బాగుంది.

391
00:19:19,701 --> 00:19:20,953
సరే.

392
00:19:25,207 --> 00:19:29,503
ఏ ఎఫ్ సి రిచ్మండ్,ఇప్పటి వరకు చరిత్రలో
ఈ జట్టు ఏ పెద్ద ట్రోఫీని గెలవలేదు,

393
00:19:29,586 --> 00:19:31,672
హటాత్తుగా వాళ్ళు వెంబ్లీ స్టేడియం వద్ద

394
00:19:31,755 --> 00:19:35,509
ఒక అసాధారణ ఎఫ్ఏ కప్ సెమీ ఫైనల్ కి
ఒక గెలుపు దూరంలో ఉన్నారు.

395
00:19:35,592 --> 00:19:37,511
ఎఫ్ఏ కప్ లాంటిది మరేదీ లేదు, ఆర్లో.

396
00:19:37,594 --> 00:19:39,805
వీటి గురించి మీరు మీ మనవళ్ళకి చెప్తావు.

397
00:19:42,891 --> 00:19:44,852
ఎఫ్ఏ కప్ క్వార్టర్ ఫైనల్
ఏ ఎఫ్ సి రిచ్మండ్ వర్సస్ టోటెన్హామ్ హాట్స్పర్

398
00:19:46,436 --> 00:19:48,230
బాంటర్

399
00:19:49,731 --> 00:19:50,732
వావ్! అదెక్కడ దొరికింది?

400
00:19:50,816 --> 00:19:53,569
స్టేడియం బయట ఒక వింత వ్యక్తి దగ్గర.
బానే ఉంది, కదా?

401
00:19:53,652 --> 00:19:58,282
వారి ప్రత్యర్థులు, టోటెన్హామ్ హాట్స్పుర్,
అద్భుతమైన రూపంలో నెల్సన్ రోడ్ వద్దకు వచ్చారు.

402
00:19:59,700 --> 00:20:03,287
నేను ప్రమాణం చేస్తున్నాను, మనం ఈ మ్యాచ్
నిజంగా గెలిస్తే, నేను ఈ పబ్ ను కూల్చేస్తాను.

403
00:20:04,413 --> 00:20:07,165
నేను... నేను ఒక కుర్చీని పడేస్తాను.

404
00:20:08,458 --> 00:20:12,212
నా కోపంతో కూడిన ఉత్సాహాన్ని నా సంఘానికి
సహాయపడే మార్గాల్లో చూపిస్తాను.

405
00:20:12,296 --> 00:20:13,672
అది చాలా మంచిది.

406
00:20:17,885 --> 00:20:20,220
-సరే, ఇదుగోండి.
-పదండి వెళ్దాం!

407
00:20:30,397 --> 00:20:33,525
మనం 30 నిమిషాల మార్కును చేరుకున్నాము,
అయినా ఇంకా నిల్-నిల్,

408
00:20:33,609 --> 00:20:35,903
కానీ ఇది చాలా ఉత్సాహకరమైన గేమ్.

409
00:20:35,986 --> 00:20:39,448
ఇరు వైపులా జట్లు దాడి చేసే క్రమంలో ఉన్నాయి,
ఆర్లో. ఇది సరైన గేమ్.

410
00:20:46,079 --> 00:20:48,457
అవును, అవును. అబ్బా. అవును, అవును.

411
00:20:49,082 --> 00:20:51,043
ఇంకొక తప్పు పాస్.

412
00:20:51,126 --> 00:20:54,379
టార్ట్ నుండి దూకుడు లేకపోవడం
ఇంకా కొనసాగుతుంది.

413
00:20:55,672 --> 00:20:57,007
సంకేతం పంపడానికి
సమయం అయిందనుకుంటాను?

414
00:20:57,090 --> 00:20:58,550
-అవును.
-సరే, అయితే.

415
00:20:58,634 --> 00:21:01,178
నీకు ఇంతకన్నా మంచిది ఏమైనా తట్టిందా?

416
00:21:01,261 --> 00:21:02,471
లేదు.

417
00:21:03,514 --> 00:21:05,390
సరే. హే, జేమీ!

418
00:21:05,974 --> 00:21:07,142
జేమీ!

419
00:21:14,233 --> 00:21:15,234
అబ్బా!

