1
00:00:11,720 --> 00:00:14,723
-హలో.
-హాయ్, బ్రిజెట్. ఆలస్యం అయినందుకు క్షమించు.

2
00:00:14,806 --> 00:00:17,726
ఒక పేషెంట్ ఆలస్యంగా రావడం కన్నా

3
00:00:17,809 --> 00:00:19,144
మంచి సంగతి ఆ పేషెంట్ రాకపోవడం.

4
00:00:21,021 --> 00:00:22,189
మనం ఎక్కడ ఆపాము?

5
00:00:22,272 --> 00:00:26,276
చూద్దాం.
అది నా నోట్స్ లో ఉంది... ఓహ్, అవును!

6
00:00:26,360 --> 00:00:28,946
"టెడ్ లాసో నాకు పిచ్చెక్కిస్తున్నాడు."

7
00:00:29,029 --> 00:00:31,365
అవును. అతను మనసు విప్పి
మాట్లాడడానికి సిద్ధంగా లేడు.

8
00:00:31,448 --> 00:00:33,867
అతను తన గురించి చెప్పే సమయానికి,

9
00:00:33,951 --> 00:00:38,247
అతను మధ్య అమెరికాకు చెందిన
40 ఏళ్ల శ్వేతజాతీయుడికి ప్రత్యేకమైన

10
00:00:38,330 --> 00:00:40,666
ఒక జోక్ లేదా అస్పష్టమైన దానిని అంటాడు.

11
00:00:40,749 --> 00:00:43,210
అయితే అతను మనసు విప్పడానికి
సిద్దంగా లేడు, అవునా?

12
00:00:43,293 --> 00:00:45,045
ఎవరో నాకు తెలిసిన వాళ్ళలా ఉన్నాడు.

13
00:00:45,128 --> 00:00:47,756
ఓహ్, ఆపండి.
నేను కోచ్ లాసో ఒకలా ఉండనే ఉండము.

14
00:00:47,840 --> 00:00:49,967
షారన్, నువ్వు కూడా అలానే చేస్తావు.

15
00:00:50,050 --> 00:00:53,971
అతను హాస్యాన్ని వాడితే,
నువ్వు నీ తెలివి తేటలను వాడతావు.

16
00:00:54,054 --> 00:00:55,264
ఇంకా నయం.

17
00:00:55,347 --> 00:00:58,725
అందరినీ దూరం చేయడానికి, నన్ను నేను వేరు
చేసుకోడానికి నేను నా తెలివితేటలను ఉపయోగించను.

18
00:00:59,726 --> 00:01:01,353
సరే, నాకు అర్థమైంది.

19
00:01:01,436 --> 00:01:04,063
కోచ్ లాసోతో నువ్వు మనసు విప్పి
మాట్లాడి, అతన్ని సగం దూరంలో

20
00:01:04,147 --> 00:01:07,401
కలిసే వరకు నువ్వు ముందుకు
వెళ్ళవని నాకు అనిపిస్తోంది.

21
00:01:07,985 --> 00:01:08,986
అవును.

22
00:01:09,069 --> 00:01:11,321
అవును, నేను కరెక్టే!
ఇప్పుడు నువ్వేం చేస్తావు?

23
00:01:28,839 --> 00:01:30,883
-మీ కుక్కని చూసుకోండి!
-ఏంటి?

24
00:01:30,966 --> 00:01:32,467
-దానికా స్వెటర్ నచ్చదు.
-నీకనవసరం!

25
00:01:38,182 --> 00:01:39,600
అబ్బా!

26
00:01:46,440 --> 00:01:49,234
999 కి ఫోన్ చెయ్యండి.
ఎవరైనా 999 కి ఫోన్ చెయ్యండి.

27
00:01:49,776 --> 00:01:50,861
ఆమె శ్వాస తీసుకుంటోందా?

28
00:02:23,018 --> 00:02:24,019
హాయ్.

29
00:02:26,313 --> 00:02:30,108
కోచ్ కోసం నా దగ్గర సరదా అయిన,
కొత్త బ్రాండింగ్ అవకాశం ఉంది.

30
00:02:30,192 --> 00:02:32,486
అందుకు పబ్లిక్ గా ఒకసారి కనిపించాలి.
డబ్బు బాగా ఇస్తారు.

31
00:02:32,569 --> 00:02:34,530
అది క్లబ్ కి బాగా పనికొస్తుంది.

32
00:02:34,613 --> 00:02:36,740
దీనికి స్పోక్స్ పర్సన్ అవడం ద్వారా మీలో ఎవరైనా

33
00:02:36,823 --> 00:02:39,284
ఆ విషయంలో నాకు సహాయం చేస్తారా...

34
00:02:42,788 --> 00:02:45,082
సరే. మీ ఇద్దరూ చెత్త.

35
00:02:47,167 --> 00:02:49,044
మనం ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన
అవసరం రాకపోవడం నాకు నచ్చింది.

36
00:02:49,127 --> 00:02:50,212
ఆమె మనని అర్థం చేసుకుంటుంది.

37
00:02:51,380 --> 00:02:53,215
నేను ఒక స్పోక్స్ పర్సన్ కాబోతున్నాను.

38
00:02:54,508 --> 00:02:55,509
టెడ్ ఎక్కడున్నాడు?

39
00:02:56,093 --> 00:02:58,679
-టెక్స్ట్ చేశాడు. ఏదో అత్యవసరం అట.
-ఏంటది?

40
00:02:58,762 --> 00:03:00,722
-నేను అడగలేదు.
-ఎందుకు?

41
00:03:00,806 --> 00:03:02,140
అది అతని అత్యవసరం.

42
00:03:02,224 --> 00:03:03,809
మనకతను చెప్పాలని అనుకుంటే చెప్పేవాడే.

43
00:03:04,935 --> 00:03:07,980
వెంబ్లీ స్టేడియంలో ఆదివారం
మనకి ఎఫ్ఏ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఉంది.

44
00:03:08,063 --> 00:03:09,773
-శిక్షణ ఎవరు ఇస్తున్నారు?
-నేను.

45
00:03:09,857 --> 00:03:12,526
-నువ్వా?
-టెడ్ అడిగాడు. అది నాకు అనవసరం.

46
00:03:15,696 --> 00:03:17,698
-అబ్బా, నేను వెళ్ళాలి.
-ఎక్కడికి వెళ్తున్నావు?

47
00:03:17,781 --> 00:03:19,449
అది నీకు అనవసరం.

48
00:03:25,372 --> 00:03:28,208
అంటే…
ఇక మిగిలింది మనం ఇద్దరమే. అంటే...

49
00:03:28,292 --> 00:03:29,793
-శిక్షణ నువ్వు ఇవ్వచ్చు.
-ధన్యవాదాలు.

50
00:03:29,877 --> 00:03:32,171
అయితే సరే... నేననుకుంటాను... సరే.
సరే, ధన్యవాదాలు. ఆగండి.

51
00:03:36,633 --> 00:03:38,802
"నాన్న"

52
00:03:42,639 --> 00:03:44,641
సరే. మొదలుపెడదాం.

53
00:03:45,225 --> 00:03:47,978
చెయ్యి.
ఆ, సరే. మొదలుపెడదాం.

54
00:03:48,061 --> 00:03:49,646
బాగా చేశావు. బాగా చేశావు మిత్రమా.

55
00:03:49,730 --> 00:03:51,690
అంతే, చేసేసావు,
చేసేసావు, చేసేసావు.

56
00:03:52,232 --> 00:03:53,233
హలో, నాన్నా.

57
00:03:53,317 --> 00:03:55,986
సామ్…
నేను ఎందుకు ఫోన్ చేసానో తెలుసా?

58
00:03:56,612 --> 00:03:57,821
తెలియదు, సర్.

59
00:03:57,905 --> 00:03:59,698
సెరిథియం ఆయిల్ ని నైజీరియాలో
ఆపరేట్ చేయడం ఆపాలని

60
00:03:59,781 --> 00:04:02,743
ఇప్పుడే ఆదేశించబడిందని
నీకు చెప్దామని ఫోన్ చేశాను.

61
00:04:02,826 --> 00:04:05,579
ఏంటి? ఏంటి, అది అద్భుతం!

62
00:04:05,662 --> 00:04:08,790
ఇదంతా నీ ప్రోద్బలమే.

63
00:04:08,874 --> 00:04:10,626
నీ పట్ల నాకు చాలా గర్వంగా ఉంది, బాబు.

64
00:04:10,709 --> 00:04:12,002
ధన్యవాదాలు, నాన్నా.

65
00:04:12,085 --> 00:04:14,505
మీరు ఇచ్చిన ప్రేరణ వల్లే
నేనిది చేయగలిగాను.

66
00:04:14,588 --> 00:04:18,382
నువ్వలా అనడం బాగుంది
ఎందుకంటే అది నిజం.

67
00:04:19,760 --> 00:04:20,761
ఐ లవ్ యు.

68
00:04:20,844 --> 00:04:23,055
ఐ లవ్ యు టూ. సరే, బై.

69
00:04:23,889 --> 00:04:25,432
ఓయ్! ఏం చేస్తున్నావు?

70
00:04:25,974 --> 00:04:27,142
అయ్యో.

71
00:04:28,894 --> 00:04:31,271
-నువ్వు ఏమీ ఎందుకనలేదు?
-అది నా గొంతు మీద ఉంది.

72
00:04:32,439 --> 00:04:33,524
సరే. క్షమించు.

73
00:04:33,607 --> 00:04:35,609
నువ్వు వెళ్ళు.
నేనిది చూసుకుంటాను.

74
00:04:40,155 --> 00:04:41,782
బాంటర్
బాస్ గర్ల్

75
00:04:46,912 --> 00:04:48,664
నేను పాటీ చేస్తున్నప్పుడు
అడిగిన వాళ్లకి చెప్పడానికి

76
00:04:48,747 --> 00:04:50,749
నాకు ఇంకా ఏం చెప్పాలో తెలియదు.

77
00:04:51,583 --> 00:04:52,751
నువ్వు ఏమని చెప్తావు?

78
00:04:55,128 --> 00:04:57,047
నేను నా లిప్ లైనర్ మళ్ళీ పెట్టుకోవాలని చెప్తాను.

79
00:04:58,006 --> 00:04:59,007
మగవాళ్ళకి అదేంటో తెలియదు,

80
00:04:59,091 --> 00:05:01,134
అమ్మాయిలకి అందుకు సమయం పడుతుంది,
దాని మీద దృష్టి పెట్టాలని తెలుసు.

81
00:05:05,389 --> 00:05:07,057
బాంటర్ ఎల్.డి.ఎన్152
రాత్రి లే టుక్కి లో ఎనిమిదింటికి డిన్నర్

82
00:05:07,140 --> 00:05:08,392
నేను వస్తాను, నువ్వు కూడా రావాలి.

83
00:05:09,351 --> 00:05:10,811
అవును అని చెప్పు!

84
00:05:14,690 --> 00:05:17,401
వినండి, వినండి! మూడు చుక్కలు!
మూడు చుక్కలు, మూడు చుక్కలు.

85
00:05:22,364 --> 00:05:23,365
నిన్ను అక్కడ కలుస్తాను

86
00:05:23,991 --> 00:05:25,200
అవును!

87
00:05:28,453 --> 00:05:29,454
అవును!

88
00:05:29,538 --> 00:05:31,874
-వావ్. అబ్బా.
-అవును!

89
00:05:33,917 --> 00:05:34,918
కాప్టెన్.

90
00:05:35,544 --> 00:05:36,545
ఏంటి, సోదరా?

91
00:05:36,628 --> 00:05:38,589
మిమ్మల్ని నా జుట్టు కట్
చేయమని అడగాలనుకుంటున్నాను.

92
00:05:38,672 --> 00:05:39,840
ఏంటి?

93
00:05:44,386 --> 00:05:45,429
నిజంగానా, సోదరా?

94
00:05:45,512 --> 00:05:46,972
అవును, నిజంగానే అడుగుతున్నాను.

95
00:05:53,145 --> 00:05:55,647
సరే. శిక్షణ తరువాత.

96
00:05:58,859 --> 00:06:00,611
-ఐసాక్, ఐసాక్.
-అయ్యో!

97
00:06:03,405 --> 00:06:04,406
హాస్పిటల్

98
00:06:04,489 --> 00:06:05,490
ఓహ్, మీరు కొంచెం ఆగండి.

99
00:06:05,574 --> 00:06:07,826
నేను నా శరీరంలో ప్రతి
ఎముకని విరక్కొట్టుకుంటే,

100
00:06:07,910 --> 00:06:10,370
ఎవరైనా నన్ను ఏదైనా పాత హాస్పిటల్
దగ్గర దింపేసి,

101
00:06:10,454 --> 00:06:11,997
అది చెత్తలోనో ఎక్కడో వదిలేసి వెళితే,

102
00:06:12,080 --> 00:06:14,666
మీరు నాకు కుట్లు వేసి నయం చేస్తే,
నేను ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదా?

103
00:06:14,750 --> 00:06:16,168
అవును.

104
00:06:16,251 --> 00:06:18,003
నాకు ఈ దేశం నచ్చింది.
నాకు ఈ ఊరు నచ్చింది.

105
00:06:18,086 --> 00:06:22,007
ఓహ్, విన్నీ ది పూ లండన్ జూలో ఒక ఎలుగుబంటి
ఆధారంగా రూపొందించబడిందని మీకు తెలుసా?

106
00:06:22,090 --> 00:06:23,258
అబ్బా.

107
00:06:24,343 --> 00:06:25,594
అయ్యో...

108
00:06:26,428 --> 00:06:27,804
ఇది నేను ఊహించిన దాని కన్నా ఘోరంగా ఉంది.

109
00:06:31,266 --> 00:06:32,518
ఆమె మళ్ళీ నడవగలదు! వావ్!

110
00:06:33,644 --> 00:06:35,020
ఇదొక అద్భుతం!

111
00:06:35,103 --> 00:06:37,022
ఓహ్! సైన్స్ కి ధన్యవాదాలు!

112
00:06:37,898 --> 00:06:40,192
హే, డాక్! ఈ డాక్ బానే ఉంటారు, కదా?

113
00:06:40,275 --> 00:06:41,443
ఆ, ఆమె స్కాన్లు బానే ఉన్నాయి.

114
00:06:41,527 --> 00:06:43,278
మంచిది. ఇంట్రాక్రేనియల్ హేమరేజింగ్ లేదు కదా?

115
00:06:43,362 --> 00:06:45,781
-లేదు.
-లేదా సబ్డ్యూరల్ హెమటోమా?

116
00:06:45,864 --> 00:06:47,908
లేదు. మీకు మెదడు గాయాల
గురించి బాగా తెలుసనుకుంటాను.

117
00:06:47,991 --> 00:06:50,494
నా ముప్పైలలో గ్రేస్ అనాటమీ
ఎక్కువగా చూసేవాడిని.

118
00:06:51,537 --> 00:06:53,205
నిజానికి, నేను ఫుట్ బాల్ కొచింగ్ ఇస్తాను.

119
00:06:53,288 --> 00:06:54,873
అమెరికన్ రకం. సరేనా?

120
00:06:54,957 --> 00:06:57,793
ఆ మెదడుకి బలమైన దెబ్బలు,
మొకాలు మీద కూర్చుని నిరసనలు, అలాంటివి.

121
00:06:57,876 --> 00:06:59,753
ఓహ్, ఆమె మెదడుకి బలమైన దెబ్బే తగిలింది.

122
00:07:00,337 --> 00:07:01,922
ఆమెకి కొన్ని కుట్లు కూడా పడ్డాయి.

123
00:07:02,005 --> 00:07:04,299
అందుకని మీరు కొన్ని రోజులు
విశ్రాంతి తీసుకోవాలి, సరేనా?

124
00:07:04,383 --> 00:07:06,552
అంతే, మిమ్మల్ని మీ భర్త
ఇంటికి తీసుకువెళ్ళవచ్చు.

125
00:07:06,635 --> 00:07:07,970
ఓహ్, ఇతను నా భర్త కాదు.

126
00:07:08,053 --> 00:07:10,347
అవును, అవును, అవును.
ఈ వేలుకి ఉంగరం లేదు.

127
00:07:10,430 --> 00:07:11,932
-లేదు, మేము కేవలం స్నేహితులం.
-మేము కొలీగ్స్.

128
00:07:12,015 --> 00:07:14,309
-స్నేహపూర్వక కొలీగ్స్.
-నాకు భర్త లేడు.

129
00:07:14,393 --> 00:07:15,394
అవును కానీ బాధాకరమైన విధంగా కాదు.

130
00:07:15,477 --> 00:07:17,521
ఆమె స్వతంత్రురాలు.

131
00:07:17,604 --> 00:07:20,023
నేను ఒక్క దాన్నే ఇంటికి బానే వెళ్ళగలను.

132
00:07:20,107 --> 00:07:22,734
-నేనన్నది మీకు అర్థమైందా?
-నన్ను క్షమించండి, డా. ఫీల్డ్ స్టోన్.

133
00:07:23,277 --> 00:07:25,070
తలకు గాయమైన పేషెంట్లు,
ఒక్కరినే ఇంటికి పంపకూడదన్నది

134
00:07:25,153 --> 00:07:26,321
హాస్పిటల్ విధానం.

135
00:07:27,239 --> 00:07:28,907
హాస్పిటల్ విధానం లాంటి
విధానం మరెక్కడా ఉండదు,

136
00:07:28,991 --> 00:07:30,784
ఎందుకంటే హాస్పిటల్
విధానాలను కాదనకూడదు.

137
00:07:31,410 --> 00:07:32,661
వేసుకోవడంలో సహాయం చేస్తాను, బంగారం.

138
00:07:32,744 --> 00:07:34,872
-ఇదుగో. ఇదుగో.
-ధన్యవాదాలు.

139
00:07:35,497 --> 00:07:37,666
వచ్చినందుకు ధన్యవాదాలు, కోచ్ కెంట్.

140
00:07:38,250 --> 00:07:40,836
మా అక్క హాస్పిటల్ లో ఉంది.
ఆమె ఎమర్జెన్సీ రూమ్ లో పని చేస్తుంది.

141
00:07:40,919 --> 00:07:43,422
ఎప్పుడూ ఏదో ఒకటి అవుతూ ఉంటుంది
కాబట్టి ఆమె రాలేకపోయింది,

142
00:07:43,505 --> 00:07:47,801
ఒకళ్ళ కళ్ళలో కత్తి గుచ్చుకుంటే,
లేదా ఒక టార్చ్...

143
00:07:47,885 --> 00:07:49,636
సరే, సరే, అర్థమైంది. ఆమె బిజీగా ఉంది.

144
00:07:50,596 --> 00:07:53,724
ఫీబి, నేను మీ మామయ్యతో మాట్లాడాలి,
నువ్వు వెళ్లి కలరింగ్ చేస్తావా?

145
00:07:53,807 --> 00:07:55,392
అలాగే, మిస్ బోవెన్.

146
00:07:59,229 --> 00:08:01,273
నేను మిమ్మల్ని ఒక వ్యక్తిగత ప్రశ్న అడగచ్చా?

147
00:08:01,356 --> 00:08:03,442
-ఫీబి వాళ్ళ నాన్న...
-అతను చెత్త.

148
00:08:04,067 --> 00:08:07,237
-ఆయన బతికే ఉన్నారా?
-క్షమించండి, ఆ. ఆయన బతికున్న చెత్త.

149
00:08:08,113 --> 00:08:09,323
సరే.

150
00:08:09,406 --> 00:08:13,118
కోచ్ కెంట్, మాకు ఫీబి ప్రవర్తనతో
ఒక సమస్య ఎదురయింది.

151
00:08:17,039 --> 00:08:20,292
-చెప్పండి.
-ఆమె చెడు పదాలు వాడుతోంది. చాలా.

152
00:08:20,375 --> 00:08:21,460
ఎంత ఎక్కువగా వాడుతోంది?

153
00:08:21,543 --> 00:08:25,881
ఇవాళ ఆమె తన క్లాస్ మేట్స్ లో
ఒకళ్ళని "మూర్ఖపు వెధవ" అని అంది.

154
00:08:26,465 --> 00:08:28,050
-వాళ్ళు అలాంటి వాళ్ళేనా?
-ఆ.

155
00:08:28,634 --> 00:08:29,885
కానీ విషయం అది కాదు.

156
00:08:31,345 --> 00:08:33,722
ఆమె ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంటోందో
మీకు ఏమైనా తెలుసా?

157
00:08:39,352 --> 00:08:40,604
నా నుంచా?

158
00:08:42,981 --> 00:08:45,984
ఛ.

159
00:08:46,068 --> 00:08:49,821
ఇది ఆమె ఐదో తప్పు. ఆమెని హెచ్చరించడం
అయింది, ఒక్కదాన్నే కూర్చోబెట్టాము.

160
00:08:49,905 --> 00:08:52,449
ఇప్పుడు ఆమె ఇక ఇంటికి వెళ్ళాలి.

161
00:08:53,075 --> 00:08:54,785
ఆమె మీద మీకున్న ప్రభావం మీకు తెలుసు.

162
00:08:55,369 --> 00:08:56,370
దాన్ని వాడండి.

163
00:08:58,247 --> 00:08:59,831
ఓయ్!

164
00:08:59,915 --> 00:09:00,916
మనం వెళ్తున్నాం.

165
00:09:05,170 --> 00:09:07,130
నేను అన్న దానికి నన్ను
క్షమించండి, మిస్ బోవెన్.

166
00:09:07,214 --> 00:09:08,757
ధన్యవాదాలు, ఫీబి.

167
00:09:09,508 --> 00:09:11,134
అంకుల్ రాయ్,
మనం ఐస్క్రీమ్ తినచ్చా?

168
00:09:11,718 --> 00:09:12,719
కానే కాదు!

169
00:09:14,471 --> 00:09:15,681
క్షమించండి.

170
00:09:17,391 --> 00:09:18,600
కాదు!

171
00:09:20,894 --> 00:09:23,105
పద, ఇక్కడి నుంచి వెళ్దాం.

172
00:09:31,238 --> 00:09:32,948
చెత్త గ్లిట్టర్.

173
00:09:34,533 --> 00:09:37,286
ఏ విధంగా చూసినా, ఇది ఇప్పటివరకు
చేసిన క్రూరమైన చిలిపిపని కాదు,

174
00:09:37,369 --> 00:09:39,997
కానీ వాసెలిన్ శాండ్విచ్ ని
ఎవరూ తినిపించకూడదు.

175
00:09:40,080 --> 00:09:41,790
కానీ అది రానీ ఫౌచ్.

176
00:09:41,874 --> 00:09:42,875
ఆవిష్కర్త.

177
00:09:43,417 --> 00:09:45,252
నేను హాస్పిటల్ లో ఉన్నానని
మీకెలా తెలిసింది?

178
00:09:45,335 --> 00:09:48,547
ఓహ్, మీరు కొన్ని వాయిస్ మెయిల్స్ వదిలారు.
అవును, ఖచ్చితంగా చెప్పాలంటే 32.