420
00:21:18,654 --> 00:21:19,655
అవును.

421
00:21:19,738 --> 00:21:22,074
మనం అదంతా తరచుగా
చూడము, కదా, క్రిస్,

422
00:21:22,157 --> 00:21:23,742
ముఖ్యంగా, అందరూ కలిసి చేయడం.

423
00:21:23,825 --> 00:21:26,245
ఆ సంకేత భాషకు క్షమించండి.

424
00:21:26,328 --> 00:21:28,872
చూడబోతే లాసో మన సంస్కృతికి
అలవాటు పడినట్టు ఉన్నాడు.

425
00:21:28,956 --> 00:21:30,874
అతను అలవాటు పడ్డాడు.

426
00:21:33,710 --> 00:21:35,254
ఓయ్, బార్నెట్,
ఏమవుతుందో తెలుసా, అవును.

427
00:21:35,337 --> 00:21:38,382
నువ్వు నన్ను ఫౌల్ చేస్తావు,
నేను ఇక్కడి నుంచి గోల్ కొడతాను.

428
00:21:38,465 --> 00:21:39,466
అవతలకి పో, టార్ట్.

429
00:21:51,186 --> 00:21:53,146
హే, రిఫరీ!

430
00:21:56,400 --> 00:21:57,442
యెల్లో కార్డ్
28 - గై బార్నెట్

431
00:21:59,695 --> 00:22:01,822
సరే. సరే, ఇదుగో.

432
00:22:03,490 --> 00:22:05,242
చూసుకోండి, అబ్బాయిలు! చూసుకోండి

433
00:22:06,201 --> 00:22:08,287
-నేనేం చెప్పాను, మిత్రమా?
-వెధవ...

434
00:22:08,370 --> 00:22:09,997
హే, హే, హే! హే, హే!

435
00:22:12,332 --> 00:22:14,126
-ధన్యవాదాలు!
-అతన్ని పంపేయండి!

436
00:22:17,546 --> 00:22:19,256
అతను మన టీమ్ లో ఉండడం మంచిదైంది.

437
00:22:21,633 --> 00:22:23,010
హే, ఏమనుకుంటావు? ట్రిక్ ప్లేనా?

438
00:22:23,093 --> 00:22:25,637
బహుశా లోకిస్ టొబోగన్
లేక అప్సైడ్-డౌన్ టాక్సీ?

439
00:22:25,721 --> 00:22:26,722
దాని అవసరం రాదు.

440
00:22:26,805 --> 00:22:28,765
ఆ వెధవ అక్కడి నుంచే గోల్ కొడతాడు.

441
00:22:28,849 --> 00:22:30,184
కొట్టలేడు.

442
00:22:56,126 --> 00:22:57,461
అది చాలా దూరంగా ఉంది.

443
00:23:10,891 --> 00:23:12,726
అవును!

444
00:23:12,809 --> 00:23:13,852
వేళాకోళం చేస్తున్నావా?

445
00:23:15,604 --> 00:23:16,688
అవును!

446
00:23:18,774 --> 00:23:20,275
హే!

447
00:23:21,735 --> 00:23:24,154
ఏం చేశావు? బాగా చేశావు!

448
00:23:24,238 --> 00:23:26,114
అవును! అదెలా ఉంది, హా?

449
00:23:26,198 --> 00:23:28,325
అది రాయ్ కెంట్ ప్రభావం.
అది అదే.

450
00:23:35,040 --> 00:23:37,292
జేమీ టార్ట్, డూ-డూ-డూ-డూ-డూ-డూ

451
00:23:37,376 --> 00:23:39,002
ఏ ఎఫ్ సి రిచ్మండ్ 1-0 టాటెన్హాం
గోల్ - టార్ట్ 9'

452
00:23:39,086 --> 00:23:40,629
జేమీ టార్ట్, డూ-డూ-డూ-డూ-డూ-డూ

453
00:23:40,712 --> 00:23:41,839
జేమీ టార్ట్!

454
00:23:41,922 --> 00:23:44,633
మొదటి సగం షాకింగ్ స్కోర్

455
00:23:44,716 --> 00:23:47,511
ఇంగ్లీష్ ఫుట్ బాల్ అంతటా ప్రతిధ్వనిస్తుంది

456
00:23:47,594 --> 00:23:50,097
అది రిచ్మండ్ కి ఒకటి, టాటెన్హామ్ కి సున్నా.