179
00:09:49,131 --> 00:09:52,759
-అవి వాటంతటవే డిలీట్ అవుతాయనుకున్నాను.
-ఆ, నేను అన్నీ ఉంచుకున్నాను.

180
00:09:52,843 --> 00:09:54,803
మీరు వాటిలో కొన్నిటిని వినాలి.
అవి అద్భుతం.

181
00:09:54,887 --> 00:09:57,681
-వద్దు, ధన్యవాదాలు.
-పరవాలేదులెండి. అవి ఇక్కడే ఉన్నాయి.

182
00:09:57,764 --> 00:10:01,393
టెడ్, నేను షారన్.
నేను ఇప్పుడు ఫోన్ దగ్గరకు రాలేను.

183
00:10:01,476 --> 00:10:04,479
నువ్వు నీ భావాలను చూపించడానికి భయపడి,

184
00:10:04,563 --> 00:10:08,192
ఏమైనా చెప్పాలని అనుకుంటే
ఒక సందేశం వదిలిపెట్టు.

185
00:10:08,275 --> 00:10:10,068
బీప్!

186
00:10:10,152 --> 00:10:12,988
-నేనలా అనలేదు.
-అబ్బా. కొంచెం అలానే అన్నారు.

187
00:10:13,071 --> 00:10:16,825
దెబ్బ తగిలితే నిజం చెప్తారు, అవునా?
సామెత అదే కదా?

188
00:10:16,909 --> 00:10:20,078
తరువాతది, ఇప్పుడు
మిస్టర్ స్టీఫెన్ సోండైం వస్తారు,

189
00:10:20,162 --> 00:10:22,206
ఎందుకంటే మీరు వెస్ట్ సైడ్ స్టోరీ
నుంచి "టునైట్" పాడారు,

190
00:10:22,289 --> 00:10:25,584
కానీ టోనీ, మారియా
ఇద్దరి భాగాలు ఒకేసారి పాడారు,

191
00:10:25,667 --> 00:10:28,003
అది ఒక పదంలో చెప్పాలంటే చాలా బాగుంది.
వినండి.

192
00:10:28,086 --> 00:10:30,797
టునైట్, టునైట్

193
00:10:30,881 --> 00:10:31,882
అది తెలుస్తోంది.

194
00:10:31,965 --> 00:10:34,218
మీరు మొదటి అంకం అంతా చేసారు.
అది అద్భుతం.

195
00:10:39,598 --> 00:10:40,891
మెక్ అడూ

196
00:11:07,459 --> 00:11:09,002
ఇందులో అంత గొప్ప విషయం ఏముంది?

197
00:11:10,212 --> 00:11:11,547
ఇప్పుడు కాదు.

198
00:11:11,630 --> 00:11:14,383
నా మిత్రుడు,
ఐసాక్, క్లిప్పర్లతో ఒక కళాకారుడు.

199
00:11:14,466 --> 00:11:16,718
కానీ అతను ఒక సీజన్ కి
ఒక హెయిర్ కట్ మాత్రమే చేస్తాడు,

200
00:11:16,802 --> 00:11:19,179
అందుకని దాని ఒక ప్రత్యేక
సందర్భం కోసం దాచుకుంటాము.

201
00:11:19,263 --> 00:11:20,973
నాది నా పెళ్లి కోసం ఉంచుకుంటాను.

202
00:11:22,057 --> 00:11:23,183
లేదా సుంతీ చేయించుకునేవరకు.

203
00:11:23,267 --> 00:11:24,393
అవును.

204
00:11:24,476 --> 00:11:27,020
నీ ఐసాక్ కట్ ని ఒక బ్లైండ్ డేట్ కి వృధా
చేసుకుంటున్నావంటే నేను నమ్మలేను.

205
00:11:27,104 --> 00:11:29,815
అవును. నీకు, ఆమెకి మధ్యలో కేవలం
టెక్స్ట్ లలోనే కెమిస్ట్రీ ఉంటే?

206
00:11:29,898 --> 00:11:30,899
వినండి…

207
00:11:32,025 --> 00:11:33,026
ఇది ప్రత్యేకం అవ్వచ్చని...

208
00:11:34,903 --> 00:11:36,530
…నేను అనుకుంటాను.

209
00:11:44,288 --> 00:11:45,622
అయితే మనమందరం ఇలా నుంచుని...

210
00:11:45,706 --> 00:11:47,666
అబ్బా.

211
00:11:48,250 --> 00:11:50,502
నోరు మూసుకో, యాన్ మాస్.

212
00:11:52,171 --> 00:11:53,172
క్షమించండి.

213
00:12:01,096 --> 00:12:02,681
అబ్బా. అబ్బా.

214
00:12:02,764 --> 00:12:03,974
ఇది స్వాన్ లేక్ లా ఉంది.

215
00:12:38,842 --> 00:12:41,553
ఓహ్! అవును!

216
00:12:48,143 --> 00:12:51,313
"నాన్న"
వెంబ్లీ టికెట్లు ఏర్పాటు చేశావా?

217
00:13:05,661 --> 00:13:06,662
లోపలికి రండి!

218
00:13:11,250 --> 00:13:12,251
హాయ్.

219
00:13:14,419 --> 00:13:15,420
ఇది దేని గురించి?

220
00:13:16,004 --> 00:13:18,799
నాకు ఆఫీసు వచ్చేవరకు
నేను ఇక్కడ పని చేస్తాను.

221
00:13:19,299 --> 00:13:20,717
ఇదేమీ సమస్య కాదు.

222
00:13:20,801 --> 00:13:24,179
నేను ఏమైనా పారబోసుకుంటే,
శుభ్రం చేయడానికి అన్నీ పక్కనే ఉంటాయి.

223
00:13:24,805 --> 00:13:25,931
ఇది చాలా, చాలా బాధగా ఉంది.

224
00:13:26,974 --> 00:13:28,308
ఆ. నీకు ఏం కావాలి, జేమీ?

225
00:13:29,560 --> 00:13:32,396
ఆ… మా నాన్న, ఆయన ఇద్దరు స్నేహితులకి
వెంబ్లీ లిస్టులో రెండు టికెట్లు ఇవ్వగలరా?

226
00:13:32,479 --> 00:13:35,816
ఇవ్వగలను! ఫామిలీ సెక్షన్? విఐపి?

227
00:13:35,899 --> 00:13:37,901
వాళ్ళకి కార్ పార్క్ లో ఇచ్చినా,
నాకు అనవసరం.

228
00:13:37,985 --> 00:13:39,862
ఆయన నన్ను విసిగించడం ఆపాలంటే
ఆయనకి టికెట్లు కావాలి.

229
00:13:40,571 --> 00:13:41,822
తండ్రీ కొడుకులు.

230
00:13:41,905 --> 00:13:43,365
చాలా కష్టం.

231
00:13:43,448 --> 00:13:45,659
దీని గురించి పాటలు రాయాలి.

232
00:13:46,660 --> 00:13:49,079
-రాసారనుకుంటాను.
-ఆ, నాకు తెలుసు. నేను...

233
00:13:50,372 --> 00:13:51,623
సరేలే...

234
00:13:53,208 --> 00:13:56,461
మీరు, ఆ… మీ నాన్నగారితో సన్నిహితంగా ఉంటారా?

235
00:13:56,545 --> 00:13:59,548
లోటుపాట్లు అందరి దగ్గరా ఉంటాయి.

236
00:13:59,631 --> 00:14:00,966
అది క్లిష్టమైంది.

237
00:14:01,049 --> 00:14:03,260
నాది క్లిష్టమేమీ కాదు.
ఆయనొక వెధవ.

238
00:14:03,343 --> 00:14:06,013
ప్రతి సందర్భంలో, ఒక వెధవ ఎలా
ప్రవర్తిస్తాడో ఆయన అలానే ప్రవర్తిస్తారు.

239
00:14:06,847 --> 00:14:08,432
మీరు అందుకు ఏమీ చెయ్యలేరు.
నేననేది అర్థమైంది కదా?

240
00:14:08,515 --> 00:14:12,728
ఆయన అయిన దానికి మా నాన్నని ప్రేమిస్తాను,
ఆయన కాలేని దానికి ఆయనని క్షమిస్తాను.

241
00:14:14,855 --> 00:14:20,277
చూడు, జేమీ. ఆయన ఎలా ఉన్నా,
ఆయన మీ నాన్న, అందుకని ఆయన విఐపి.

242
00:14:21,612 --> 00:14:22,946
పేర్లు ఏమిటి?

243
00:14:23,030 --> 00:14:24,489
జేమ్స్ టార్ట్.

244
00:14:26,533 --> 00:14:30,746
ఆయన స్నేహితులు
డెన్బో కల్లెన్స్, ఇంకా బగ్.

245
00:14:31,830 --> 00:14:34,666
-"బగ్"?
-కేవలం బగ్. ఒక్క జి.

246
00:14:34,750 --> 00:14:35,918
ఆ జంతువులా.

247
00:14:36,502 --> 00:14:37,920
అది అతని లీగల్ పేరు. మార్చుకున్నాడు.

248
00:14:38,003 --> 00:14:40,005
ఒక బగ్ లా చిన్నగా ఉంటాడనా?

249
00:14:40,088 --> 00:14:41,715
కాదు, డబ్బు కోసం బగ్స్ ని తింటాడు.

250
00:14:42,216 --> 00:14:43,217
సరే.

251
00:14:45,135 --> 00:14:46,345
ఆ… అందు కోసం ధన్యవాదాలు.

252
00:14:46,428 --> 00:14:47,513
సరే.

253
00:14:47,596 --> 00:14:48,597
సరే.

254
00:14:49,389 --> 00:14:50,432
తెరిచి ఉంచనా, మూయనా?

255
00:14:51,433 --> 00:14:52,559
మూసేయ్.

256
00:14:52,643 --> 00:14:53,810
అప్పుడు ఎవరూ ప్రశ్నలు అడగరు.

257
00:14:54,770 --> 00:14:56,396
-సరే.
-బై.

258
00:15:02,903 --> 00:15:04,613
ఐస్క్రీమ్ కి ధన్యవాదాలు, అంకుల్ రాయ్.

259
00:15:05,656 --> 00:15:06,907
ఓయ్!

260
00:15:13,288 --> 00:15:14,831
నువ్వు చెడ్డ పదాలు అనకూడదు, ఫీబి

261
00:15:15,415 --> 00:15:16,917
కానీ మీరవి ఎప్పుడూ అంటూనే ఉంటారు.

262
00:15:17,000 --> 00:15:18,085
అవును.

263
00:15:18,168 --> 00:15:21,547
నేనొక ఫుట్ బాలర్ ని కాబట్టి
అది నా పురోగతిని ఆపలేదు.

264
00:15:21,630 --> 00:15:25,092
మేము చెడ్డ మాటలన్నా ఎవరూ పట్టించుకోరు.
అది నా వృత్తిలో భాగం. దాన్ని ప్రోత్సహిస్తారు.

265
00:15:26,552 --> 00:15:30,097
నువ్వొక డాక్టర్ లేదా టీచర్ లేదా...

266
00:15:30,180 --> 00:15:32,266
లేదా అడవి జంతువులకు డాక్టర్ కాలేవు.

267
00:15:32,349 --> 00:15:35,185
లేదా అడవి జంతువులకు డాక్టర్ కాలేవు.
అదెలా ఉంటుందో నాకు తెలీదు.

268
00:15:35,269 --> 00:15:37,020
నువ్వు వాటికి అడవిలో చికిత్స చేస్తే
డబ్బు ఎవరిస్తారు?

269
00:15:37,104 --> 00:15:38,105
అది అనవసరం.