457
00:23:50,180 --> 00:23:52,140
క్రిస్, రిచ్మండ్ ఆట మీద పట్టు నిలుపుకోగలదా?

458
00:23:52,224 --> 00:23:53,976
నేను వారి స్థానంలో ఉంటే,
నేను స్టేడియం వదిలి పెట్టి,

459
00:23:54,059 --> 00:23:57,271
దూరంగా వెళ్ళిపోయి, నేను చచ్చిపోయే వరకు
మేమీ గేమ్ గెలిచామని అనుకుంటాను.

460
00:23:57,354 --> 00:23:59,022
కొత్త సందేశాలు లేవు

461
00:24:03,193 --> 00:24:04,695
నువ్వీ శబ్దాలు మళ్ళీ చేస్తున్నావు.

462
00:24:05,612 --> 00:24:06,697
ఏమైంది?

463
00:24:07,990 --> 00:24:11,660
నేను ఒక విషయం వినటం
ఇష్టం లేని వ్యక్తికి ఆ విషయం చెప్పాలి.

464
00:24:12,703 --> 00:24:13,996
ఇది బియర్డ్, జేన్ గురించా?

465
00:24:16,290 --> 00:24:19,334
ఆమె కార్ పార్క్ లో దాక్కుని
ఉండడం కొన్ని సార్లు చూసాను.

466
00:24:19,418 --> 00:24:21,837
అంటే కొన్ని సార్లు అతిగా
చేస్తుందనిపిస్తుంది కానీ మంచిదే.

467
00:24:22,963 --> 00:24:26,133
రన్నింగ్ షరేడ్స్ ఆడుతున్న రీస్ విథర్స్పూన్ లా.

468
00:24:26,216 --> 00:24:28,594
-రన్నింగ్ షరేడ్స్ అంటే ఏంటి?
-రన్నింగ్ షరేడ్స్ అంటే ఏంటి?

469
00:24:28,677 --> 00:24:30,137
నేను ఏదో ఒకటి చెప్పాలి.

470
00:24:30,220 --> 00:24:32,431
అస్సలు వద్దు.

471
00:24:32,514 --> 00:24:34,558
హిగ్గిన్స్, ఎన్నడూ తల దూర్చకు.

472
00:24:34,641 --> 00:24:36,518
అది సహాయం చెయ్యదు, అందుకు
మూల్యం నువ్వే చెల్లించాల్సి ఉంటుంది.

473
00:24:37,686 --> 00:24:39,354
నా తల్లిండ్రులు ఎప్పుడో విడిపోయి ఉండాల్సింది.

474
00:24:39,438 --> 00:24:42,441
ఆమె ఆయనని మొదటిసారి వదిలి పెట్టినప్పుడు నేను
కాలేజీలో ఉన్నాను. ఆమెనందుకు అభినందించాను.

475
00:24:42,983 --> 00:24:44,651
ఆమెకి మంచి జీవితం
జీవించే అర్హత ఉందని చెప్పాను.

476
00:24:45,652 --> 00:24:47,279
రెండు వారాల తరువాత
మళ్ళీ ఇద్దరూ ఒకటయ్యారు,

477
00:24:47,362 --> 00:24:49,239
ఆమె నాతో తొమ్మిది నెలలు మాట్లాడలేదు.

478
00:24:50,449 --> 00:24:51,617
అది మంచేమీ చెయ్యదు.

479
00:24:51,700 --> 00:24:54,995
నువ్వు ఎవరి మంచైనా కోరితే,
ప్రయత్నం చేస్తూ ఉండాలి.

480
00:24:55,078 --> 00:24:56,538
ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు.

481
00:24:58,040 --> 00:24:59,541
మీరు బియర్డ్, జేన్ గురించి మాట్లాడుకుంటున్నారా?

482
00:25:00,042 --> 00:25:01,752
ఆమె అసూయ చెందే రకం కదా?

483
00:25:01,835 --> 00:25:05,589
బియర్డ్ కి టెడ్ కి మధ్య సంబంధం ఉందేమో
అడగడానికి నన్ను ఇంటి దాకా అనుసరించింది.