270
00:15:38,188 --> 00:15:42,860
విషయం ఏమిటంటే నువ్వు ఎప్పుడూ
చెడ్డ పదాలు వాడుతూ ఉంటే అలా చేయలేవు.

271
00:15:46,196 --> 00:15:49,491
విను. నువ్వు, నేను కలిసి
చాలా సమయం గడుపుతాము,

272
00:15:50,075 --> 00:15:51,493
నాకు ప్రతి క్షణం నచ్చుతుంది.

273
00:15:53,662 --> 00:15:56,081
నాకు పిల్లలతో ఎలా ఉండాలో
ఎవరూ నేర్పించలేదు.

274
00:15:58,041 --> 00:15:59,626
కొన్నిసార్లు…

275
00:16:00,878 --> 00:16:02,504
నాలోని దురలవాట్లను…

276
00:16:05,465 --> 00:16:10,387
నీకు ఇస్తున్నానేమోనని
నాకు భయంగా ఉంటోంది.

277
00:16:10,971 --> 00:16:12,681
అది నిజం కాదు.

278
00:16:13,515 --> 00:16:16,268
అంకుల్ రాయ్,
మీరు నాకు గొప్ప విషయాలు నేర్పిస్తారు.

279
00:16:17,144 --> 00:16:19,605
నేనా అబ్బాయిని అలా అన్నది
ఆ అబ్బాయి ఒక రౌడీ అని.

280
00:16:19,688 --> 00:16:22,608
మీ కారణంగా నేను అలాంటి వాళ్ళని
ధైర్యంగా ఎదుర్కొంటున్నాను.

281
00:16:25,694 --> 00:16:26,695
ఇంకా రెఫరీలని.

282
00:16:29,364 --> 00:16:31,241
నేనలా చెడ్డ పదాలు వాడకుండా చెయ్యగలను.

283
00:16:31,950 --> 00:16:32,951
సరే.

284
00:16:33,785 --> 00:16:35,329
ఎందుకంటే నువ్వు నాకన్నా మంచిదానివి.

285
00:16:36,121 --> 00:16:37,664
నేను మీలోని ఉత్తముడి అంత మంచిదాన్ని.

286
00:16:39,249 --> 00:16:41,418
మనం కలిసి చెడ్డ పదాలు వాడడం ఆపచ్చేమో.

287
00:16:41,502 --> 00:16:42,878
ఇంకా నయం.

288
00:16:44,296 --> 00:16:45,297
నేను ఆపలేను.

289
00:16:46,173 --> 00:16:47,174
కానీ నువ్వు అపగలవు.

290
00:16:49,676 --> 00:16:50,969
చాలా ప్లీజ్.

291
00:16:51,053 --> 00:16:52,471
సరే, అంకుల్ రాయ్.

292
00:16:53,305 --> 00:16:55,516
మంచిది. ఇక పద.

293
00:16:55,599 --> 00:16:59,019
ఒక గేమ్ ప్రిన్సెస్ అండ్ డ్రాగన్
ఆడుకోడానికి వస్తారా?

294
00:16:59,603 --> 00:17:01,230
ఈసారి నేను డ్రాగన్ అవ్వచా?

295
00:17:01,313 --> 00:17:02,731
లేదు.

296
00:17:02,814 --> 00:17:05,025
సరే. కానీ నువ్వా వాండ్ బాగుచెయ్యాలి.

297
00:17:09,154 --> 00:17:11,365
సరే. ఇరుక్కుని రావాలి, హా?

298
00:17:11,448 --> 00:17:13,867
దీన్ని మడిస్తే, కొంచెం తేలికగా
ఉంటుందని అంటాను.

299
00:17:13,951 --> 00:17:16,203
నాతో ఇంటికి వచ్చినందుకు ధన్యవాదాలు.
ఇక నేను బానే ఉంటాను.

300
00:17:16,286 --> 00:17:18,454
మీరలా ఇప్పటికి ఐదు సార్లు అన్నారు.

301
00:17:18,539 --> 00:17:20,874
నేను దీన్ని పక్కన పెట్టి,
ఇక వెళ్తాను.

302
00:17:21,583 --> 00:17:23,377
అదుగోండి.

303
00:17:24,127 --> 00:17:26,171
దానికి మంచి చోటు. అదుగొండి.

304
00:17:31,802 --> 00:17:32,928
కార్పోరేట్ ఇల్లు, హా?

305
00:17:33,011 --> 00:17:34,805
ఇది నిరాశ పరచదు, కదా?

306
00:17:34,888 --> 00:17:37,766
ఇందులో బాగుంది అనడానికి
ఏమీ ఉండదు కదా?

307
00:17:37,850 --> 00:17:39,810
ఇక్కడ ఏముంది? హే.

308
00:17:40,769 --> 00:17:43,146
సరే, అలాగే.
హోమ్ ఎంటర్టెయిన్మెంట్ సెంటర్.

309
00:17:43,981 --> 00:17:47,943
అది బాగుందని అంటాను,
మనం ఇక వేరే విషయాలు మాట్లాడుకుందాం.

310
00:17:48,026 --> 00:17:49,319
ఇది కొంత కాలానికే.

311
00:17:49,403 --> 00:17:51,530
ఆ, ఏది కాదు, కదా?

312
00:17:53,031 --> 00:17:54,700
-మీరు టీ తాగుతారా?
-వద్దే వద్దు.

313
00:17:55,409 --> 00:17:59,413
వద్దు, అంటే వద్దు, ధన్యవాదాలు.
క్షమించండి, నాకా చెత్త నచ్చదు.

314
00:17:59,496 --> 00:18:00,956
మా ఇంట్లో మంచి నీళ్ళు, వైన్ ఉంది.

315
00:18:01,039 --> 00:18:03,083
చికెన్, ఇంకా గుడ్డు, హా? సరే.

316
00:18:03,166 --> 00:18:05,210
నేను మంచి నీళ్ళు తాగుతాను.
అది చాలు. ధన్యవాదాలు.

317
00:18:06,003 --> 00:18:07,004
ట్యాప్ నీళ్ళు తాగుతారా?

318
00:18:07,087 --> 00:18:11,216
తాగుతాను. నాకు నా నీళ్ళు కిరి ఇర్వింగ్ కి
తన భూమి నచ్చినట్టు నచ్చుతుంది. నేరుగా.

319
00:18:13,177 --> 00:18:15,053
ది మిడిల్ పాసేజ్ - ఫ్రమ్ మిజరీ
టు మీనింగ్ ఇన్ మిడ్ లైఫ్

320
00:18:18,098 --> 00:18:21,935
అయితే మీరు కొత్త సైకిల్ కొనుక్కుంటారా
లేక కొన్ని రోజులు సైకిల్ వాడడం ఆపేస్తారా?

321
00:18:22,019 --> 00:18:23,896
ఏమో. నేను దాని గురిచి ఆలోచించలేదు.

322
00:18:23,979 --> 00:18:27,399
మీరా గుర్రాన్ని త్వరలోనే ఎక్కుతారని ఆశిస్తాను.
గుర్రం అంటే నా ఉద్దేశం, సైకిల్.

323
00:18:27,482 --> 00:18:30,569
కానీ మీరు ఆఫీసుకి గుర్రం మీద
వస్తే ఎంత బాగుంటుందో కదా?

324
00:18:30,652 --> 00:18:32,487
అందరూ మిమ్మల్ని
"డా. షారన్ హార్స్ ఉమన్" లేదా...

325
00:18:32,571 --> 00:18:33,864
అది మీ ప్రత్యేకం అవుతుంది.

326
00:18:33,947 --> 00:18:35,741
నేను నిజంగా విశ్రాంతి తీసుకోవాలి.

327
00:18:35,824 --> 00:18:38,911
హే, 10-4, మంచి స్నేహితుడు.
మంచి సహచరుడు.

328
00:18:57,971 --> 00:18:59,306
ఎప్పటిలా రుచిగా ఉంది.

329
00:19:01,808 --> 00:19:04,561
సరే, ఇక నేను వెళ్తాను, ఇంకా...

330
00:19:04,645 --> 00:19:06,772
మీకు ఏమైనా అవసరం అయితే
నాకొక ఫోన్ చెయ్యండి.

331
00:19:06,855 --> 00:19:08,690
ఇవాళ మీకు నిజంగా భయం వేసి ఉండాలి.

332
00:19:08,774 --> 00:19:12,361
నాతో జరిగినలాంటిది జరిగిన వాళ్లకి అందులోంచి
బయట పడడానికి సహాయం చేయడం నా ఉద్యోగం.

333
00:19:12,444 --> 00:19:13,779
నేను బానే ఉన్నాను, ధన్యవాదాలు.

334
00:19:13,862 --> 00:19:15,072
గుడ్ బై, కోచ్ లాసో.

335
00:19:17,824 --> 00:19:19,660
సరే, డాక్. జాగ్రత్తగా ఉండండి.

336
00:19:27,417 --> 00:19:30,420
లే టుక్కి

337
00:19:41,431 --> 00:19:42,891
దేవుడా! హలో.

338
00:19:44,226 --> 00:19:45,978
ఇప్పుడు ఫోన్ ఎందుకు తీసుకున్నావు?

339
00:19:46,061 --> 00:19:47,646
నువ్వు ఐదు నిమిషాల క్రితమే లోపలికి వెళ్ళాలి.

340
00:19:47,729 --> 00:19:49,606
అవును. నేను లోపలికి వెళ్ళలేను.

341
00:19:49,690 --> 00:19:52,401
అబ్బా. ఇంకా నయం.
నువ్వు వెళ్ళగలవు. వెళ్ళు.

342
00:19:52,484 --> 00:19:54,570
ఇది అధ్భుతమైన రాత్రి అన్నా అవుతుంది

343
00:19:54,653 --> 00:19:55,946
లేదా ఎంత చెత్తగా ఉంటుందంటే

344
00:19:56,029 --> 00:19:58,782
నువ్వు మన మిగతా స్నేహంలో అంతా
నన్ను శిక్షిస్తూ గడపచ్చు.

345
00:19:59,408 --> 00:20:00,784
హా. నాకది నచ్చింది.

346
00:20:00,868 --> 00:20:03,078
నువ్వు వెళ్తావు కాబట్టి
నేను ఫోన్ పెట్టేస్తున్నాను, సరేనా?

347
00:20:04,162 --> 00:20:06,915
నువ్వు అందంగా ఉన్నావు, తట్టుకోలేకపోతున్నాను.

348
00:20:19,553 --> 00:20:21,847
మిస్ వెల్టన్. రెబెక్కా.

349
00:20:22,389 --> 00:20:23,390
సామ్!

350
00:20:23,473 --> 00:20:26,768
-హాయ్. హలో.
-ఇది ఒక యాదృచ్చికం.

351
00:20:29,271 --> 00:20:30,272
ఏంటి... ఏమైంది?

352
00:20:30,355 --> 00:20:32,482
ఏంటి? అబ్బా. నేను బానే... నేను...

353
00:20:32,566 --> 00:20:36,695
నాకు కొంచెం భయంగా అనిపిస్తోంది,
నేను ఒకరిని కలవబోతున్నాను.

354
00:20:36,778 --> 00:20:38,155
సరే, నేను...

355
00:20:38,238 --> 00:20:43,202
భయపడకండి, మీరు ఎప్పటిలా
చాలా అందంగా ఉన్నారు.

356
00:20:43,702 --> 00:20:45,078
ధన్యవాదాలు, సామ్.

357
00:20:45,162 --> 00:20:47,497
అయ్యో, నా వలన నీకు...

358
00:20:47,581 --> 00:20:50,042
-నీ సాయంత్రాన్ని ఆనందించు.
-అలాగే. ధన్యవాదాలు. మీరు కూడా.

359
00:20:50,125 --> 00:20:51,168
నీ హెయిర్ కట్ బాగుంది.

360
00:20:51,251 --> 00:20:53,921
-ఓహ్. ధన్యవాదాలు.
-సరే.

361
00:20:54,004 --> 00:20:55,422
ఇది వింతగా ఉంది.

362
00:21:04,389 --> 00:21:07,726
సామ్ ఇక్కడున్నాడు. ఇబ్బందిగా ఉంది!

363
00:21:12,439 --> 00:21:13,440
కీలీ హాయ్ చెప్తోంది.

364
00:21:14,066 --> 00:21:16,318
ఓహ్... నేనూ హలో చెప్పానని చెప్పండి.

365
00:21:27,913 --> 00:21:30,749
నేను బార్ లో ఉన్నాను.
బ్లూ కలర్ సూట్ వేసుకున్నాను.

366
00:21:37,422 --> 00:21:38,632
అబ్బా!

367
00:21:38,715 --> 00:21:39,842
-ఏంటి?
-ఛ.

368
00:21:39,925 --> 00:21:40,884
-ఏంటి?
-ఛ.

369
00:21:40,968 --> 00:21:43,262
-ఏంటి? ఏంటి? ఏంటి?
-ఛ. దేవుడా, ఇలా జరగడానికి వీల్లేదు!

370
00:21:43,345 --> 00:21:46,265
-కానీ జరుగుతోంది.
-నేనిక్కడికి రాకుండా ఉండాల్సింది.

371
00:21:46,348 --> 00:21:48,851
-కానీ మీరు వచ్చారు.
-కాదు. సామ్.

372
00:21:50,102 --> 00:21:51,854
మనం చేయలేము...
నేను నీ బాస్ ని.

373
00:21:53,063 --> 00:21:57,609
కాదు, కాదు. నువ్వు చాలా చిన్నవాడివి.
నీకు ఎన్నేళ్ళు, 24 ఉంటాయా?

374
00:21:57,693 --> 00:22:00,195
-నాకు 21.
-దేవుడా. నేనొక పెడోఫైల్.

375
00:22:00,279 --> 00:22:03,323
నాకు... నిన్ను సిద్ధం చేసినట్టనిపిస్తోంది.
ఈ సందేశాలు. నేను నిన్ను సిద్ధం చేసాను!

376
00:22:03,407 --> 00:22:06,034
మీరు నన్ను సిద్ధం చెయ్యలేదు, సరేనా?
మనం ఎవరో మనకి తెలియదు.

377
00:22:06,118 --> 00:22:09,538
సరే, కానీ... కానీ మనకు
ఇప్పుడు తెలుసు, ఇది జరగదు.

378
00:22:09,621 --> 00:22:14,001
లేదు, ఇది జరగకూడదు.
ఇది జరగలేదు, సరేనా?

379
00:22:14,084 --> 00:22:15,085
దేవుడా.

380
00:22:15,169 --> 00:22:18,839
ఆగండి. ఆగండి, ఆగండి,
ఆగండి, ఆగండి, ఆగండి.

381
00:22:18,922 --> 00:22:20,424
మనం... మనం... మనం ఇప్పటికీ...

382
00:22:20,507 --> 00:22:24,303
-క్షమించండి. క్షమించండి.
-హలో. హాయ్. క్షమించండి.

383
00:22:26,054 --> 00:22:30,434
వినండి. మనం కలిసి డిన్నర్ చేయచ్చు. సరేనా?
అది డేట్ కానవసరం లేదు.

384
00:22:30,517 --> 00:22:32,644
మనం... మనం ఇద్దరం

385
00:22:32,728 --> 00:22:36,982
ఒకే అద్భుతమైన రెస్టారెంట్ కి వచ్చి,
ఇద్దరం ఒంటరిగా ఉండి,

386
00:22:37,065 --> 00:22:39,276
ఆకలిగా కూడా ఉన్న...

387
00:22:40,694 --> 00:22:42,738
...సరదా అయిన
యాదృచ్చికం కావచ్చు

388
00:22:44,656 --> 00:22:45,908
అలా జరగచ్చు.

389
00:22:47,284 --> 00:22:48,285
కదా?

390
00:22:51,788 --> 00:22:53,332
అంటే, నాకు చాలా ఆకలేస్తోంది.

391
00:23:31,495 --> 00:23:34,498
...లస్ట్ కాన్కర్స్ ఆల్ కి తిరిగి స్వాగతం.

392
00:23:34,581 --> 00:23:37,376
మునుపటి సీజన్లలో మా గెలిచిన జంటలు...

393
00:23:37,459 --> 00:23:38,627
కోచ్ లాసో

394
00:23:38,710 --> 00:23:42,923
ఇది గత సీజన్ విజేతలు
ఎల్లీ మరియు డాంతోనీ,

395
00:23:43,006 --> 00:23:44,174
లేదా సీజన్ వన్ విజేతలు…

396
00:23:44,258 --> 00:23:45,759
హలో, కోచ్ లాసో.

397
00:23:45,843 --> 00:23:50,055
హే, డాక్. ఇవాళ రాత్రికి నేను మీకు
ప్రతి 20 నిమిషాలకు ఫోన్ చేస్తాను.

398
00:23:50,138 --> 00:23:51,849
అది తలకు దెబ్బ తగిలినప్పుడు
ప్రామాణిక ప్రోటోకాల్,

399
00:23:51,932 --> 00:23:54,226
కానీ మీకు ఫోన్ చేసిన ప్రతిసారీ
నేను గొంతు మార్చి మాట్లాడతాను,

400
00:23:54,309 --> 00:23:55,727
అప్పుడు మీకది ఉత్సాహంగా ఉంటుంది.

401
00:23:55,811 --> 00:23:57,729
కళ్ళు
తిరుగుతున్నట్టు, వాంతి వచ్చేలా ఉందా?

402
00:23:59,273 --> 00:24:01,275
అయితే మీరు నవ్వితే ఇలా ఉంటుందా.

403
00:24:02,776 --> 00:24:04,194
నేను బానే ఉన్నాను, కోచ్ లాసో.

404
00:24:05,404 --> 00:24:08,198
అయితే మీతో మళ్ళీ
ఇరవై నిమిషాల్లో మాట్లాడతాను. స్లింగ్ బ్లేడ్. హా.

405
00:24:09,449 --> 00:24:10,576
హే, టెడ్…

406
00:24:10,659 --> 00:24:11,952
అవును.

407
00:24:12,578 --> 00:24:15,122
నాకివాళ భయం వేసింది.
నిజంగా భయం వేసింది.

408
00:24:17,416 --> 00:24:20,169
నాకు నా సైకిల్ తొక్కడం చాలా ఇష్టం.
అది నా సంతోషకరమైన ప్రదేశం.

409
00:24:20,252 --> 00:24:27,092
ఇవాల్టి తరువాత, నేను సైకిల్
తొక్కలేనేమోనని భయం వేసింది.

410
00:24:28,552 --> 00:24:30,596
భయం అనేది
అండర్ వేర్ లాంటిందని అంటాను.

411
00:24:30,679 --> 00:24:34,224
లేదు, నాకు దాన్ని చర్చించాలని లేదు.
నాకు ఇలాంటి మాటలు వద్దు.

412
00:24:34,892 --> 00:24:37,561
టెడ్, నాకెలా అనిపిస్తోందో
నీకు చెప్పాలని అనుకున్నాను.

413
00:24:37,644 --> 00:24:40,063
అందుకు ధన్యవాదాలు. నిజంగా.

414
00:24:40,647 --> 00:24:42,149
నేను చెప్పినందుకు
నాకు సంతోషంగా ఉంది.

415
00:24:42,232 --> 00:24:43,901
ఈ వారాంతం గుడ్ లక్.

416
00:24:48,155 --> 00:24:49,573
విజర్డ్ ఆఫ్ ఆజ్
#1 ఏసిఎం - #2 టెడ్

417
00:24:49,656 --> 00:24:50,657
సరే, ఏ-సి-ఎం,

418
00:24:50,741 --> 00:24:53,327
నాకు నువ్వెవరో తెలియదు
కానీ నేను నిన్ను వేటాడతాను.

419
00:24:53,410 --> 00:24:54,411
పదండి వెళ్దాం.

420
00:24:54,494 --> 00:24:55,495
సరే.

421
00:24:57,581 --> 00:24:59,166
అబ్బా, దీనికి అడుగే లేదు.

422
00:24:59,249 --> 00:25:00,751
మిమ్మల్ని మెచ్చుకోవాలి.

423
00:25:00,834 --> 00:25:04,004
సాధారణంగా అమ్మాయిలు డేట్ లకు
వచ్చినప్పుడు చిన్న పర్సులు తెస్తారు.

424
00:25:04,087 --> 00:25:05,672
-వాటిని ఏమంటారు?
-క్లచ్.

425
00:25:05,756 --> 00:25:07,174
క్లచ్.

426
00:25:07,257 --> 00:25:09,801
లేదు, ఫోన్ కూడా పట్టని

427
00:25:09,885 --> 00:25:12,513
ఆ చిన్న పర్సుల కన్నా
పెద్ద బ్యాగులనే ఇష్టపడతాను.

428
00:25:13,096 --> 00:25:15,265
-దొరికింది.
-ఇది డేట్ కాదు.

429
00:25:16,183 --> 00:25:17,184
నాకు తెలుసు.

430
00:25:18,685 --> 00:25:19,811
అయితే...

431
00:25:22,564 --> 00:25:24,399
మనం ఇలా మళ్ళీ ఎప్పుడైనా చేయచ్చా?

432
00:25:25,859 --> 00:25:27,778
నేను ఒక్కదాన్నే లోపలికి వెళ్తున్నాను.

433
00:25:32,449 --> 00:25:33,450
సరే.

434
00:25:44,586 --> 00:25:47,464
లేదు, లేదు. మళ్ళీ ఎప్పుడూ కాదు, సామ్.

435
00:25:48,715 --> 00:25:49,716
నేను నిజంగా అంటున్నాను.

436
00:25:52,010 --> 00:25:53,011
నేను నిజంగా అనాలి.

437
00:25:54,137 --> 00:25:56,390
అవును, అవును. మీరు సరిగ్గా చెప్తున్నారు.

438
00:25:57,724 --> 00:26:00,477
-అదీ కాకుండా, ఆదివారం పెద్ద గేమ్ ఉంది.
-అవును.

439
00:26:00,561 --> 00:26:02,437
మన ఇద్దరికీ విశ్రాంతి కావాలి.

440
00:26:02,521 --> 00:26:03,730
అవును.

441
00:26:04,773 --> 00:26:05,774
మంచిది.

442
00:26:10,112 --> 00:26:11,613
-గుడ్ నైట్.
-ధన్యవాదాలు.

443
00:26:16,285 --> 00:26:17,286
ఓహ్, అబ్బా.

444
00:26:19,913 --> 00:26:21,123
అబ్బా.

445
00:27:07,002 --> 00:27:08,504
జెంటిల్మెన్.
దృష్టి పెట్టండి.

446
00:27:10,255 --> 00:27:12,508
సరే. మీరందరూ మీ కళ్ళు మూసుకోండి.

447
00:27:13,217 --> 00:27:14,426
చుట్టూ చూడండి.

448
00:27:15,260 --> 00:27:18,680
మీకు తెలుసు.
కళ్ళు తెరిచి అంతా ఆస్వాదించండి.

449
00:27:19,473 --> 00:27:25,646
కానీ నా వెనుక ఉన్నది ఒక మామూలు
పాత ఫుట్ బాల్ పిచ్ అని గుర్తుంచుకోండి.