484
00:25:08,217 --> 00:25:09,426
ఇంకా పది నిమిషాలు ఉన్నాయి,

485
00:25:09,510 --> 00:25:11,678
టార్ట్ చేసిన ఆ అధ్భుతమైన గోల్ తరువాత,

486
00:25:11,762 --> 00:25:14,515
స్పర్స్ అతన్ని ఆట నుంచి
దూరంగా ఉంచుతున్నారు.

487
00:25:15,432 --> 00:25:17,935
రిచ్మండ్ ఈ ఊహించని విజయాన్ని పొందవచ్చు

488
00:25:18,018 --> 00:25:20,354
కానీ అందుకు వాళ్ళు ధైర్యంగా ఉండాలి.

489
00:25:43,043 --> 00:25:44,711
నువ్వు అంతకన్నా బాగా చెయ్యగలవు, జేమీ!

490
00:25:46,046 --> 00:25:48,090
జేమీ టార్ట్?

491
00:25:49,466 --> 00:25:51,176
కోచ్? బానే ఉన్నారా?

492
00:25:52,052 --> 00:25:53,428
ఉన్నాను, లేదు, నేను...

493
00:25:54,346 --> 00:25:55,597
నేను వెళ్ళాలి. నా పొట్ట.

494
00:25:59,601 --> 00:26:00,727
ఏమైంది?

495
00:26:01,311 --> 00:26:02,646
అతని పొట్ట బాలేదట.

496
00:26:03,856 --> 00:26:05,274
ఇప్పుడు ఆట వదిలి వెళ్ళలేడు.

497
00:26:05,357 --> 00:26:06,775
మనం ఇది ఇంతకుముందు కూడా చూసాము.

498
00:26:06,859 --> 00:26:09,236
లాసో వెళ్లిపోతున్నట్టు ఉన్నాడు?

499
00:26:09,319 --> 00:26:12,656
నాకా పరుగు తెలుసు. అది పొట్ట
గుడగుడలాడించే చేపలు తిన్న వ్యక్తి పరుగు.

500
00:26:12,739 --> 00:26:14,533
క్రిస్, పొట్ట గుడగుడలాడించని
చేపలు ఉంటాయా?

501
00:26:20,873 --> 00:26:22,124
వ్యాంకర్! వ్యాంకర్!

502
00:26:22,207 --> 00:26:23,792
ఆగు, ఆ వెధవ ఎక్కడికి వెళ్తున్నాడు?

503
00:26:23,876 --> 00:26:25,419
కొంచెం జాలి చూపించు.
అతని పరిస్థితి బాలేదు.

504
00:26:29,173 --> 00:26:30,549
స్పర్శ్ స్కోరుని సమానం చేశారు...

505
00:26:30,632 --> 00:26:31,675
ఛ!

506
00:26:31,758 --> 00:26:33,594
…బార్నెట్ చేసిన గోల్ తో.

507
00:26:33,677 --> 00:26:34,845
-అబ్బా!
-నేను ఇప్పుడే వస్తాను.

508
00:26:34,928 --> 00:26:35,929
సరే.

509
00:26:38,056 --> 00:26:41,852
గ్రేహౌండ్స్ ధ్యాస మళ్ళింది,
దానిని స్పర్స్ బాగా ఉపయోగించుకున్నారు.

510
00:26:42,436 --> 00:26:43,729
అబ్బా, లాసో!

511
00:26:43,812 --> 00:26:45,480
నిన్ను నమ్మిన ప్రతి సారీ ఇలానే చేస్తావు!

512
00:26:47,357 --> 00:26:49,693
-రాయ్, మనం ఏం చెయ్యాలంటావు?
-మనకి ఒక గోల్ కావాలి.

513
00:26:49,776 --> 00:26:51,445
మనం ఏం చేద్దాం? ఒక స్ట్రైకర్ ని పంపుదామా?

514
00:26:51,528 --> 00:26:52,988
డిక్సన్ ని వెనక్కి పిలిచి, కాక్బర్న్ ని పంపుదాము.

515
00:26:53,071 --> 00:26:54,573
డిఫెన్సివ్ గా ఆడదాం.

516
00:26:54,656 --> 00:26:56,658
లేదా సామ్ ని ముందుకు పంపుదామా?