450
00:27:26,230 --> 00:27:28,315
మీరు ఆ స్టేడియం, స్టాండ్లు అన్నీ తీసేస్తే,

451
00:27:28,398 --> 00:27:33,028
ఇది కూడా నెల్సన్ రోడ్ లో ఉన్న
మన పిచ్ లాంటిదే అని చూస్తారనుకుంటాను.

452
00:27:33,111 --> 00:27:35,030
-కాదు.
-ఏంటది?

453
00:27:35,113 --> 00:27:36,823
ఇది 500 గజాలు పెద్దది.

454
00:27:36,907 --> 00:27:39,326
-నిజంగా? పిచ్ లు అన్నీ ఒకే సైజులో ఉండవా?
-ఉండవు.

455
00:27:39,409 --> 00:27:42,204
-ఇది దేశంలోనే అతి పెద్ద పిచ్
-సిటీకి చాలా పెద్ద ప్రయోజనం.

456
00:27:42,287 --> 00:27:46,625
అబ్బా. ఈ క్రీడలో అన్నీ
తింగర నియమాలు ఉన్నాయి.

457
00:27:46,708 --> 00:27:48,210
కొన్ని సార్లు అర్థం చేసుకోవడం
కష్టంగా ఉంది. సరే.

458
00:27:48,293 --> 00:27:50,546
సరే. ఏంటో తెలుసా? ఇది పెద్దది.

459
00:27:50,629 --> 00:27:54,049
సరే, మీరందరూ ఈ ఫీల్డ్ లో
ఆడిన గేమ్స్ చూస్తూ పెద్దయ్యారు,

460
00:27:54,132 --> 00:27:56,009
అందుకని మీకు కొంచెం భయంగా ఉండచ్చు.

461
00:27:56,093 --> 00:27:57,678
అబ్బా, నాకు గగుర్పాటుగా ఉంది.

462
00:27:58,262 --> 00:28:00,556
నా చిన్నప్పుడు టీవీ ముందు కూర్చుని,

463
00:28:00,639 --> 00:28:03,642
లైవ్ ఎయిడ్ సమయంలో
క్వీన్ ప్రదర్శన చూడడం గుర్తుంది.

464
00:28:03,725 --> 00:28:05,602
-లేదు, నువ్వు చూడలేదు.
-అది పాత వెంబ్లీ.

465
00:28:05,686 --> 00:28:07,396
ఆ ఫీల్డ్ ఇంకా పెద్దది.

466
00:28:07,479 --> 00:28:08,480
అది అనవసరం.

467
00:28:08,564 --> 00:28:13,068
విషయం ఏమిటంటే,
మనం ఇప్పుడు ఇక్కడున్నాము.

468
00:28:13,151 --> 00:28:14,152
వెంబ్లీలో.

469
00:28:15,320 --> 00:28:17,656
ఫ్రెడ్డీ మెర్క్యురీ ఎన్నడూ అడుగు పెట్టనిది.

470
00:28:18,323 --> 00:28:20,033
ఇవాళ మనం చరిత్ర సృష్టించే రోజు.

471
00:28:20,534 --> 00:28:22,244
మనం అదే చేయబోతున్నాం అని నమ్ముతాను.

472
00:28:22,744 --> 00:28:25,706
మీరు ఇంకోక్కసారి చూడండి,
తరువాత మనం లోపలికి వెళ్దాము.

473
00:28:25,789 --> 00:28:26,999
ఎందుకంటే మనకు చాలా పని ఉంది.

474
00:28:33,005 --> 00:28:36,175
ఎమిరేట్స్ ఎఫ్ఏ కప్
సెమీ ఫైనల్స్

475
00:28:40,220 --> 00:28:42,764
రిచ్మండ్!

476
00:29:01,366 --> 00:29:02,701
సిటీ!

477
00:29:04,828 --> 00:29:06,955
-సిటీ!
-సిటీ!

478
00:29:09,708 --> 00:29:10,959
ఇది చూడు. చాలా బాగుంది, కదా?

479
00:29:11,043 --> 00:29:14,338
మంచిది.
హే, ఈ సీట్లు చాలా బాగున్నాయి.

480
00:29:14,421 --> 00:29:17,466
నీ కొడుకు సెమీ ఫైనల్స్ లో
ఆడితే ఇలానే ఉంటుంది.

481
00:29:18,050 --> 00:29:21,470
సరైన టీమ్ లో ఆడడం లేదు,
కానీ అందుకు నువ్వు ఏం చేయగలవు, హా?

482
00:29:21,553 --> 00:29:23,514
అదుగో. తీసుకో, బాబు.

483
00:29:23,597 --> 00:29:25,557
సెమీ-ఫైనల్
మాంచెస్టర్ సిటీ వెర్సస్ ఏ ఎఫ్ సి రిచ్మండ్

484
00:29:25,641 --> 00:29:28,310
మనం ఈ మ్యాచ్ గెలిస్తే,
రిచ్మండ్ టాటూలు వేయించుకుందాం.

485
00:29:28,393 --> 00:29:29,394
నా దగ్గర ఒకటి ఉంది.

486
00:29:30,187 --> 00:29:32,648
-ఎక్కడ?
-నీ పని నువ్వు చూసుకో.

487
00:29:34,149 --> 00:29:35,817
ఇది ఎలా సహాయం చేస్తుందో నాకు…

488
00:29:35,901 --> 00:29:37,611
వాళ్ళ జీవితంలో అత్యధ్భుతమైన
ఆట ఆడితే ఎలా ఉంటుంది?

489
00:29:37,694 --> 00:29:39,488
అవును. నేను అదే ఆశిస్తున్నాను.

490
00:29:46,078 --> 00:29:47,079
బానే ఉన్నారా, కోచ్?

491
00:29:48,789 --> 00:29:49,998
బానే ఉన్నాను.

492
00:29:50,082 --> 00:29:54,211
నేను డాక్ నేర్పించిన శ్వాస తీసుకుని
వదిలే వ్యాయామాలు చేస్తున్నాను, అంతే.

493
00:29:54,711 --> 00:29:56,672
మళ్ళీ కడుపులో ఇబ్బందులు కావనుకుంటాను.

494
00:29:56,755 --> 00:29:58,966
నువ్వు ప్రాన్ కాక్టెయిల్ తినలేదు కదా.

495
00:29:59,049 --> 00:30:00,050
లేదు, తినలేదు.

496
00:30:02,010 --> 00:30:03,262
ఆ, మనం వెళ్ళాలి.

497
00:30:05,305 --> 00:30:07,099
పదండి. వెళ్దాం.

498
00:30:08,642 --> 00:30:10,602
హే. ఒక్క నిమిషం ఆగండి.

499
00:30:10,686 --> 00:30:12,980
నేను మీకు ఒక విషయం చెప్పాలి.

500
00:30:14,314 --> 00:30:15,816
నేను టాటెన్హామ్ లో మ్యాచ్ వదిలి వెళ్ళినప్పుడు,

501
00:30:15,899 --> 00:30:19,611
అది... అది నా పొట్ట పాడయినందుకు కాదు.

502
00:30:21,196 --> 00:30:23,156
నేను పానిక్ అటాక్ కి గురయ్యాను.

503
00:30:27,077 --> 00:30:29,413
నాకు ఈ మధ్య అవి ఎక్కువ వస్తున్నాయి,

504
00:30:29,496 --> 00:30:30,497
నేను అది సరిచేసుకుంటున్నాను.

505
00:30:31,206 --> 00:30:34,209
నేను మీకు నిజం చెప్పాలనుకున్నాను.

506
00:30:37,004 --> 00:30:38,005
నా మీద కోపం లేదు కదా?

507
00:30:38,088 --> 00:30:40,340
-లేదు.
-ఆ, లేదు.

508
00:30:40,424 --> 00:30:42,676
సరే. సరే, అయితే.
పదండి, వెళ్దాం.

509
00:30:44,303 --> 00:30:45,596
-మూడు లెక్కపెట్టి రిచ్మండ్.
-ఆగండి!

510
00:30:48,974 --> 00:30:51,059
నేను కూడా ఒక విషయం చెప్పాలి

511
00:30:53,228 --> 00:30:56,565
నేను మన బదిలీ గడువులో
టైమ్ జోన్లను సరిగ్గా చూసుకోలేదు,

512
00:30:56,648 --> 00:31:00,235
అందుకని మనం బ్రెజిల్ నుండి అద్భుతమైన
ఫుల్ బ్యాక్ను సైన్ అప్ చేయలేకపోయాము.

513
00:31:00,319 --> 00:31:01,361
దేవుడా.

514
00:31:01,987 --> 00:31:03,739
-పరవాలేదులే.
-సరే.

515
00:31:03,822 --> 00:31:05,115
-ఆ, సరే.
-అంతా బానే ఉంది.

516
00:31:06,783 --> 00:31:08,744
-సరే.
-పరవాలేదులే. హా.

517
00:31:08,827 --> 00:31:10,245
సరే. ఇదుగోండి.

518
00:31:10,329 --> 00:31:13,165
మీరు రాసే స్కౌటింగ్ రిపోర్టులను
నేను చదవను.

519
00:31:13,248 --> 00:31:14,875
అవి వచ్చినప్పుడల్లా నేను అబద్ధం చెప్పాను.

520
00:31:15,375 --> 00:31:16,877
అవి బోరుగా ఉంటాయి, నేనది చెయ్యను.

521
00:31:20,380 --> 00:31:21,423
చెప్పినందుకు ధన్యవాదాలు.

522
00:31:22,758 --> 00:31:26,136
నేను ఆ క్షణంలో ఐడియాలు
వచ్చినట్లు నటిస్తాను,

523
00:31:26,220 --> 00:31:28,096
కానీ అవి నాకు నెలల ముందే
వచ్చిన మంచి ఐడియాలు.

524
00:31:28,180 --> 00:31:29,890
అవి అప్పుడే వచ్చినట్లు
అనిపించేలా చేస్తాను.

525
00:31:29,973 --> 00:31:31,266
హా, అది మంచి ఎత్తు.

526
00:31:32,059 --> 00:31:33,519
మొదటి సారి అన్న భ్రాంతి.

527
00:31:33,602 --> 00:31:36,271
నేను ఈ సీజన్ లో ఒక గేమ్ సమయంలో,
అనుకోకుండా పుట్టగొడుగులు తిన్నాను.

528
00:31:37,314 --> 00:31:38,482
"అనుకోకుండా"?

529
00:31:38,565 --> 00:31:42,110
నేను జేన్ ఇంటికి వెళ్ళినప్పుడు,
తప్పు టీపాట్ నుంచి టీ తాగాను.

530
00:31:43,362 --> 00:31:44,738
పోర్ట్ వేల్ మ్యాచా?

531
00:31:45,781 --> 00:31:46,949
-అవును.
-సరే.

532
00:31:47,491 --> 00:31:48,867
అలా ఇంకెప్పుడూ జరగదు.

533
00:31:50,577 --> 00:31:51,578
ధన్యవాదాలు.

534
00:31:54,248 --> 00:31:55,290
ధన్యవాదాలు.

535
00:31:55,374 --> 00:31:57,501
-సరే, వెళ్లి వాళ్ళ పని పడదాం.
-మూడు లెక్కపెట్టి బట్స్ అందాం.

536
00:31:57,584 --> 00:31:59,586
-నాకు బానే ఉంది. ఒకటి, రెండు, మూడు.
-బట్స్!

537
00:32:03,257 --> 00:32:05,342
అయితే ఇప్పుడు
మీకు టీ తాగడం నచ్చుతోందా, హా?