517
00:26:56,742 --> 00:26:58,744
నేను...
మనం అగ్రెసివ్ గా ఉండాలి, కదా?

518
00:26:59,244 --> 00:27:00,370
మనం...

519
00:27:01,288 --> 00:27:04,208
రేనాల్డ్స్, వించెస్టెర్, బాబటుండే
మీరు వెళ్ళండి.

520
00:27:06,168 --> 00:27:08,545
హే! కాలిన్, డానీ, రిచర్డ్,

521
00:27:09,505 --> 00:27:10,380
మీరు బయటకి రండి.

522
00:27:10,464 --> 00:27:12,007
-నేనా?
-అవును, నువ్వే, కాలిన్.

523
00:27:12,090 --> 00:27:13,217
ఏమవుతోంది?

524
00:27:14,092 --> 00:27:15,802
-డిఫెన్సివ్ గా ఆడదాం!
-ఏంటి?

525
00:27:15,886 --> 00:27:17,137
డిఫెన్సివ్ గా ఆడదాం!

526
00:27:17,221 --> 00:27:18,639
ముందు ఎవరూ వద్దు. వెళ్ళండి.

527
00:27:18,722 --> 00:27:21,225
-కానీ మనకు గోల్ కావాలి!
-మనం డిఫెన్సివ్ గా ఆడదాం! వెళ్ళండి!

528
00:27:22,100 --> 00:27:24,228
డిఫెన్సివ్ గా ఆడదాం! డిఫెన్సివ్ గా ఆడదాం!

529
00:27:25,062 --> 00:27:28,065
ఇది రిచ్మండ్ కి అరుదైన
మూడు ప్రత్యామ్నాయ మార్పులు.

530
00:27:28,148 --> 00:27:29,858
-డిఫెన్సివ్ గా ఆడదాం!
-డిఫెన్సివ్ గా ఆడదాం!

531
00:27:29,942 --> 00:27:31,652
-ఏమవుతోంది?
-ఇది నేను చూసుకుంటాను.

532
00:27:32,236 --> 00:27:34,530
చూడబోతే కోచింగ్ సిబ్బంది
గాభరా చెందుతున్నట్టు ఉన్నారు, ఆర్లో.

533
00:27:34,613 --> 00:27:37,115
ఒక ఫిష్ పై టీమ్ అంతటినీ ఇలానే
ఇబ్బంది పెట్టగలదు.

534
00:27:39,243 --> 00:27:40,244
టెడ్?

535
00:27:40,327 --> 00:27:42,955
ఇప్పుడు స్టాపేజ్ సమయం,
రిచ్మండ్ డిఫెన్స్ మీద దృష్టి పెడుతోంది.

536
00:27:43,038 --> 00:27:45,082
-వాళ్ళు చాలా డిఫెన్సివ్ గా ఆడుతున్నారు.
-టెడ్?

537
00:27:45,165 --> 00:27:47,501
డ్రా చేయడానికి ప్రయత్నించడం
రిచ్మండ్ చేసే పెద్ద పొరపాటు అవుతుంది, ఆర్లో.

538
00:27:47,584 --> 00:27:50,337
మీరు గెలుస్తారని ఎవరూ అనుకోవడం లేదు. మీరు మీ
ఊర్లో ఆడుతున్నారు. మీరు గెలవడానికి ప్రయత్నించాలి.

539
00:27:50,420 --> 00:27:53,048
-ఆగండి, ఇది స్పర్స్ ఊహించనిది!
-టెడ్?

540
00:27:53,131 --> 00:27:56,969
బార్నెట్ నుంచి రిచ్మండ్ కి ఒక స్లిప్,
వాళ్ళిప్పుడు తిరిగి దాడి చేస్తున్నారు!

541
00:27:58,011 --> 00:28:01,265
ఒబిసాన్య టార్ట్ కి
డయాగ్నల్ బాల్ పాస్ చేస్తున్నాడు.

542
00:28:01,348 --> 00:28:02,975
అతను షూట్ చేశాడు!

543
00:28:03,058 --> 00:28:05,227
టార్ట్ గోల్ చేశాడు!

544
00:28:05,310 --> 00:28:08,397
అసంభవం కానీ రిచ్మండ్ అగ్ర స్థానంలో ఉంది!

545
00:28:14,069 --> 00:28:15,279
ఓహ్, టెడ్.

546
00:28:23,579 --> 00:28:25,163
అవును!

547
00:28:29,084 --> 00:28:30,836
-హే, బాస్. కంగ్రాచ్యులేషన్స్.
-అవును.

548
00:28:30,919 --> 00:28:32,880
-టెడ్ ఎక్కడున్నాడు?
-నాకు తెలీదు.

549
00:28:32,963 --> 00:28:35,007
పొట్ట పాడైనట్టు ఉంది.
నేను ఇంటికి వెళ్తూ చూస్తాను.

550
00:28:35,090 --> 00:28:36,258
సరే. ధన్యవాదాలు.

551
00:28:37,134 --> 00:28:39,136
-కంగ్రాచ్యులేషన్స్.
-కంగ్రాచ్యులేషన్స్.

552
00:28:39,219 --> 00:28:42,264
రాయ్ కెంట్ ప్రభావం ఇంకా
పని చేయడం చాలా బాగుంది.

553
00:28:42,347 --> 00:28:44,183
నేను చేసింది ఏమీ లేదు. అంతా నేట్ ప్రభావం.

554
00:28:44,266 --> 00:28:46,268
మేము మరణించే వరకు రిచ్మండ్!

555
00:28:46,351 --> 00:28:49,563
మాకు తెలుసు! మాకు బాగా తెలుసు!
మేము మరణించే వరకు రిచ్మండ్!

556
00:28:51,231 --> 00:28:53,525
ఉద్రిక్త విజయానికి అభినందనలు.

557
00:28:54,109 --> 00:28:55,402
ఆ, అవును, ధన్యవాదాలు. ధన్యవాదాలు.

558
00:28:55,485 --> 00:28:57,362
-టెడ్ కి ఏమైంది?
-నాకు తెలియదు.

559
00:28:57,446 --> 00:28:58,530
పొట్ట పాడయిందో ఏమో?

560
00:28:58,614 --> 00:29:01,033
మీకు ఒక గోల్ అవసరమైనప్పుడు
అందరినీ డిఫెన్స్ లోకి దింపడం

561
00:29:01,116 --> 00:29:02,117
ఒక ప్రతికూల వ్యూహంలా అనిపించింది.

562
00:29:02,201 --> 00:29:03,744
అవును, కానీ వాళ్లకి కూడా
గోల్ కావాలని నాకు తెలుసు.

563
00:29:03,827 --> 00:29:05,495
వాళ్ళని వెళ్ళకుండా ఆపగలిగితే,

564
00:29:05,579 --> 00:29:07,414
ఏదో ఒక సమయంలో పొరపాటు
చేస్తారు, అది మానవ సహజం,

565
00:29:07,497 --> 00:29:08,624
మేము దాన్ని ఉపయోగించుకోవచ్చు.

566
00:29:08,707 --> 00:29:09,917
అద్భుతం!

567
00:29:10,000 --> 00:29:11,168
అతను తగినవాడు కాదన్నావు కదా.

568
00:29:11,251 --> 00:29:13,962
-ఒక అసిస్టెంట్ కోచ్ గా బాగా చేసారు.
-నేను చేయాల్సింది చేసానంతే.

569
00:29:14,046 --> 00:29:15,964
నేనేమీ "వండర్ కిడ్" కాదు కదా.

570
00:29:16,048 --> 00:29:18,050
-ఎవరది?
-"వండర్ కిడ్."

571
00:29:18,133 --> 00:29:20,135
మీరు అంటోంది వుందర్కైండ్ అనుకుంటాను. అవునా?

572
00:29:21,178 --> 00:29:22,471
అవును.

573
00:29:22,554 --> 00:29:24,139
మనం దాన్ని ఎడిటింగ్ లో సరిచేయచ్చా,
లేక ఇది...

574
00:29:24,223 --> 00:29:25,432
లేదు, ఇది ప్రత్యక్ష ప్రసారం.

575
00:29:25,516 --> 00:29:28,852
వండర్ కిడ్,
నేథన్ షెల్లీ, బాగా చేసారు.

576
00:29:28,936 --> 00:29:31,104
-టెడ్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము.
-అవును.

577
00:29:31,188 --> 00:29:33,690
-ధన్యవాదాలు. ఆ.
-లేదు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. వెళ్ళు.