538
00:32:05,425 --> 00:32:07,010
మీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు.

539
00:32:10,430 --> 00:32:14,351
వెంబ్లీ స్టేడియం,
ఇంగ్లీష్ ఫుట్ బాల్ యొక్క తాజ్ మహల్.

540
00:32:14,434 --> 00:32:17,855
ప్రతి యువ ఫుట్ బాలార్ కల.

541
00:32:17,938 --> 00:32:22,901
క్రీడా యుద్ధభూమి,
జెయింట్స్ పాదముద్రలతో పాక్ మార్క్ చేయబడింది.

542
00:32:22,985 --> 00:32:27,364
ఈ గొప్ప గ్రౌండ్ తన జాబితాలోకి మరొక
ఊహించని విజయాన్ని చేర్చుకోవాలని ఆశిస్తోంది,

543
00:32:27,447 --> 00:32:29,366
వినయపూర్వకమైన ఏ ఎఫ్ సి రిచ్మండ్ ది.

544
00:32:29,449 --> 00:32:31,618
ఎప్పుడూ ఒక పెద్ద ట్రోఫీ కూడా గెలవలేదు.

545
00:32:31,702 --> 00:32:35,289
వెంబ్లీకి మొదటి సారి చేరిన
చివరన ఉన్న లండన్ క్లబ్.

546
00:32:35,372 --> 00:32:40,169
భూమి మీద తిరుగులేని గొప్ప జట్టు,
శక్తివంతమైన మాంచెస్టర్ సిటీకి వ్యతిరేకంగా

547
00:32:40,252 --> 00:32:42,337
శత్రుత్వాన్ని పునరుద్ధరిస్తోంది.

548
00:32:42,421 --> 00:32:43,922
కేవలం పదకొండు నెలల క్రితమే,

549
00:32:44,006 --> 00:32:48,594
ఈ రిచ్మండ్ టీమ్ ని సిటీ
బాధాకరంగా ఓడించింది.

550
00:32:48,677 --> 00:32:52,931
అప్పుడు జేమీ టార్ట్ ఒక సిటీ ఆటగాడు,
అతను రిచ్మండ్ ని ఓడించడానికి సహాయం చేశాడు.

551
00:32:53,640 --> 00:32:57,853
తరువాత సిటీ అతన్ని M40 లో పంపింది,
అతను మళ్ళీ ఒక గ్రేహౌండ్ అయ్యాడు.

552
00:32:59,229 --> 00:33:01,481
సాధించండి! సాధించండి!

553
00:33:02,065 --> 00:33:06,486
సిటీ మరొక ట్రోఫీ గెలవాలనుకుంటోంది.
రిచ్మండ్ ప్రతీకారం కోరుకుంటోంది.

554
00:33:06,570 --> 00:33:12,242
ఆర్చ్ కింద, వెంబ్లీ స్టేడియంలో
ఆట మొదలవడానికి సిద్ధంగా ఉంది.

555
00:33:12,326 --> 00:33:16,038
ఇది ఎఫ్ఏ కప్ సెమీ ఫైనల్,
అది మొదలవబోతోంది.

556
00:33:24,004 --> 00:33:25,923
-మాంచెస్టర్ సిటీ గోల్ చేసింది!
-ఛ!

557
00:33:26,924 --> 00:33:28,050
కాదు!

558
00:33:28,133 --> 00:33:31,261
-అది ఆఫ్ సైడ్ ఎందుకు కాదు?
-అతను ఆఫ్ సైడ్ కి పక్కగా ఉన్నాడు.

559
00:33:32,054 --> 00:33:34,389
నాకు ఈ నియమం ఇంకా అర్థం కావడం లేదు.
పరావలేదులే.

560
00:33:34,473 --> 00:33:36,767
-మనం బానే ఉన్నాం!
-అది సిటీకి ఒక కార్నర్ కిక్.

561
00:33:37,351 --> 00:33:38,519
అది ఒక గోల్!

562
00:33:38,602 --> 00:33:40,687
-ఛ!
-స్కోర్ రెండు-నిల్.

563
00:33:41,188 --> 00:33:42,147
ఓహ్, రెండు-నిల్!

564
00:33:43,148 --> 00:33:44,483
ఛ!

565
00:33:44,566 --> 00:33:45,859
ఈ ఫ్రీ కిక్ ప్రమాదకరంగా అనిపిస్తోంది.

566
00:33:45,943 --> 00:33:47,694
అవును. ఇప్పుడు స్కోర్ మూడు-నిల్.

567
00:33:48,362 --> 00:33:50,948
రిచ్మండ్ బెంచ్ మీద వాళ్ళు
పరిష్కారాల కోసం వెతుక్కోవాలి.

568
00:33:51,031 --> 00:33:52,032
డిఫెండ్!

569
00:33:52,616 --> 00:33:54,910
-ముగ్గురు అటాకర్లను తీసుకోవాలి...
-కాదు. మనం డిఫెన్సివ్ గా ఆడదాం.

570
00:33:54,993 --> 00:33:57,037
-అందుకు సమయం అయిపోయింది.
-ఒక్కొక్కరుగా మాట్లాడండి.

571
00:33:57,120 --> 00:33:59,373
సరే, కంగారు పడకండి.
హే, అంతా బానే ఉంది.

572
00:33:59,456 --> 00:34:01,416
రిచ్మండ్ రెండవ సగంలో
మ్యాచ్ ని తమ వైపు తిప్పుకోగలదా?

573
00:34:03,919 --> 00:34:07,589
అయ్యో. వాళ్ళు సొంత దానిలో గోల్ చేసారు.
నాలుగు-నిల్.

574
00:34:07,673 --> 00:34:10,050
అబ్బా, అబ్బాయిలు!
మీరు ఇంతకన్నా బాగా ఆడగలరు!

575
00:34:10,132 --> 00:34:12,386
నిందించడానికి మీరు
ఎవరినైనా ఇప్పుడే చూస్తారు.

576
00:34:12,469 --> 00:34:15,304
హే, రెఫ్! కళ్ళు తెరుచుకుని చూడు,
చెత్త వెధవ.

577
00:34:16,473 --> 00:34:18,934
అబ్బా. మైక్ డీన్ తో
ఎప్పుడూ గొడవపడకూడదు.

578
00:34:20,018 --> 00:34:21,353
అలా అనకూడదు, మిత్రమా.
నన్ను క్షమించండి.

579
00:34:22,437 --> 00:34:23,688
అదుగో.

580
00:34:23,772 --> 00:34:25,899
అందుకు క్షమించండి, మైక్. మీకు
పురుషాంగం ఉందని మా అందరికీ తెలుసు.

581
00:34:25,983 --> 00:34:27,025
నన్ను ఇంకా ఘోరంగా కూడా అన్నారు.

582
00:34:29,945 --> 00:34:31,446
సరే, పదండి! మనం సాధించగలం!

583
00:34:33,991 --> 00:34:35,534
అది ఒక పెనాల్టీ.

584
00:34:35,617 --> 00:34:36,784
-రిఫరీ!
-అదేంటి?

585
00:34:36,869 --> 00:34:40,455
నువ్వతన్ని పురుషత్వం లేని వాడని అన్న
తరువాత మైక్ డీన్ మనసు మార్చుకోడు.

586
00:34:41,581 --> 00:34:45,502
సిటీ ఈ మ్యాచ్ ఫలితం గురించి
మిగిలి ఉన్న అనుమానాన్ని పూర్తిగా తీసేసింది.

587
00:34:45,585 --> 00:34:48,005
ఇది ఒక గొడవ అయితే,
వాళ్ళు దాన్ని ఆపేసే వారు.

588
00:34:48,088 --> 00:34:51,300
నిజానికి, ఆర్లో, అన్ని గొడవలను
మొదలవడానికి ముందే ఆపెయ్యాలి.

589
00:34:51,884 --> 00:34:52,885
ఛ!

590
00:34:52,967 --> 00:34:54,553
అబ్బా, ఛ.

591
00:34:54,636 --> 00:34:56,429
పోనీలెండి కోచ్.
దానికి మనం ఏం చెయ్యలేం.

592
00:34:56,513 --> 00:34:58,265
అవును.
దానికి మనం ఏం చెయ్యలేం.

593
00:34:59,183 --> 00:35:00,392
అబ్బా!

594
00:35:02,936 --> 00:35:05,355
హే, జేమీ!
నువ్వు ఒక గోల్ కొట్టచ్చు.

595
00:35:05,439 --> 00:35:07,608
ప్రయోజనం తీసుకో! వెళ్ళు!

596
00:35:15,490 --> 00:35:17,784
రిచ్మండ్ గురించి నేను
చెప్పే ఒక్క విషయం

597
00:35:17,868 --> 00:35:21,580
సామ్ ఒబిసాన్య జుట్టు చాలా బాగుంది.

598
00:35:22,623 --> 00:35:24,791
సిటీ ఫైనల్ లో లెస్టర్ తో పోటీపడుతుంది.

599
00:35:25,375 --> 00:35:27,628
రిచ్మండ్ యొక్క నిరాశ బాధగా ఉన్న
జేమీ టార్ట్ యొక్క తల మీద

600
00:35:27,711 --> 00:35:32,382
భారీగా ఉంటుందని మీరు అనుకోవచ్చు.

601
00:35:35,511 --> 00:35:36,678
అది నా పిర్ర మీద ఉంది.

602
00:35:40,140 --> 00:35:42,184
సరే. అలాగే. అయితే...

603
00:35:42,768 --> 00:35:45,979
అయితే, సామ్, ఇవాళ అంత ఘోరంగా
ఓడిపోయినందుకు ఎలా అనిపించింది?

604
00:35:51,360 --> 00:35:52,361
అది చాలా బాధగా ఉంది.

605
00:35:53,612 --> 00:35:57,157
అది కష్టంగా ఉంది. మేము అభిమానులను
నిరాశపరిచినందుకు నాకు చాలా బాధగా ఉంది.

606
00:36:05,165 --> 00:36:08,460
ఈ విషయంలో చెప్పేందుకు ఏమీ లేదు.
చేయగలిగించి ఏమీ లేదు. అది అయిపోయింది.

607
00:36:08,544 --> 00:36:09,878
రేపు మేము మళ్ళీ మొదలుపెడతాం.

608
00:36:11,755 --> 00:36:13,131
మిస్టర్ టార్ట్.

609
00:36:14,258 --> 00:36:15,634
మీకోసం ఎవరో వచ్చారు.

610
00:36:16,844 --> 00:36:18,136
ఆయన మీ నాన్న అని అంటున్నారు.

611
00:36:20,722 --> 00:36:21,723
ఆ.

612
00:36:22,850 --> 00:36:24,017
నువ్వు బట్టలు వేసుకుని ఉన్నావా?

613
00:36:26,937 --> 00:36:28,522
నేను చెప్పానా. వెధవ.

614
00:36:29,690 --> 00:36:31,650
ఓహ్, జెంటిల్మెన్!
జెంటిల్మెన్!

615
00:36:33,735 --> 00:36:37,114
హే, అది కష్టమైన మ్యాచ్, అబ్బాయిలు.
కష్టమైనది, కానీ సిగ్గుపడాల్సింది ఏమీ లేదు,

616
00:36:37,197 --> 00:36:41,118
ఎందుకంటే మనం ఎప్పుడూ ఓడించం
మనం కేవలం ఆడతాం.

617
00:36:42,619 --> 00:36:44,246
అందుకని మీకు గెలిచే అవకాశమే లేదు.

618
00:36:46,248 --> 00:36:47,916
మా అబ్బాయి ఇక్కడున్నాడు.

619
00:36:49,126 --> 00:36:50,669
నా సొంత రక్త మాంసాలు.

620
00:36:51,420 --> 00:36:52,588
అయ్యో, జేమీ, బాబు.

621
00:36:54,339 --> 00:36:57,176
వీడి మనసు
ఇంకా మంచెస్టర్ లోనే ఉందేమో,

622
00:36:57,259 --> 00:36:59,595
అందుకనే వాడు
ఆ గోల్ చేయడం మిస్ అయ్యాడు.

623
00:37:02,806 --> 00:37:05,934
నువ్వు ఘోరంగా విఫలం అయ్యావు.
విఫలం అయ్యావు.

624
00:37:06,018 --> 00:37:09,771
నువ్వసలు ఏమనుకున్నావు?
నేను ఊరికే అన్నాను. హే.

625
00:37:10,772 --> 00:37:15,235
హే, చిన్న సహాయం చెయ్యి, డెన్బోని,
బగ్ ని సెక్యూరిటీ నుంచి తప్పించు.

626
00:37:15,319 --> 00:37:17,696
వాళ్లకి పిచ్ మీద కొన్ని ఫోటోలు
తీసుకోవాలని ఉంది, సరేనా?

627
00:37:18,906 --> 00:37:19,907
నేనలా చెయ్యను.

628
00:37:19,990 --> 00:37:22,659
వాళ్ళకి చూడాలని ఉంది.
ఎక్కువ సమయం పట్టదు. విను.

629
00:37:23,702 --> 00:37:25,329
నేనలా చెయ్యను.

630
00:37:25,412 --> 00:37:26,663
ఏంటి?

631
00:37:27,247 --> 00:37:29,416
ఏంటి, నువ్వలా భయంకరంగా ఓడిపోయావని

632
00:37:29,499 --> 00:37:31,543
ఇప్పుడు మూతి ముడుచుకుని
ఇలా ఉంటావా?

633
00:37:31,627 --> 00:37:33,337
నాతో అలా మాట్లాడద్దు.

634
00:37:33,921 --> 00:37:35,005
నాతో అలా మాట్లాడద్దు.

635
00:37:35,589 --> 00:37:36,715
నాతో అలా మాట్లాడద్దు.

636
00:37:38,175 --> 00:37:40,135
సరే, నీకిది వినిపిస్తుందేమో చూద్దామా, హా?

637
00:37:40,969 --> 00:37:44,681
నువ్వు చేసిన ఆ పిచ్చి టీవీ షో
నీకు గుర్తుందా?

638
00:37:44,765 --> 00:37:48,268
నిన్ను మాంచెస్టర్ సిటీ నుంచి బయటకి
పంపేయడానికి నువ్వే దారి ఇచ్చావు.

639
00:37:49,269 --> 00:37:50,687
చూడు ఇప్పుడు ఎక్కడున్నావో.

640
00:37:51,313 --> 00:37:55,359
కొంతమంది అమెచ్యూర్లతో కలిసి పనికిరానిది
చేస్తున్నావు. ఏమనుకోకండి. ఏమనుకోకండి.

641
00:38:00,697 --> 00:38:02,741
నేను మాట్లాడుతూంటే వెళ్ళకు, పిరికిపందా.

642
00:38:07,287 --> 00:38:08,872
దేవుడా. అబ్బా.

643
00:38:12,334 --> 00:38:13,544
ఆ. సరే.

644
00:38:13,627 --> 00:38:15,003
నువ్వది ఉచితంగా తీసుకోవచ్చు.

645
00:38:15,087 --> 00:38:18,048
-పదండి వెళ్ళాలి.
-నీకు గొడవ పడాలని ఉందా? రా.

646
00:38:18,131 --> 00:38:20,634
-నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు.
-తలుపు చూసుకోండి.

647
00:38:21,844 --> 00:38:22,845
అయ్యో.

648
00:39:29,119 --> 00:39:31,788
కోచ్ లాసో

649
00:39:34,750 --> 00:39:35,959
హలో, కోచ్ లాసో.

650
00:39:36,460 --> 00:39:37,836
మీ ఓటమికి బాధగా ఉంది.

651
00:39:38,378 --> 00:39:40,631
ఓహ్, కొత్త సైకిల్ కి ధన్యవాదాలు.

652
00:39:41,173 --> 00:39:43,884
అది మీ మంచితనం
కానీ అలా చేయవలసిన అవసరం లేదు.

653
00:39:46,553 --> 00:39:47,596
కోచ్ లాసో?

654
00:39:50,849 --> 00:39:54,269
నాకు పదహారేళ్ళ వయసులో
మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు.

655
00:39:56,772 --> 00:40:00,776
అది నాతో, మా అమ్మతో జరిగింది.

656
00:40:03,570 --> 00:40:04,947
అయ్యో, టెడ్.

657
00:40:05,697 --> 00:40:09,451
దాని నుంచి నా సమస్యలు
మొదలయ్యాయేమో నాకు తెలియదు.

658
00:40:09,535 --> 00:40:11,537
అవును. ఖచ్చితంగా దాని నుంచే.

659
00:40:11,620 --> 00:40:13,038
అవును. అందులో అర్థం ఉంది.

660
00:40:16,124 --> 00:40:17,751
మీకు ఇప్పుడు దాని గురించి
మాట్లాడాలని ఉందా?

661
00:40:20,420 --> 00:40:23,799
లేదు. లేదు, ఇప్పుడు కాదు.
నేను లోపలికి టీమ్ దగ్గరకి వెళ్ళాలి.

662
00:40:23,882 --> 00:40:25,092
నేను మీకు చెప్దామని చేశాను.

663
00:40:27,511 --> 00:40:30,055
సరే, నాకు చెప్పినందుకు ధన్యవాదాలు, టెడ్.

664
00:40:30,597 --> 00:40:32,349
నా అవసరం వస్తే,
దయచేసి ఫోన్ చెయ్యండి.

665
00:40:32,432 --> 00:40:33,433
నేను చేస్తాను.

666
00:40:34,476 --> 00:40:35,978
నేను చేస్తాను, నన్ను క్షమించండి.
నేను చేస్తాను.

667
00:40:36,061 --> 00:40:38,480
అది పరవాలేదు. గుడ్ నైట్, టెడ్.

668
00:40:47,364 --> 00:40:48,532
హే, కోచ్!

669
00:40:50,409 --> 00:40:51,410
ఏంటి?

670
00:40:55,330 --> 00:40:56,331
మీరు బానే ఉన్నారా?

671
00:40:56,415 --> 00:40:59,042
ఓహ్, హా. లేదు...
ఒక ఫోన్ చెయ్యడానికి వచ్చాను.

672
00:41:01,628 --> 00:41:04,047
-కష్టమైన రాత్రి కదా, హా?
-అవును.

673
00:41:04,131 --> 00:41:05,340
సరే, మీరు...

674
00:41:06,550 --> 00:41:09,469
మనం ష్రైబర్, లైవ్ చేద్దామా, హా?

675
00:41:09,553 --> 00:41:11,555
దాని గురించి…

676
00:41:12,806 --> 00:41:16,059
నాకు మీతో రావాలని లేదు. నేను దీని నుంచి
బయటకి రావాలనుకుంటున్నాను.

677
00:41:18,270 --> 00:41:20,189
అలాగే, సరే. తప్పకుండా.

678
00:41:20,272 --> 00:41:21,273
మీరు నాతో వస్తారా?

679
00:41:21,773 --> 00:41:24,484
నేను హేన్రీకి ఫేస్ టైమ్ చేస్తానని
మాట ఇచ్చానని మీకు తెలుసు కదా.

680
00:41:24,568 --> 00:41:27,404
వాళ్ళ స్కూల్ లో ఒక రిసైటల్ ఉంది,
నాకది ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉంది.

681
00:41:27,487 --> 00:41:30,115
నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను.
సరేనా? హా.

682
00:41:30,199 --> 00:41:34,077
హే. హే, హే,
జాగ్రత్తగా ఉండు, సరేనా?

683
00:41:35,329 --> 00:41:36,330
-అలాగే.
-సరే.

684
00:41:36,413 --> 00:41:38,749
రేపటి సంగతి మర్చిపోకు.

685
00:41:39,458 --> 00:41:42,461
గేమ్ ఫిలింకి కాఫీ తీసుకురావడం నీ వంతు.

686
00:41:42,544 --> 00:41:43,670
-సరే.
-తొందరగా, ఆలస్యం చేయకుండా.

687
00:41:48,300 --> 00:41:50,052
హే, కోచ్, ఒక్కొక్క అడుగు.

688
00:41:53,263 --> 00:41:54,598
నా ఉద్దేశం అది కాదు, కానీ...

689
00:42:32,970 --> 00:42:35,806
ఇంతకు ముందు
మాంచెస్టర్ సిటీ రిచ్మండ్ ని

690
00:42:35,889 --> 00:42:40,519
ఎఫ్ఏ కప్ సెమీ ఫైనల్ లో ఐదు-నిల్
అద్భుతమైన గోల్స్ తో ఓడించింది.

691
00:42:41,687 --> 00:42:44,982
గొలాయత్ డేవిడ్ కి తన స్థానం చూపించాడు.

692
00:42:45,065 --> 00:42:47,401
ఇదిసామ్ ఒబిసాన్య
గేమ్ తరువాత ఇంటర్వ్యూ.

693
00:42:48,235 --> 00:42:51,655
అది... అది... అది కష్టం.
అది కష్టం…

694
00:42:52,656 --> 00:42:54,491
అభిమానులను నిరాశపరిచినందుకు క్షమించండి.

695
00:42:55,242 --> 00:42:57,202
మేము ఓడిపోయాం. చాలా చెత్తగా.

696
00:42:59,037 --> 00:43:00,247
కానీ మేము ప్రయత్నించాం.

697
00:43:00,873 --> 00:43:02,416
మేము చాలా కష్టపడి
ఆడగలిగినంత బాగా ఆడాము,

698
00:43:02,499 --> 00:43:07,796
నాకు అది పరవాలేదు ఎందుకంటే అన్నిటికన్నా
ఘోరం అస్సలు ప్రయత్నించకపోవడం.

699
00:43:08,547 --> 00:43:11,925
ప్రయత్నం చేయాలంటే భయం వేస్తుంది,
ఎందుకంటే మీరు చాలా కోల్పోవచ్చు.

700
00:43:12,801 --> 00:43:14,845
కానీ మీరు మీ మనస్పూర్తిగా చెయ్యాలి.

701
00:43:16,346 --> 00:43:17,764
లేకపోతే లాభం ఏంటి?

702
00:43:18,390 --> 00:43:20,017
బాంటర్ ఎల్.డి.ఎన్152

703
00:43:20,100 --> 00:43:21,101
ధన్యవాదాలు.

704
00:43:26,356 --> 00:43:29,234
కొత్త మెసేజ్
కు: సామ్ ఒబిసాన్య

705
00:43:30,903 --> 00:43:34,156
ఇప్పుడే నీ ఇంటర్వ్యూ చూశాను.

706
00:43:35,657 --> 00:43:39,953
ఇక్కడే ఉన్నావా?

707
00:43:47,461 --> 00:43:51,882
నేను 152 వార్గ్రేవ్ స్క్వేర్
SW11 లో ఉంటాను.

708
00:44:06,104 --> 00:44:07,105
అవును.

709
00:44:21,995 --> 00:44:23,830
నాకు నీ అడ్రెస్ ఎందుకు పంపావు?

710
00:44:24,498 --> 00:44:25,499
మరోసారికి.

711
00:45:19,511 --> 00:45:21,513
ఉపశీర్షికలు అనువదించింది
మైథిలి