578
00:29:36,109 --> 00:29:39,488
నీ మంచి కోరేవాడిగా,
నేను అనుకుంటున్నాను నువ్వు, జేన్…

579
00:29:43,033 --> 00:29:44,785
చూడు, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను.

580
00:29:45,702 --> 00:29:47,996
నువ్వు గొప్ప వ్యక్తివి.
జేన్ నిన్నుఇంకా గొప్పగా చేస్తుందా?

581
00:29:51,792 --> 00:29:53,752
సరే, చూడు, నన్ను క్షమించు.

582
00:29:59,925 --> 00:30:02,511
సరే, సరే. అది...

583
00:30:03,053 --> 00:30:04,805
నువ్వు చెప్పింది విన్నాను.
అర్థం చేసుకుంటాను.

584
00:30:06,598 --> 00:30:08,600
-మనం దీని గురించి మళ్ళీ మాట్లాడం.
-లేదు, లేదు.

585
00:30:12,521 --> 00:30:14,189
-నిన్ను సోమవారం కలుస్తాను.
-సోమవారం కలుస్తాను.

586
00:30:25,576 --> 00:30:27,035
నేనీ భయపడే మొహాన్ని మిస్ అయ్యాను.

587
00:30:27,619 --> 00:30:28,912
నేనూ నిన్ను మిస్ అయ్యాను.

588
00:30:29,454 --> 00:30:30,539
ఫిన్ ఎలా ఉన్నాడు?

589
00:30:31,415 --> 00:30:32,875
అతనొక రెమ్బ్రాంట్ లాంటి వాడు.

590
00:30:32,958 --> 00:30:36,086
చూడడానికి బాగుంటాడు
కానీ తెలివి తక్కువవాడు.

591
00:30:38,297 --> 00:30:39,339
ఇది పెట్టుకుని చూడు.

592
00:30:42,384 --> 00:30:44,303
-అవును, ఇది ఇంకా బాగుంది. అవును.
-అవును?

593
00:30:44,386 --> 00:30:46,471
మరీ ఆలివర్ ట్విస్ట్ లా లేదు కదా?

594
00:30:46,555 --> 00:30:49,183
ఉంది, కానీ నాకలానే ఇష్టం, అందుకని...

595
00:30:49,266 --> 00:30:50,851
"అలా ఇంకా చేస్తావా?"

596
00:31:00,986 --> 00:31:03,947
ఓయ్, నేట్, ఇవాళ చాలా బాగా చేశావు.

597
00:31:04,031 --> 00:31:05,199
ధన్యవాదాలు, రాయ్.

598
00:31:18,629 --> 00:31:19,963
డా. షారన్!

599
00:31:20,047 --> 00:31:21,840
మేము డ్రింక్స్ కి వెళ్తున్నాము.
మీరు మాతో వస్తారా?

600
00:31:21,924 --> 00:31:25,302
ఆగండి, మేము మీతో రాత్రి సమయంలో
మాట్లాడవచ్చా? లేదంటే, నన్ను క్షమించండి.

601
00:31:25,928 --> 00:31:28,639
క్వార్టర్ ఫైనల్ విజయానికి,
నేను ఒక్క డ్రింక్ కి వస్తాను.

602
00:31:30,057 --> 00:31:31,350
మిమ్మల్ని తరువాత కలుస్తాను.

603
00:31:36,313 --> 00:31:38,982
టెడ్ లాసో
ఫోన్

604
00:31:41,193 --> 00:31:42,694
బీప్ కోసం ఆగండి.

605
00:31:42,778 --> 00:31:45,405
మీరు మీ పేరు ఇవ్వండి.
మీరు మీ నంబర్ ఇవ్వండి.

606
00:31:46,114 --> 00:31:47,407
హాయ్, టెడ్, ఇది నేను.

607
00:31:49,159 --> 00:31:51,745
నీ గురించి కొంచెం కంగారుగా ఉంది.
నువ్వు బానే ఉన్నావనుకుంటాను.

608
00:31:52,704 --> 00:31:56,500
నా అవసరం అనిపిస్తే,
నాకు ఫోన్ చెయ్యి.

609
00:31:58,085 --> 00:31:59,211
నేను ఇంటికి వెళ్తున్నాను,

610
00:31:59,294 --> 00:32:00,963
మా అమ్మతో ఒక కష్టమైన
విషయం మాట్లాడడానికి,

611
00:32:01,046 --> 00:32:03,507
నీతో కొంచెం మాట్లాడితే
నాకు ధైర్యం వచ్చేది.

612
00:32:04,675 --> 00:32:05,676
సరేలే…

613
00:32:06,844 --> 00:32:07,928
జాగ్రత్త.

614
00:32:16,478 --> 00:32:17,479
అమ్మా!

615
00:32:21,733 --> 00:32:23,026
అమ్మా!

616
00:32:26,154 --> 00:32:27,197
అమ్మా?

617
00:32:29,116 --> 00:32:31,326
బంగారం

618
00:32:35,038 --> 00:32:39,376
"తల్లీ, నిన్ను కలవలేకపోయినందుకు బాధగా ఉంది.
మీ నాన్న క్షమాపణ అడిగి నాకొక టెస్లా కొన్నారు."

619
00:32:42,045 --> 00:32:44,047
"ఈసారి వచ్చినప్పుడు
నిన్ను అందులో బయటకు తీసుకువెళ్తాను.

620
00:32:44,131 --> 00:32:47,384
గమనిక, షెపర్డ్స్ పై ఫ్రిడ్జ్ లో ఉంది.
రెండు నిమిషాలు మైక్రోవేవ్ చేసుకోవాలి."

621
00:33:01,648 --> 00:33:02,900
కాలింగ్…
హంకీ లూకా

622
00:33:06,528 --> 00:33:07,654
హే, లూకా.

623
00:33:08,405 --> 00:33:10,616
అవును, ఇది నిజమైన ఫోనే.

624
00:33:11,158 --> 00:33:12,618
లేదు, నేను అరెస్ట్ అవలేదు.

625
00:33:13,202 --> 00:33:15,829
మా అమ్మా నాన్న లేరని చెప్దామని ఫోన్ చేసాను.

626
00:33:16,371 --> 00:33:17,581
అయితే మనం...

627
00:33:18,248 --> 00:33:19,833
అవును.

628
00:33:19,917 --> 00:33:21,001
తొందరగా రా.

629
00:33:30,093 --> 00:33:32,513
ఇవాళ ఆఫీసులో చాలా బిజీగా ఉన్నాను,
కానీ నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను.

630
00:33:32,596 --> 00:33:33,972
మనం కలవాలి…

631
00:33:34,848 --> 00:33:37,768
జంప్ మ్యాన్, జంప్ మ్యాన్, జంప్ మ్యాన్
ఆ అబ్బాయిలు ఏదో చేస్తున్నారు

632
00:33:37,851 --> 00:33:40,395
వాళ్ళు రెండో మూడో వారాలు
దేశం బయట గడిపారు

633
00:33:40,479 --> 00:33:42,439
-మీకు పదాలు అన్నీ తెలుసు కదా.
-ఆ అబ్బాయిలు ఏదో చేస్తున్నారు

634
00:33:42,523 --> 00:33:44,107
వాళ్ళు ఊరికే అనడం లేదు

635
00:33:44,691 --> 00:33:47,236
నువ్వు కాల్ చేయనవసరం లేదు
నేను డాన్స్ బాగా చేస్తాను, వూ!

636
00:33:47,319 --> 00:33:50,113
-ఓయ్, నీ ఫోన్ పక్కన పెట్టు.
-అవును. సరే, సరే. క్షమించండి.

637
00:33:50,197 --> 00:33:51,198
కొనసాగించు. బాగా చేస్తున్నావు.

638
00:33:51,281 --> 00:33:54,368
డీజే మస్టర్డ్ లా నా టెంపో దొరికింది, వూ!

639
00:33:54,451 --> 00:33:57,746
నేనా గినోబిలిని కొట్టాను
నా ఎడమ చేత్తో, వూ!

640
00:34:07,798 --> 00:34:08,924
టెడ్, నన్ను భయపెట్టావు.

641
00:34:13,303 --> 00:34:14,304
నువ్వు బానే ఉన్నావా?

642
00:34:18,891 --> 00:34:20,393
నాకొక అపాయింట్మెంట్ కావాలి.

643
00:34:59,474 --> 00:35:01,476
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి

